అనువాదలహరి

గాఢ హేమంతంలో … ఏమీ లోవెల్, అమెరికను

ఇష్టుడా! మనిద్దరం

తోటలోపూసే పుష్పాలవంటి వాళ్ళమి.

ఒకరు ఊదారంగయితే రెండోవారు ఎరుపు.

ఒంటరిగా ఓమూల వాడిపోయిన ఈ తోటలో

.

ఈ వనంలోని మొక్కలన్నీ పీకి కొత్తవి వేసేరు

ఒక ఎండిపోయిన ఆకు రెండోదానిని రాసుకుంటూ

నాటి పూరేకుల సంగీతం ప్రతిధ్వనితోంది.

ఇప్పుడు నువ్వూ నేనే దానికి తలలూచేది.

.

మనతో ఎన్నో కలిసి ఉండేవి; అన్నీ నేడు వాడిపోయేయి.

ఇప్పుడు మనిద్దరమే ఎరుపూ ఊదారంగుల్లో మిగిలున్నాం;

మంచు కడిగిన సుప్రభాతవేళల్లో మనిద్దరమే

సూర్యుడు ఎదుగుతుంటే రాగరంజితులమై మెరిసేది.

.

మసక వెన్నెట్లో ఒకోసారి నిన్ను సరిగా చూడలేనపుడూ

తర్వాత, నా వేళ్ళు చలికి కొంకర్లుపోయినప్పుడూ

ఉదయమెపుడవుతుందా అని ఆదుర్దాతో ఎదురుచూస్తుంటాను

ఏమవుతుందోన్నభయం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు.

.

నువ్వో … లేక నేనో… నేను పిరికిని

మంచు కెంపురంగునే తీసుకుపోవాలి,

ఊదారంగు ఒక చక్కనైన రంగు

ఏకాంతంలో కూడా అందంగా కనిపించగలదు.  

.

విరిగి చివికిపోయిన ఎన్నో కొమ్మలమీద 

ఇప్పుడు మనం  తలలూచుతున్నాం  

మనకిక ఎన్నో ఉషోదయాలు మిగిలిలేవు.

అందుకే,ఇష్టుడా! నువ్వంటే నాకు ప్రేమ.

.

ఏమీ లోవెల్

అమెరికను

(February 9, 1874 – May 12, 1925)

.

(Note: Frimaire అంటే ఫ్రెంచి రివల్యూషనర్య్ కేలెండరులో నవంబరు 21 నుండి డిసెంబరు 20 వరకు ఉన్న మూడవనెల. అప్పుడు మంచుతీవ్రంగా కురిసేదట.)

ఏమీ లోవెల్ ఇక్కడ తీసుకున్న సందర్భం … ఈనాటి ఒకరిద్దరు సంతానాలతోగాక, పెద్దకుటుంబంలో పుట్టినవాళ్ళకి పరిచయం, అనుభవైకం. ఇక్కడ పూలు తోబుట్టువులకి ప్రతీకలనుకుంటే, రెండే రెండు పూలు మిగిలిన సందర్భం ఊహించుకుంటే ఈ కవిత బాగా అర్థమౌతుంది. “దీర్ఘాయువు అన్నివేళలా వరం కాదు” అన్నభావాన్ని ఈ కవితాఖండిక ఎంతో అందంగా చెబుతుంది. అందులో మళ్ళీ (తను ఎరుపు తనతోబుట్టువు ఊదారంగు) తను పిరికినని చెబుతూ, “ఈ చలికాలం కెంపుని తీసుకుపోవాలి. ఊదారంగు ఒంటరిగా కూడా అందంగా ఉండగలదు” అన్న మాటలు ఆత్మీయమైన భావనలకి పరాకాష్ఠ. బహుశా ఒక్క సోదరి మాత్రమే తన సోదరుడి గురించి అలా అనుకోగలదు.

.   

Lowell as a child
Lowell as a child (Photo credit: Wikipedia)

 .

Frimaire*
.
Dearest, we are like two flowers
Blooming in the garden,
A purple aster flower and a red one
Standing alone in a withered desolation.

The garden plants are shattered and seeded,
One brittle leaf scrapes against another,
Fiddling echoes of a rush of petals.
Now only you and I nodding together.

Many were with us; they have all faded.
Only we are purple and crimson,
Only we in the dew-clear mornings,
Smarten into color as the sun rises.

When I scarcely see you in the flat moonlight,
And later when my cold roots tighten,
I am anxious for morning,
I cannot rest in fear of what may happen.

You or I—and I am a coward.
Surely frost should take the crimson.
Purple is a finer color,
Very splendid in isolation.

So we nod above the broken
Stems of flowers almost rotted.
Many mornings there cannot be now
For us both. Ah, Dear, I love you!

.

[Note: *Frimaire (in the French Revolutionary calendar) the third month of the year, extending from November 21 to December 20]

Amy Lowell

(February 9, 1874 – May 12, 1925)

American

%d bloggers like this: