పరిహాసానికి పరాకాష్ఠ … ఆలివర్ వెండెల్ హోమ్స్ , అమెరికను

.

మాంఛి సంతోష సమయంలో ఒకసారి
నేను నాలుగు మాటలు రాసేను కవితలా.
అలవాటు ప్రకారం, చదివినవాళ్ళు
ఓహో అద్భుతంగా ఉంటుందని అంటారనుకున్నాను.
అవి ఎంత సరసంగా, అద్భుతంగా ఉన్నాయంటే
మామూలు పరిస్థితుల్లో అంత అసభ్యంగా గట్టిగా నవ్వనినేనే
పగలబడి నవ్వలేక చచ్చాను.

మా పనివాడిని పిలిచేను. అతనొచ్చేడు;
నాలాంటి అర్భకుడు పిలవగానే వచ్చేడంటే
అతనెంత మంచివాడో కదా!
అతను మంచి అవయవపుష్టి ఉన్నవాడు.
“ఇవి ప్రింటరుకి తీసుకెళ్ళి ఇవ్వు” అన్నాను,
అంటూ, ఇలా అలవాటైన హాస్యధోరణిలో
చిన్నమాట జోడించాను (వేళాకోళానికి):
“తర్వాత వాడి తిప్పలు వాడుపడతాడులే”  అని. 
తను కాగితం తీసుకుని, అందులోకి
తొంగి చూడడం నేను గమనించేను.
మొదటి వాక్యం చదవగానే
అతనిముఖం నిండా చిరునవ్వు అలుముకుంది
తర్వాత రెండో వాక్యం చదవగానే,
నవ్వు ఇంకా వెడల్పుగా చెవులదాకా పాకింది;
మూడో వాక్యం చదవగానే,
కుహుకుహుమని నవ్వడం
నేను విన్నాను.
నాలుగో వాక్యం చదివేసరికి నవ్వు హ్హొహ్హొహ్హో ల్లోకి దిగింది.
ఐదవది చదివి నడుముకున్న పట్టీ ఫట్ మంది…
ఆరోది చదివేక చొక్కాకి  ఐదు గుండీలు ఫట్ తెగిపోయాయి..
ఇంక ఆపుకోలేని నవ్వి నవ్వి అపస్మారకంలోకి వెళిపోయేడు.
పదిరోజులపాటు రాత్రీ పగలూ నిద్రలేకుండా
పాపం, ఆ అమాయక ప్రాణిని కనిపెట్టుకున్నాను.

ఆ రోజు తర్వాత మళ్ళీ నేను
హాస్య రచన చెయ్యడానికి ప్రయత్నిస్తే ఒట్టు!.

.

ఆలివర్ వెండెల్ హోమ్స్

The Height of the Ridiculous
.
I wrote some lines once on a time
In wondrous merry mood,
And thought, as usual, men would say
They were exceeding good.
They were so queer, so very queer,
I laughed as I would die;
Albeit, in the general way,
A sober man am I.
I called my servant, and he came;
How kind it was of him
To mind a slender man like me,
He of the mighty limb.
“These to the printer,” I exclaimed,
And, in my humorous way,
I added (as a trifling jest,)
“There ’ll be the devil to pay.”
He took the paper, and I watched,
And saw him peep within;
At the first line he read, his face
Was all upon the grin.
He read the next; the grin grew broad,
And shot from ear to ear;
He read the third; a chuckling noise
I now began to hear.
The fourth; he broke into a roar;
The fifth; his waistband split;
The sixth; he burst five buttons off,
And tumbled in a fit.
Ten days and nights, with sleepless eye,
I watched that wretched man,
And since, I never dare to write
As funny as I can.
.
Oliver Wendell Holmes
American

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: