సైద్ధాంతిక విరోధి … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను

నేను మరణిస్తాను

మృత్యువుకి నేను చెయ్యగలిగినసాయం అదొక్కటే!

అతను శాలలోంచి తన గుర్రాన్నిబయటకి నడిపిస్తున్నాడు;

ధాన్యంకొట్లో నేలమీద నాడాలు చప్పుడు చేస్తున్నాయి

అతను చాలా తొందరలో ఉన్నాడు; క్యూబాలో పనుంది,

బాల్కన్స్ లో వ్యవహారం చక్కబెట్టుకోవాలి,

ఉదయాన్నే చాలామందితో మాటాడాలి.

అతను జీను పట్టుకుని గుర్రాన్ని ఎక్కేటప్పుడు

నే నేమీ కళ్ళాలు పట్టుకోను.

చేతులు మెట్టులా పెట్టి ఎక్కడానికి సాయం చెయ్యను.

.

నా భుజాల మీద కొరడాతో కొట్టనీ, అయినా

నేను వేటమృగాలెటుపరిగెత్తేయో చెప్పను;

నా గుండెమీద గుర్రపు డెక్కతొక్కిపెట్టి అడగనీ,

చిత్తడినేలలో దాక్కున్న నల్లకుర్రాడి ఆచూకీ ఇవ్వను.

నేను మరణిస్తాను, నే మృత్యువుకి చేసే సాయం అదొక్కటే

అతను నాకేమీ జీతబత్తాలిచ్చిపోషించడం లేదు.

.


నా స్నేహితులెక్కడున్నారో చెప్పమన్నా చెప్పను;

శత్రువుల చిరునామాలైనా సరే, ఇవ్వను;

నన్నతను ఎంతగా ప్రలోభపెట్టనీ,

ఎవరింటికైనా ఎలావెళ్ళలో చెప్పనుగాక చెప్పను;

జీవం తొణికిసలాడే ఈ నేలమీద నేనేమైనా గూఢచారినా,

ఒక మనిషిని మృత్యువుకి పట్టి అప్పగించడానికి?

సోదరా! భయం లేదు. మన నగర చిత్రపటమూ,

దాని సంకేత పదమూ నా దగ్గర భద్రం; నావల్ల

నువ్వు ఎన్నడూ ఎవరికీ వశమవవని మాట ఇస్తున్నా.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

(February 22, 1892 – October 19, 1950)

అమెరికను

కవులు యుద్ధాలకి వ్యతిరేకంగా గళం ఎత్తడం పరిపాటే.  ఈ కవితలో  మిలే చేసింది కూడా అదే. అయితే, యుద్ధసమయంలో ఎన్ని పాచికలు శత్రువులు వేస్తారో చెబుతూనే, మృత్యువును  ఒక ఆశ్వికుడిగా మానవీకరించి యుద్ధానికి తన మద్దతులేదని  నిర్ద్వంద్వంగా చెబుతోంది. ప్రాణం విలువ చాటిచెప్పే మరొక మంచి కవిత ఇది.

.

Portrait of Edna St. Vincent Millay (1933-01-14)

.

Conscientious Objector

.

I shall die, but
that is all that I shall do for Death.
I hear him leading his horse out of the stall;
I hear the clatter on the barn-floor.
He is in haste; he has business in Cuba,
business in the Balkans, many calls to make this morning.
 But I will not hold the bridle
 while he clinches the girth.
And he may mount by himself:
I will not give him a leg up.

Though he flick my shoulders with his whip,
I will not tell him which way the fox ran.
With his hoof on my breast, I will not tell him where
the black boy hides in the swamp.
I shall die, but that is all that I shall do for Death;
I am not on his pay-roll.

I will not tell him the whereabout of my friends
nor of my enemies either.
Though he promise me much,
I will not map him the route to any man’s door.
Am I a spy in the land of the living,
that I should deliver men to Death?
Brother, the password and the plans of our city
are safe with me; never through me Shall you be overcome.

Edna St. Vincent Millay

(February 22, 1892 – October 19, 1950) American Lyrical  poet and Playwright

poem courtesy: http://www.americanpoems.com/poets/ednamillay/7274

An excellent commentary on this poem can be found here:
http://contagiousloveexperiment.wordpress.com/2009/07/05/day-37-conscientious-objection-i-shall-die-but-that-is-all-i-shall-do-for-death/

“సైద్ధాంతిక విరోధి … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను” కి 6 స్పందనలు

 1. Good poem. Very different expression, indeed. Thanks a lot dear Translator.

  మెచ్చుకోండి

  1. Karimulla garu,

   Thank you so much for your very warm encouraging comments.

   with very best regards

   మెచ్చుకోండి

 2. కవిహృదయాన్ని అశ్వహృదయంలో చెప్పించిన కవిత నా వరకూ చాలా కొత్తగా..ఉత్తేజంగా..ఉత్తమంగా ఉంది మూర్తి సార్! మంచి కవితతో నా ఉదయాన్నితట్టి లెపినందుకు ధన్యవాదాలు ముర్తి గారూ!

  మెచ్చుకోండి

  1. హనుమంత రావుగారూ,

   ఎడ్నా విన్సెంట్ మిలే అపురూపమైన కవయిత్రి. ఆమె కవిత కంటబడితే చదవకుండా ఉండలేము. చదవడంప్రారంభిస్తే బుర్రకి పదునుపెట్టకుండా ఉండలేము.

   నేను ఈ కోణం చూడలేదు. మృత్యువును ఆశ్వికుడితో పోల్చడం వరకే చూశాను. ఇలా ఆలోచిస్తే ఇంకా బాగుంది గాని, మొదటి స్టాంజాలో కొన్ని వాక్యాలు అలా అనుకుందికి ఆస్కారం ఇవ్వడం లేదు.

   అభివాదములతో

   మెచ్చుకోండి

 3. Respected sir
  your translation is more beautiful than original poem
  really the translation is heart touching, smooth, beautiful
  with regards
  advocatemmmohan

  మెచ్చుకోండి

  1. Mohan garu,

   Thank you so much for your very encouraging comments
   with best regards

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: