అనువాదలహరి

Silence… Marianne Moore

మా నాన్నగారు అంటుండేవారు:

“గొప్పవాళ్ళెప్పుడూ ఎవరిళ్ళలోనూ ఎక్కువరోజులుండరు.

వాళ్ళకి లాంగ్ ఫెలో సమాధి(1)ని గాని

హార్వర్డ్ లోని “గాజుపువ్వుల”(2) ని గాని చూపిస్తే చాలు.

ఆత్మనిర్భరత గల పిల్లి

ఏకాంతంలోకి తన ఆహారమైన ఎలుకని తీసుకుపోయి

మూతినుండి దానితోక షూ లేసులా వేలాడుతున్నా

ఎలా ఆశ్వాదించగలదో… అలా

ఒక్కోసారి వాళ్లు ఏకాంతాన్ని ఆశ్వాదించగలరు.

వాళ్లకి బాగా ఇష్టమైన సంభాషణేచ్ఛని కూడా

అప్పుడు వాళ్ళనుండి దూరం చెయ్యొచ్చు.

ఎందుకంటే, గాఢమైన అనుభూతులు

మౌనంలోనే ఎక్కువప్రస్ఫుటంగా వ్యక్తమవగలవు.

మౌనం అంటే ఏమీమాటాడని మౌనంకాదు,

మాటాడుతూ మాటాడుతూ, మధ్యమధ్య

ఆవేశాల్ని నిగ్రహించుకుందికి ప్రయత్నించే మౌనం…”

అంతేకాదు,

అతను “మీరు మా ఆతిథ్యం స్వీకరించండి”

అన్నప్పుడు అందులో కపటం లేదు.

ఎప్పుడూ ఇక్కడే ఉంటే, వాళ్లు అతిథులెట్లా అవుతారు?

.

మేరియాన్ మూర్

(November 15, 1887 – February 5, 1972)

అమెరికను కవయిత్రి.

[ప్రత్యేక విషయాలు:

1. లాంగ్ ఫెలో సమాధి: ఇది Henry Wadsworth Long Fellow  సమాధి. అమెరికలోని మెసాచ్యూట్స్ రాష్ట్రంలోని కేంబ్రిడ్జ్ లో ఉంది. దీనికి అమెరికాలోని మొట్టమొదటి గార్డెన్ సిమెటరీ అన్న పేరు ఉంది. ఇందులో లాంగ్ ఫెలో సమాధితో పాటు, హెన్రీ జేమ్స్, ఏమీ లోవెల్, రాబర్ట్ క్రీలీ … ల సమాధులు కూడా ఉన్నాయి.

2. హార్వర్డ్ గాజుపూలు: అపురూపమైన ఈ గాజుపూలు కూడా మెసాచ్యూట్స్ లోని కేంబ్రిడ్జ్ లోనే Harvard Museum of Natural History లో ఉన్నాయి. Leopold and Rudolf Blaschka అన్న తండ్రీ కొడుకుల కళాకారుల జంట 1887నుండి 1936 మధ్యలో సుమారు 847 రకాల పుష్పజాతులకు చెందిన పూలను గాజుతో సృష్టించేరు. ఈ పువ్వులని హార్వర్డ్ లో విద్యార్థులకి వృక్షశాస్త్రాన్ని బోధించడానికి వినియోగించినా, అవి అపూర్వ కళాఖండాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ]

ఈ కవితలో కవయిత్రి గొప్పవాళ్ళ కొన్ని అలవాట్ల గురించి ప్రస్తావిస్తోంది.  వాళ్ళు సాధారణంగా ఎవరిమీదా ఆధారపడరు. వాళ్లకి సంభాషణ అంటే (వ్యక్తులతో కలయిక) చాలా ఇష్టం. కాని, కొన్ని అద్భుతమైన విషయాలను పరిశీలించిన తర్వాత, ఇంత సంభాషణా ప్రియులూ కూడా మౌనంలోకి వెళ్ళిపోయి, ఆ మౌనాన్ని ఆశ్వాదిస్తుంటారు. ఎందుకంటే, ఆ మౌనంలో వాళ్లు ఈ అపురూపమైన వస్తువులను చూసినప్పుడు కలిగిన గాఢమైన అనుభూతులని మననం చేసుకుంటూ ఆనందిస్తారు. వాళ్లు చాలా బిడియపరులు. ఎక్కువకాలం ఎవరింటిలోనూ అతిథులుగా ఉండడానికి ఇష్టపడరు.

.

English: American poet and writer Marianne Moo...

Marianne Moore

Photo credit: Wikipedia

.

Silence

.

My father used to say,

“superior people never make long visits

have to be shown Longfellow’s grave

or the glass flowers at Harvard.

Self-reliant like the cat–

that takes it prey to privacy,

the mouse’s limp tail hanging ike a shoelace from its mouth—

they sometimes enjoy solitude,

and can be robbed of speech

by speech which has delighted them.

The deepest feeling always shows itself in silence;

not in silence, but restraint.”

Nor was he insincere in saying : Make my home your inn.”

Inns are not residences.

..

Marianne Moore

American Modernist Poet

(November 15, 1887 – February 5, 1972)

Notes:

1. Long Fellow’s Grave: This is  Henry Wadsworth Long Fellow’s Grave at Cambridge, Massachusetts in USA. It is renowned as the First Garden Cemetary in America.  The residents Besides Longfellow include  Amy Lowell,  Henry James and Robert Creely.

2. Harvard Glass Flowers: This is an amazing collection of flowers of 847 varieties of plant species in Glass made by Father-Son pair of artists Leopold and Rudolf Blaschka between 1887 and 1936, for about half a century. They are now at the Harvard Museum of Natural History, located in the same place as above. It is said that they were used in teaching Botany to students of Harvard. But they are recognized as great works of art in their own right.

%d bloggers like this: