అనువాదలహరి

నేను శృంఖలాల బద్ధుణ్ణి… అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్, రష్యను

ఓ గులాబి కన్నియా! నేను శృంఖలాల బద్ధుణ్ణి.

అయినా, ఈ బంధాల కాపలాదారులను చూసి సిగ్గుపడను;

దట్టమైన కొమ్మలగుబురులలో కోకిలకూడ బందీనే,

ఆ రెక్కల రేడు వనవాణికవులలో కలికితురాయి;

కంటికింపైన ఒక సొగసరి గులాబికి

చూపు మరల్చలేని మధురమైన దాస్యం చేస్తూ…

ఇంద్రియ నిగ్రహాలను సడలించగల చీకటి ముసుగు వివశతలో,

ఆమెకై లలితమధురమైన కుహుకుహూ రాగాలాలపిస్తుంది…

.

అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్

6 June  1799 – 10 February 1837

రష్యను

.

English: Alexander Pushkin
English: Alexander Pushkin (Photo credit: Wikipedia)

.

I am in Chains

.

I am in chains, O maiden-rose,
And yet, not shameful of these guards;
A nightingale, thus, – in dense laurels –
A feathered king of the woods’ bards,
A proud and charming rose over,
In a sweet bondage – lives for long
And softly sings for her a song
Under a sensual night’s cover.

.

Alexander Pushkin

(6 June [O.S. 26 May] 1799 – 10 February [O.S. 29 January] 1837)

Translated by Yevgeny Bonver, March 11, 2005

Poem Courtesy:

http://www.poetryloverspage.com/yevgeny/pushkin/i_am_in_chains.html

%d bloggers like this: