అనువాదలహరి

జనప్రవాహాన్ని చూస్తుంటే… ఏ ఈ హౌజ్మన్, ఇంగ్లండు

అద్దెకు దిగిన ఈ లాడ్జిలోంచి
వీధిలో వెచ్చగా ఊపిరులూదుకుంటూ
ఒకరివెనక ఒకరు ఉత్సవ ప్రభల్లా
వెళుతున్న జనసందోహాన్ని చూస్తుంటే…

ప్రేమక్రోధాల ఆవేశాలు నిజంగా
ఈ మాంస గృహంలో బలీయమైనవయితే
నేను శాశ్వతంగా నివసించవలసిన
ఆ మట్టింటి గురించి కాస్త ఆలోచించనీండి.

అగోచరమైన ఆ దేశంకాని దేశంలో
పూర్వఛాయలేవీ అక్కడ మిగిలుండవు
అక్కడ ప్రతీకారాలు మరుగునపడతాయి
ద్వేషించినవాడికి ద్వేషం గుర్తుండదు.

రెండువరుసల్లో నిద్రిస్తున్న ప్రేమికులు
పక్కనున్నవారు ఎవరు అని అడగరు
రాత్రిగడిచిపోతునా, పెళ్ళికొడుకు
పెళ్ళికూతురుదగ్గరకి చేరుకోడు.

.

ఏ ఈ హౌజ్మన్

26 March 1859 – 30 April 1936

ఇంగ్లండు 

.

మరణాంతే వైరం అని మనకి ఒక సామెత ఉంది.  మన భారతీయ చింతన ప్రకారం, మరణానంతరం మృతుడికి ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలతోనూ బంధం తెగిపోతుంది. (అందుకే అర్జంటుగా చట్టం ప్రవేశించింది అక్కడ)  అతని అప్పులూ, ఆస్తులూ, శత్రుమిత్రకళత్రాదులన్నిటితో సహా. ఈ భావనని కవి ఎంత అందంగా చెప్పేడో గమనించండి.  అందుకు ఎన్నుకున్న సందర్భంకూడా చూడాలి. మనకి ఆనందంలో ఉన్నప్పుడు వైరాగ్య స్థితి ఉండదు. మనకి కష్టాలు కమ్ముకున్నప్పుడూ, ముదిమి పైబడ్డప్పుడూ ఎక్కడలేని తాత్త్విక చింతనా బయలుదేరుతుంది. కవి ఎప్పుడూ తాత్త్వికుడు కావాలి అని సూచించడానికా అన్నట్టు, మేడమీదనుండి క్రింద జరుగుతున్న (బహుశా) ఒక కార్నివాల్ చూస్తున్నప్పుడు కవికి, మృత్యువుగురించీ, కామక్రోధాలగురించీ, వాటి నశ్వరత గురించీ ఆలోచన వచ్చి ఉంటుంది. ఆఖరి వాక్యాలు, జాషువాగారి శ్మశానవాటిని తలపిస్తాయి, కొంచెం తేడాతో.      

English: English classical scholar and poet .
English: English classical scholar and poet . (Photo credit: Wikipedia)

When I watch the Living Meet

.

When I watch the living meet,
 And the moving pageant file,
 Warm and breathing through the street
 Where I lodge a little while,

If the heats of hate and lust
 In the flesh of house are strong,
 Let me mind the house of dust
 Where my sojourn shall be long.

In the nation that is not,
 Nothing stands that stood before
 There revenges are forgot,
 And the hater hates no more;

Lovers lying two and two
 Ask not whom they sleep beside,
 And the bridegroom all through night
 Never turns him to the bride.

.

 AE Housman

26 March 1859 – 30 April 1936

English classical scholar and poet

Poem Courtesy:

Twentieth Century Poetry in English, Ed. Michael Schmidt.

2 thoughts on “జనప్రవాహాన్ని చూస్తుంటే… ఏ ఈ హౌజ్మన్, ఇంగ్లండు”

 1. పద్యం చదువుతున్నప్పుడు తట్టని ఒక చక్కని ఆలోచన మీ వ్యాఖ్యలో బైటపడినప్పుడు ఆనందం కలిగింది మూర్తి గారూ! సుఖాలలో ఉన్నప్పుడు లేని తాత్త్విక చింతన నిర్వేదంలో పడినప్పుడు చేయడం ..నిజమే..మానవ బలహీనతల్లో ఒక ప్రధాన భాగమే. తద్విరుద్ధంగా ఇక్కడ కవి ఒక సంతోష సందర్భంలో అంతిమ మజిలీ కావలి లోకాన్ని గురించిన చింతన చేయడం..ఓహ్..కవి పరిపక్వత పద్దులో ..ఇంత కన్నా పెద్ద .entry ఇంకేముంటుంది? చాలా చక్కటి గీతాన్ని అంతే చక్కని పదజాలంతో అనువదించిన మీ ప్రజ్ఞకు ఎప్పటిలా వందనం సార్!

  మెచ్చుకోండి

 2. హనుమంతరావుగారూ,

  కవి రెండు మంచి ప్రయోగాలు చేశాడు ఇందులో. కవి తాత్త్వికతని సాధారణంగా వాళ్ళు వాడే పదజాలం పట్టి ఇస్తుంది. ఒకటి Flesh of house (House of Flesh అని మనం అన్వయం చేసుకోవచ్చు Prose Order లో); రెండోది House of Dust . ఈ రెండూ మన భారతీయ చింతనకి దగ్గరగా ఉన్న మాటలే. మొదటిసారి ఈ పద్యం చదువుతున్నప్పుడు ఈ పదబంధాలు చదివినప్పుడు చెప్పలేని అనుభూతి కలిగింది. ఇటువంటి గొప్ప కవులెప్పుడూ దేశకాలాలతో నిమిత్తం లేకుండా మన ఆలోచనలని ఉదాత్తంగానూ, కాళ్లని నేలమీద ఉండేట్టు చేస్తారుగదా అని అనిపించింది.
  మీ ఆత్మీయమైనలో స్పందనలో నాకు సోదరవాత్సల్యం కనిపిస్తుంటుంది ఎప్పుడూ.

  అభివాదములతో

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: