అనువాదలహరి

విశ్వాత్మ… రూమీ, పెర్షియన్ కవి, సూఫీ తత్త్వవేత్త.

ఈ మాటలు నేను ఇప్పుడు చెబుతున్నవి కావు,

కాలాదినుండి వెలుగు తూలికతో రాసినవి.

సత్యానికి రంగూ లేదు, వాసనా లేదు

ఏ ఒకరి ప్రయాసలవల్లా, ప్రమాణాలవల్లా

ఉత్పన్నమయేది, నిరూపించబడేదీ కాదు

 

నువ్విక్కడికి రప్పింపబడ్డావు గనుక

నీకో స్వర్గ రహస్యం చెబుతాను విను:

“ఎవ్వరేమి చెప్పినా, ఏమి రాసినా

ఆ రాసింది నువ్వే… స్వయంగా నువ్వే!

నువ్వే జీవితానికి వాహికవి;

ఈ విశ్వానికి ఆత్మవి!

సంచరిస్తున్నా, సమాధిలో ఉన్నా,

వేదనలోనూ, నిస్పృహలోనూ

నీ జీవిత పర్యంతమూ

నీ వెంట నువ్వే పరిగెడతావు.

 

“కానీ అది నీకు తెలీదు, తెలుసుకో లేవు!

నువ్వు ప్రేమకి పరాకాష్ఠవి. నువ్వే!

నిక్షిప్తమైన నిధివీ,

ఆగోచరమైన రహస్యానివీ,

స్వర్లోక నందనోద్యానవనానివీ,

అత్యున్నత స్వర్గ శిఖరానివీ… నువ్వే.

ఎందుకు? ఏమిటి? ఎలాగ? అన్న ప్రశ్నలపరంపరతో

సందేహాల శృంఖలాలతో, నువ్వు నీ దరికి చేరుకుంటావు.

 

“ఎవ్వరేమి చెప్పినా, ఏమి రాసినా

ఆ రాసింది నువ్వే… స్వయంగా నువ్వే!

నువ్వే జీవితానికి వాహికవి;

నువ్వే ఈ విశ్వానికి ఆత్మవి!

నువ్వు ప్రేమకి పరాకాష్ఠవి.

నిక్షిప్తమైన నిధివీ,

ఆగోచరమైన రహస్యానివీ, అన్నీ నువ్వే!

 

“ఇక్కడే కాదు, విశ్వమంతటా.

ఈ క్షణమే కాదు, ఏ రోజైనా సరే.

ఇది సార్వజనీనిక సత్యం:

అందరిలో నువ్వున్నావు; నీలో అందరూ ఉన్నారు.

మౌనానివీ నువ్వే,

శబ్దానివీ నువ్వే,

ఎందుకు, ఎలాగ అన్న సందేహాల సంగ్రామాలనుండి

చివరకి నీదగ్గరకి చేరుకునేదీ నువ్వే!”

 

ఇపుడు నీకు ప్రమాణం చేసి చెబుతున్నా:

“అన్నీ విన్న తర్వాత,

అన్నీ చూసిన తర్వాత,

నువ్వు మేల్కొని, నిర్భీతితో చరిస్తే

ఇహంలోనే కాదు, పరంలో కూడా నువ్వు వంద్యుడవే!

ఒక అంగమో, ఒక ఉపాంగమో కాకుండా

ఇపుడు నువ్వే మూలానివి!

 

“కనుక, లే! రెక్కతొడిగి విహాయసవీధుల్లో విహరించు!

నిష్ఫలమైనవీ, త్యజించబడినవాటినుండీ దూరంగా  జరిగిపో! 

నీ స్వయంప్రకాశపు వెలుగులలోకి ఎగిరిపో!

అక్కడనీకు బంగారు బహుమానం లభిస్తుంది:

అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువుతో ఐక్యత! “

.

రూమీ (జలాలుద్దీన్ ముహమ్మద్ రూమీ)

(30 సెప్టెంబరు 1207 – 17 డిసెంబరు 1273)

పెర్షియన్ కవి, సూఫీ  తత్త్వవేత్త.

.

Jalal ad-Dīn Muhammad RumiImage Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi
Jalal ad-Dīn Muhammad Rumi
Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi

.

These Words, I do not say them now!

From the beginning of Time,

I wrote them with the Plume of Light.

Truth has no scent, neither it has a hue.

It is not made of their ado–

or of their solemn swears.

 

Now that you are called upon here,

I confide in You, this heavenly covert:

“Whatever they said– and whatever they wrote,

is You, yourself!

You are the Vessel of Life,

And the Soul of this world!

Hidden or unveiled, your whole life–

you run after yourself– in distress and despair.

 

And you know not, you know not!

You are the Zenith of Love, yourself!

You are-

the hidden treasures yourself,

the veiled secrets yourself,

The Garden of Eden–

and The Seventh Heaven;

Returning to yourself–

from the chain of queries,

from the queue of Whys and Hows.

 

Whatever they said– and whatever they wrote,

is You, yourself!

You are the vessel of life,

And the soul of this world!

You are–

The Zenith of Love,

Yourself, the Hidden Treasures,

Yourself, the Veiled Secrets, Yourself!”

 

Not only here, but everywhere!

Not just in this hour, but everyday!

With each and everyone,

All in You, You in All.

You are the silence–

and you are the voice,

retuning to yourself from the crusade–

of Whys and Hows.

****

I swear to You now:

“Having seen it all,

Having heard it all–

and yet awakened, unafraid,

You are noble in Heavens and Earth!

No more just a shell, no more just a part,

You are now The Heart!”

Thus, Soar up and high!

Soar away from the forsaken–

and from the spoiled!

Soar up to the sphere of your own light!

And there, you will receive– the golden prize–

of the Unison with The Beloved.

 .

Rumi

(30 September 1207 – 17 December 1273)

Persian poet, jurist, theologian, and Sufi mystic.

.

Courtesy:

 Translation: Maryam Dilmaghani, June 2010, New Brunswick

.

%d bloggers like this: