ఈ యుగపు ఆర్తి .. హేమ్లిన్ గార్లాండ్, అమెరికను
.
నేను న్యాయంగా ప్రవర్తించాలంటే ఏమిటి చెయ్యాలి?
నేను సంపాదనకి ఏ మార్గాన్ని అవలంబించాలి?
ఈ ప్రపంచానికీ— ఇక్కడి దుఃఖానికి ఏమిటి చెయ్యాలి?
ఈ సంక్లిష్ట కూడలిలో సరియైన దారి చూపించు (ప్రభూ!)
నా తెలితక్కువదనం నుండీ, దుఃఖము నుండీ కడతేర్చి
బాధని ఎలా నివారించాలో ఉపదేశించు!
నా వేలికున్న ఉంగరాన్ని ఊడబెరికి
గుమ్మం ముందర నిలబడ్డ యాచకునికి ఇద్దునా?
నా దగ్గర ఉన్న ప్రతి విలువైన వస్తువునీ తీసి
పేదల చేతులలో ఉంచుదునా?
నేను న్యాయబద్ధంగా ఉండడానికి ఏమిటి చెయ్యాలి?
పేదలూ ధనికులూ సమానంగా గౌరవించే
ఓ జ్ఞానులారా! నాకు బోధించండి!
నా మనసు నీతిగా బ్రతకడానికి ఊవ్విళ్ళూరుతోంది.
.
Hamlin Garland
.
The Cry of the Age: By Hamlin Garland
(This being a Copywright Material it cannot be produced here. )
Please visit the following link to see the Original Poem published in The Outlook, November 29, 1902, page 740.