అనువాదలహరి

తిరుగుబాటుదారు … జాన్ గోల్డ్ ఫ్లెచెర్, అమెరికను కవి

అతని కళ్ళకి గంతలు కట్టండి

పాదాల దగ్గర తుపాకులు ఓటమితో

అంతిమ విషణ్ణ మృత్యుగీతాలాలపించనిండి

.

అతని శరీరం మీద దుప్పటి కప్పండి

ఇక అది కదిలే పని లేదు;

తనకోసం ప్రాణాలర్పించినవారి వల్ల

సత్యం మరింత ధృఢంగా నిలబడుతుంది

.

అతనిపుడు తన స్వంత

రహస్య స్థావరం చేరుకున్నాడు;

అందులోకి చొరబడడానికి మనం సాహసిస్తే

ప్రాణహీనమైన ఈ ముఖాన్ని చూసే అవకాశం ఉండదు

.

జాన్ గోల్డ్ ఫ్లెచెర్

(January 3, 1886 – May 10, 1950) 

అమెరికను కవి, రచయితా, ఆధునిక చిత్రకళలో  నిపుణుడు 

.

John_Gould_Fletcher

Image Courtesy: http://en.wikipedia.org/wiki/John_Gould_Fletcher

.

A Rebel

.

Tie a bandage over his eyes,

And at his feet

Let rifles drearily patter

Their death-prayers of defeat.


Throw a blanket over his body,

It need no longer stir;

Truth will but stand the stronger

For all who died for her.


Now he has broken through

To his own secret place;

Which, if we dared to do,

We would have no more power left

to look on that dead face.

.

John Gould Fletcher

(January 3, 1886 – May 10, 1950)

American Poet, Author and Authority on Modern Painting 

%d bloggers like this: