అనువాదలహరి

నేను పాడుకుంటూ వస్తా… జేకబ్ అస్లాండర్, అమెరికను

.

వానవెలిసిన తర్వాత కోసిన పచ్చిక

గుప్పుమని వేసే కమ్మని వాసనలనీ;

పొట్టమీదున్న చేలోని గింజలమీంచి

సుతారంగా జారే చల్లటి నీటిబిందువుల అలలనీ;

మైదానం మీద తేలిపోతూ, ముంచెత్తుతున్న వెలుగునీ

పాడుకుంటూవస్తాను.

.

శరత్కాలంలో విరగబూచిన పువ్వుల్నీ;

లోయలలో ప్రతిధ్వనించే పిలుపులకి

గుంపులు గుంపులుగా ఎగిరే పిచ్చుకలనీ;

ఆ పిచ్చుకలని చెల్లాచెదరుచేసే పడమటి గాలినీ

ఆలపిస్తూ వస్తాను;

.

డిసెంబరు నెలలో కత్తిలాకోసే పదునైన తెల్లని మంచునీ;

నివురుగప్పుతున్న సూర్యాస్తమయవేళ, రివ్వుమని వీచే

విసురుగాలికి  ఉక్కులా పారే చిక్కనైన చీకటినీ;

నక్షత్రాలని ఉక్కులా తీవ్రంగా సానబట్టే

చిమ్మ చీకటి పాదముద్రలనీ

ఉచ్ఛస్వరంలో పాడుకుంటూ వస్తాను.

.

జేకబ్ అస్లాండర్

అమెరికను

.

దురదృష్టవశాత్తూఈ కవి గురించి ఏ సమాచారమూ నాకు దొరక లేదు. ఎవరైనా ఇవ్వగలిగితే కృతజ్ఞుణ్ణి.

.

I come singing the keen sweet smell of grass
Cut after rain,
And the cool ripple of drops that pass
Over the grain,
And the drenched light drifting across the plain.

I come chanting the mad bloom of the fall.
And the swallows
Rallying in clans to the rapid call
From the hollows,
And the wet west wind swooping down on the swallows.

I come shrilling the sharp white of December,
The night like quick steel
Swung by a gust in its plunge through the pallid ember
Of dusk, and the heel
Of the fierce green dark grinding the stars like steel.
.

(from: The New Republic)

Jacob Auslander

American

(I deeply regret I could not collect any biographic information about the poet. I will be obliged if any reader could provide me information or any link to his bio.) 

Poem Courtesy: William Stanley Braithwaite, ed. (1878–1962). Anthology of Magazine Verse for 1920.

You can hear the poem here:

http://poetrymoment.blogspot.in/2007/12/i-come-singing-by-jacob-auslander.html

%d bloggers like this: