అనువాదలహరి

సందు మలుపులో… ఛార్ల్స్ హేన్సన్ టౌన్, అమెరికను

.

అంతులేని ఈ మహానగరంలో, సందు మలుపులోనే

నాకొక మంచి చిన్ననాటి స్నేహితుడున్నాడు,

అయినా రోజులు, వారాలు వెళ్ళిపోతున్నాయి,

నేను గుర్తించేలోపునే ఒక ఏడాది గడిచిపోయింది.  

 

నా స్నేహితుడిని నేను కలవడం అవడం లేదు.

జీవితం ఒక పరుగులా, అంతా హడావుడైపోయింది.

మా చిన్నప్పుడు వాళ్ళింటి తలుపు నేను తట్టినరోజులూ

మా ఇంటి బెల్లు అతని మ్రోగించిన రోజులూ లానే

తనంటే నాకు ఇష్టమని అతనికికూడా తెలుసు,

ఇప్పుడు ఇద్దరికీ తీరికలేదు, అలసిపోయాం.

 

ఈ జూదం ఆడలేక, ఆడలేక విసుగెత్తుతోంది

పేరుతెచ్చుకుందికి పాకులాడలేక అలుపువస్తోంది

“హుం, జిమ్ కి రేపు ఫోను చేద్దాంలే!” అనుకుంటాను నేను,

“అతన్ని మరిచిపోలేదని తనకి గుర్తుచెయ్యడానికి.”

కానీ, ఆ రేపు రానూ వస్తుంది, పోనూ పోతుంది

మా ఇద్దరి మధ్యా దూరం అలా పెరుగుతూనే ఉంటుంది. 

 

వీధి చివర మలుపులోనే, కాని అందనంత దూరంలో,

“మీకు టెలిగ్రాం సర్,” “జిమ్ ఇవాళే చనిపోయాడు”

చివరికి మనకి అదే మిగులుతుంది, దానికే నోచుకుంటాం

వీధిచివర మలుపులోనే, స్మృతిలో మిగిలిపోయిన మిత్రుడు.

.

ఛార్ల్స్ హేన్సన్ టౌన్

(5 Oct 1889 – 28 Feb 1949)

అమెరికను

.

Charles Hanson TowneImage Courtesy: http://www.yourdailypoem.com
Charles Hanson Towne
Image Courtesy: http://www.yourdailypoem.com

Around The Corner

.

Around the corner I have a friend,

In this great city that has no end,

Yet the days go by and weeks rush on,

And before I know it, a year is gone.

And I never see my old friends face,

For life is a swift and terrible race,

He knows I like him just as well,

As in the days when I rang his bell.

And he rang mine but we were younger then,

And now we are busy, tired men.

Tired of playing a foolish game,

Tired of trying to make a name.

‘Tomorrow’ I say! ‘I will call on Jim

Just to show that I’m thinking of him’,

But tomorrow comes and tomorrow goes,

And distance between us grows and grows.

Around the corner, yet miles away,

‘Here’s a telegram sir,’ ‘Jim died today.’

And that’s what we get and deserve in the end.

Around the corner, a vanished friend.

.

Charles Hanson Towne

(5 Oct 1889 – 28 Feb 1949)

American

Charles Hanson Towne (1877-1949) was an author, editor, professor, and poet. Born in Louisville, Kentucky, his family moved to New York City when Charles was just a toddler. By the time he was eleven, Charles was writing and publishing his own magazine; he grew up to edit several of New York’s most esteemed periodicals, including Harper’s Bazaar.

(Bio Courtesy: http://www.yourdailypoem.com/listpoem.jsp?poem_id=790)

Poem Courtesy: http://archive.org/stream/aworldwindowsan00towngoog#page/n10/mode/2up

%d bloggers like this: