అనువాదలహరి

ఒక నాటు రోడ్డు ప్రక్క దృశ్యం… మేరీ లూయిజ్ హెర్సే అమెరికను

ఈ “కేప్ కాడ్” ఆకాశం క్రింద

ప్రతి పొలం పక్కనా, రాతిమడుగు పక్కనా

కళ్ళులేని ముఖంలా పదే పదే ఎదురౌతున్న

శుష్కించిన గాదెలు చూస్తున్నా.

.

ఎండకీ ఎండి, వానకి తడిసి, మట్టికొట్టుకుని

రాటుదేరిన నిర్మలంగా చూసే పిల్లల్ని పిలిచే

పని పాట్లతో గరుకెక్కి, గంతలుబడిన

ఆ స్త్రీ చేతుల్ని నేను మరువలేను.

.

సౌందర్యమూ, శ్రమా ఒకే ‘కాడి’కి జతకూర్చినట్టు

అటు బొద్దుగా, గుండ్రంగా

దిసమొలతొ పిల్లలూ

ఇటు వంగి కృషిచేస్తున్న కర్షకస్త్రీలూ.

.

మేరీ లూయిజ్ హెర్సే

అమెరికను

.

Country Road
.
I can’t forget a gaunt grey barn
Like a face without an eye
That kept recurring by field and tarn
Under a Cape Cod sky.

I can’t forget a woman’s hand,
Roughened and scarred by toil
That beckoned clear-eyed children tanned
By sun and wind and soil.

Beauty and hardship, bent and bound
Under the self-same yoke:
Babies with bare knees plump and round
And stooping women folk.
.
Marie Louise Hersey
American

[Poem courtesy: Anthology of Massachusetts Poets. 1922   Ed: William Stanley Braithwaite, (1878–1962).]

%d bloggers like this: