అనువాదలహరి

సైద్ధాంతిక విరోధి … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను

నేను మరణిస్తాను

మృత్యువుకి నేను చెయ్యగలిగినసాయం అదొక్కటే!

అతను శాలలోంచి తన గుర్రాన్నిబయటకి నడిపిస్తున్నాడు;

ధాన్యంకొట్లో నేలమీద నాడాలు చప్పుడు చేస్తున్నాయి

అతను చాలా తొందరలో ఉన్నాడు; క్యూబాలో పనుంది,

బాల్కన్స్ లో వ్యవహారం చక్కబెట్టుకోవాలి,

ఉదయాన్నే చాలామందితో మాటాడాలి.

అతను జీను పట్టుకుని గుర్రాన్ని ఎక్కేటప్పుడు

నే నేమీ కళ్ళాలు పట్టుకోను.

చేతులు మెట్టులా పెట్టి ఎక్కడానికి సాయం చెయ్యను.

.

నా భుజాల మీద కొరడాతో కొట్టనీ, అయినా

నేను వేటమృగాలెటుపరిగెత్తేయో చెప్పను;

నా గుండెమీద గుర్రపు డెక్కతొక్కిపెట్టి అడగనీ,

చిత్తడినేలలో దాక్కున్న నల్లకుర్రాడి ఆచూకీ ఇవ్వను.

నేను మరణిస్తాను, నే మృత్యువుకి చేసే సాయం అదొక్కటే

అతను నాకేమీ జీతబత్తాలిచ్చిపోషించడం లేదు.

.


నా స్నేహితులెక్కడున్నారో చెప్పమన్నా చెప్పను;

శత్రువుల చిరునామాలైనా సరే, ఇవ్వను;

నన్నతను ఎంతగా ప్రలోభపెట్టనీ,

ఎవరింటికైనా ఎలావెళ్ళలో చెప్పనుగాక చెప్పను;

జీవం తొణికిసలాడే ఈ నేలమీద నేనేమైనా గూఢచారినా,

ఒక మనిషిని మృత్యువుకి పట్టి అప్పగించడానికి?

సోదరా! భయం లేదు. మన నగర చిత్రపటమూ,

దాని సంకేత పదమూ నా దగ్గర భద్రం; నావల్ల

నువ్వు ఎన్నడూ ఎవరికీ వశమవవని మాట ఇస్తున్నా.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

(February 22, 1892 – October 19, 1950)

అమెరికను

కవులు యుద్ధాలకి వ్యతిరేకంగా గళం ఎత్తడం పరిపాటే.  ఈ కవితలో  మిలే చేసింది కూడా అదే. అయితే, యుద్ధసమయంలో ఎన్ని పాచికలు శత్రువులు వేస్తారో చెబుతూనే, మృత్యువును  ఒక ఆశ్వికుడిగా మానవీకరించి యుద్ధానికి తన మద్దతులేదని  నిర్ద్వంద్వంగా చెబుతోంది. ప్రాణం విలువ చాటిచెప్పే మరొక మంచి కవిత ఇది.

.

Portrait of Edna St. Vincent Millay (1933-01-14)

.

Conscientious Objector

.

I shall die, but
that is all that I shall do for Death.
I hear him leading his horse out of the stall;
I hear the clatter on the barn-floor.
He is in haste; he has business in Cuba,
business in the Balkans, many calls to make this morning.
 But I will not hold the bridle
 while he clinches the girth.
And he may mount by himself:
I will not give him a leg up.

Though he flick my shoulders with his whip,
I will not tell him which way the fox ran.
With his hoof on my breast, I will not tell him where
the black boy hides in the swamp.
I shall die, but that is all that I shall do for Death;
I am not on his pay-roll.

I will not tell him the whereabout of my friends
nor of my enemies either.
Though he promise me much,
I will not map him the route to any man’s door.
Am I a spy in the land of the living,
that I should deliver men to Death?
Brother, the password and the plans of our city
are safe with me; never through me Shall you be overcome.

Edna St. Vincent Millay

(February 22, 1892 – October 19, 1950) American Lyrical  poet and Playwright

poem courtesy: http://www.americanpoems.com/poets/ednamillay/7274

An excellent commentary on this poem can be found here:
http://contagiousloveexperiment.wordpress.com/2009/07/05/day-37-conscientious-objection-i-shall-die-but-that-is-all-i-shall-do-for-death/

%d bloggers like this: