అనువాదలహరి

సుందర నదానికి…. ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను

ఓ సుందర నదమా*! స్ఫటికంలా స్వచ్ఛంగా,

తళుకులీనుతూ, జలజలా గలగలా

పరుగులిడి ప్రవహించే నీటితో,

నీ సయ్యాటల హేలతో, మనసులో

ఏ దాపరికమూలేక తుళ్ళిపడే ఆల్బెర్టో కూతురిలా,

రాశీభూత సౌందర్యపుజిగికి నీవొక ప్రతీకవు.
.

ఆమె ఒకసారి తన నీడని నీలో చూసుకునే వేళ

అది ఒకపక్క మెరుస్తూనే, ఆర్ద్రతతో వణుకుతుంది;

ఎందుకంటే,అప్పుడు, అంత అందమైన సెలయేటివీ

తనని ఆరాధిహించే ప్రియునిలా కనిపిస్తావు;

అతని మనసులోనూ, నీ తరంగాలమీదలా

ఆమె ప్రతిబింబం గాఢంగా ముద్రించబడి ఉంది;

అతని మనసుకూడా గుండేలోలోతులను పరిశీలించే

ఆమె నిశితమైన చూపులకి వణుకుతుంటుంది.
.

ఎడ్గార్ ఏలన్ పో

అమెరికను.

(*నదం అన్న మాట ఇక్కడ దాని అసలు అర్థంలో వాడలేదు. నదికి పర్యాయపదంగా వాడబదినది అని మనవి.)

.

[Notes:

1. ఈ కవిత అన్ని ప్రతులలోనూ  నది పెరుని కవి ఎక్కడా ప్రస్తావించలేదు.  1945 వరకూ ఎవరూ దీని దురించి ప్రస్తావించలేదు కూడా. కానీ, Richard L Lord లార్డ్ బైరన్ పో అన్న నది మీద వ్రాసిన పంక్తులు ఆధారంగా, తనపేరుకీ, నదిపేరుకీ ఉన్న శబ్దసామ్యాన్ని గుర్తించి అందుకే బహుశా పో నదిపెరు ప్రస్తావించి ఉండడని ఒక ఆలోచన లేవనెత్తాడు.  ‘పో’ అన్న పేరుగల నది ఉత్తర ఇటలీలో తూర్పుగా సుమారు 250 మైళ్ళ పొడవు  ప్రవహించే నది.

2. ఆల్బెర్టో కూతురు: ఈ ఆల్బెర్టో కూతురు ఎవరా అని చాలా ఊహాగానాలున్నాయి. కొందరు ప్రముఖ ఇటాలియన్ రచయిత Boccaccio వ్రాసిన  డెకమెరోన్ (పదిరాత్రులు) అన్న కథల సమాహారంలో,  మొదటి రాత్రి చెప్పబడే కథలో వచ్చే డాక్టరు ఆల్బెర్టో,  ప్రేమగా కూతురులా భావించే అందమైన బాలవితంతువు అని అంటే, ఈ కవితలో ప్రశంసిస్తున్న స్ఫటికంవంటి శీలం ఆధారంగా, ఎలిజబెత్ 1 మహారాణి కాలంలోని ప్రముఖ నాటకకర్తల జంట… బ్యూమాంట్  మరియు ఫ్లెచర్ లు వ్రాసిన  “The Fair Maid of the Inn” అన్న నాటకంలోని Biancha గా మరి కొందరు గుర్తిస్తున్నారు. ]

.

English: Edgar Allen Poe, poet and writer, com...

.

To The River…

.

Fair river! in thy bright, clear flow
 Of crystal, wandering water,
 Thou art an emblem of the glow
 Of beauty- the unhidden heart-
 The playful maziness of art
 In old Alberto’s daughter;

But when within thy wave she looks-
 Which glistens then, and trembles-
 Why, then, the prettiest of brooks
 Her worshipper resembles;
 For in his heart, as in thy stream,
 Her image deeply lies-
 His heart which trembles at the beam
 Of her soul-searching eyes.
.
 Edgar Allen Poe

[Interesting Sidelights:
 1. The Poet did not mention the name of the river in any version of this poem. Mr Richard J Lord, in 1945, observed that the poet deliberately avoided mentioning the name of the river just by playing on the pun its name rersembling his. (The PO, Padus or Eridanus in Latin, is a river flowing eastwards across North Italy. Lord Byron Wrote a poem on the River Po…titled … “Stanzas To The PO.”

2. Alberto’s daughter: Some believe this could refer to Biancha, the fair maid of the Elizabethan Play “The Fair Maid of the Inn” by Beaumont and Fletcher. The reason could be the reference of purity of the girls. However, some others think, it is from Boccaccio’s Decameron (Ten Nights), refering to the beutiful young widow whom an elderly physician Alberto treats as his daughter. The story appears in the first night.

%d bloggers like this: