అద్దంలో చూసుకుంటూ… థామస్ హార్డీ, ఇంగ్లండు
అద్దంలో నన్ను నేను చూసుకుంటూ
ముదిమితేరుతున్న చర్మాన్ని చూసి అనుకున్నాను:
“దేముడికి ఆలోచనవచ్చి చర్మమంత పల్చగా
హృదయాన్ని కూడా కృంగదీస్తే ఎంతబాగుండును!”
ఎందుకంటే, అప్పుడు,
నాపట్ల నిర్లిప్తంగా ఉండే హృదయాలను చూసి
ఏ బాధలూ లేకుండా, నిశ్చింతగా
అంతులేని విశ్రాంతికి ఒంటరిగా ఎదురుచూడొచ్చు.
కానీ, కాలం ఉందే, నన్ను ఏడిపించడానికి
కొన్ని లాక్కుని, కొన్ని వదిలేస్తుంది;
ఈ జీవన సంధ్యలో శుష్కించిన శరీరంలో
మధ్యాహ్నపు గుండెగుబుళ్ళు రగుల్కొల్పుతుంది.
.
థామస్ హార్డీ
(2 June 1840 – 11 January 1928)
బ్రిటిషు నవలా కారుడూ, కవీ.
.

beautiful … oka 30 yellu mundukelli aalochinchinattu undi naakaithe ..
మెచ్చుకోండిమెచ్చుకోండి