అనువాదలహరి

ఆడకుక్క … స్మిత మీనాక్షి, మలయాళం, భారతీయ కవయిత్రి

నేను రోజూ క్రమంతప్పకుండా

వరండామీదే పడుక్కుంటాను.

 

మీరు రోజూ ఉదయాన్నే మొట్టమొదటగా,

తలుపుతీసి బయటకొచ్చినపుడు ముందు కాళ్ళను నేలకి ఆనించి,

బారజాపి మీపాదాలకి సాష్టాంగం పెడతాను.

 

మీరు వాకిట్లోకి దిగగానే,

మీపాదాలనొకసారి చుట్టి, నాకి, నా ముఖాన్ని ఆంచి,

మీకు రాత్రి నిద్ర బాగా పట్టిందా అని పలకరిస్తాను.

తోకాడించుకుంటూ,

మరొక రాత్రిగడపడానికి అనుమతించినందుకు కృతజ్ఞతతో,

కళ్ళు తిప్పుతూ, మీరు తిరిగొచ్చేదాకా ఇక్కడే ఉంటానని చెబుతాను.

 

సాయంత్రంవేళ మీరు ఇంటికొచ్చినప్పుడు

గుమ్మమ్ముందు నిలబడి స్వాగతం చెబుతాను.

అయ్యో! బాగా అలిసిపోయారే! శ్రమెక్కువయిపోయిందా?”

అని ప్రేమగా ప్రశ్నిస్తూ, మీ కాళ్లమధ్యలో కదలాడుతూ,

మీరు ముందు నడవండి, మీ వెనకే నేను అనుసరిస్తా,”

అని ప్రేమగా అంటాను.

మీరు తిరిగి నా వంక చూస్తూ, “ఇక్కడే ఉండు”

అన్న ఒక్క మాట చాలు, నా జీవితం ధన్యమైనదని భావిస్తాను.

అంతకుమించి నేనేమీ కోరను.

అయినా సరే

ఒకసారో రెండుసార్లో అనుకుంటాను

నేను సన్నగా అరిచినందుకు

మీదపడతానన్న భయంతోనో, హద్దులుమీరాననో

ఇంట్లోంచి అవతలకి విసిరేయడం గుర్తుంది.

 

గేటులోంచి అవతలకి తరిమేస్తూ

మీరు నా మీద విసిరిన Batదెబ్బకి

నా వెనకకాలు ఎముక విరిగినా ఓ అరుపు అరిచి,

వెంటనే లేచి నిలబడి, నోటితో Batపట్టుకుని

మూడుకాళ్లతోనే వరండామీదకి కుంటుకుంటూ వచ్చి

అక్కడ ఉంచి వెనుదిరిగిపోయేను.

ఎందుకంటే మళ్ళీసారి కోపంవచ్చినపుడు కొట్టాలంటే

పాపం Batకోసం మీరు వెతుక్కోవద్దూ?

(Poem Courtesy: http://poetrans.wordpress.com)

.

స్మిత మీనాక్షి

మలయాళం

భారతీయ కవయిత్రి

(ఆంగ్లానువాదం: అనితా వర్మ) 

.

ఈ కవిత పైకి ‘ఆడకుక్క’ గురించి రాసినట్టు కనిపిస్తున్నా, ఇది ఆడకుక్క గురించి వ్రాసిన కవిత కాదు. అదే నిజమైతే ఇది కవిత అయుండేది  కాదు.  కాని, దాన్ని ఒక ప్రతీకగా వాడుకుని వ్రాసిన అద్భుతమైన స్త్రీవాద కవిత.  మలయాళంలో ప్రతీకాత్మకమైన చాలా గొప్ప కవిత్వం వస్తోంది. మనం వాళ్లనుండి తెలుసుకోవలసినదీ, అహం పక్కకిపెట్టి ఆలోచించగలిగితే, నేర్చుకోవలసినదీ చాలానే ఉంది. ఈ మాట నేను ఈ మధ్యం వేలంవెర్రిగా వస్తున్న ప్రేమ కవితలను ఉద్దేశించి అంటున్నది. భావకవిత్వం రోజుల్లోకూడా ఇలాంటి పోకడలు మితిమీరి,  కవిత్వం అంటే సామాన్యులకి ఏవగింపుకలిగేలా చేశాయి.

పైన ఇచ్చిన లింకు మలయాళంలోంచి కొన్ని మంచికవితలను ఎంపికచేసి ఇంగ్లీషులోకి ఒక అనువాదకుల మండలి అనువాదం చేసి ప్రచురిస్తున్న బ్లాగు.

.

Smitha Meenakshy
Image Courtesy: http://poetrans.wordpress.com

.

The Bitch

.

I slept regularly on the verandah

First thing in the morning,

as you open the door and emerge,

A deep bow, forepaws pressing on the ground,

As you come down to the yard,
A nuzzle, licking and pressing my face to your leg,
Asking whether you slept well..
Wagging the tail, in thanks for another night granted,
A movement of the eyes, telling you that I will wait till you are back

When you reach back at eventide,
A welcome from the doorstep..
‘Are you tired, are you overtaxed?’,
Loving queries, winding between your legs
‘Walk ahead, I will follow’, a love-filled statement,

My life found fulfillment in your return look, ‘be around’

This was all I asked for;

Still,

It was for barking once or twice in low-key,
Fearing incursion and trespassing,
That I was thrown out…

While I was being shooed out the gate,
Even though the bat flung after me
Broke half the bone of my hind leg,
I gave a howl,
Got up hurriedly,
Hobbled up to the verandah on three legs
With the bat in my mouth,
Deposited it there and went away
You should not have to search for the bat in order to hit another sixer..

Written by SMITHA MEENAKSHY

Translated by : ANITHA VARMA

The poem looks so simple and about a female dog.  But no.  If it is really about a bitch, it would not have become a poem at all.  Just think bitch as a metaphor and have a relook at the poem. You will come to know what a lovely feminist poem this is. A panel of translators are translating some of the best poetry from Malayalam to English and posting it in a blog. Here is the link: http://poetrans.wordpress.com

Please visit and enjoy some fine poetry there.

%d bloggers like this: