నగరపు పై కప్పులు… ఛార్ల్స్ హేన్సన్ టౌన్, అమెరికను కవి ఇంటికప్పులారా! ఇంటికప్పులారా! మీరేం దాస్తున్నారు? దుఃఖితుల్నీ, దుష్టుల్నీ, జ్వలిస్తున్న ప్రేమికుల్నీ, మేధావుల్నీ, మూర్ఖుల్నీ, దిక్కులేని దీనుల్నీ; ఇంటికప్పులు, ఇంటికప్పులు దాస్తున్నై చింతలూ, వంతలూ. . ఇంటికప్పులారా! ఇంటికప్పులారా! మీ రే పాపాలు చూస్తున్నారు? మీ మీదుగా ఆకాశంలో బొల్లిమబ్బులై కొట్టుకుపోతున్నై, క్రింద సంవేదనలూ, దుఃఖాలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నై ఎప్పటిలా, పాతపాటే, జీవనపోరాటం కొనసాగించడానికి. . ఇంటికప్పులారా! ఇంటికప్పులారా! దౌర్భాగ్యులు, బందీలూ, పేరుచెప్పాలంటే జాలేస్తుంది… వాళ్ల మానాల్ని కాపాడండి: చుక్కల్ని మరుగుపరచడానికే మిమ్మల్ని మనిషి నిర్మించాడు ఇంటికప్పులారా! ఇంటికప్పులారా! మీరు లక్షల లోపాల్ని దాచండి. . ఇంటికప్పులారా, ఇంటికప్పులారా, మీరేం దాస్తారో నేనెరుగుదును వేనవేల విషాదాలనీ, ఇంకెంతమందో ఒంటరి ప్రేమికుల్నీ; హా! క్రిక్కిరిసిన ఈ నగరంలో సజీవంగా ఉన్న మంచినీ ఓరిమిగల భార్యల్నీ, మమతా, జాలీ, క్షమా , నమ్మకాల్నీ కననీరు. . ఇంటికప్పులారా, ఇంటికప్పులారా! నాకు ఇందుకాశ్చర్యం వేస్తుంది: మీరు విషపుమొక్కల్లా దట్టంగా వ్యాపించేరు, క్రిందమనుషులూ బుద్ధిహీనులే; అయినా కొందరు మాత్రం పాపం, దిక్కూ దివాణం లేక తిరుగాడుతుంటారు నగరంలో తెట్టులా కొట్టుకొస్తూ… కొంపగాని, నెత్తిమీద కప్పుగాని లేక. . ఛార్ల్స్ హాన్సన్ టౌన్ ( 1877 – 1949) అమెరికను కవి. . City Roofs . Roof-Tops, roof-tops, what do you cover? Sad folk, bad folk, and many a glowing a lover; Wise people, simple people, children of despair— Roof-tops, roof-tops, hiding pain and care. Roof-tops, roof-tops, O what sin you’re knowing, While above you in the sky the white clouds are blowing; While beneath you, agony and dolor and grim strife Fight the olden battle, the olden war of life. Roof-tops, roof-tops, cover up their shame— Wretched souls, prisoned souls too piteous to name; Man himself hath built you all to hide away the stars— Roof-tops, roof-tops, you hide ten million scars. Roof-tops, roof-tops, well I know you cover Many solemn tragedies and many a lonely lover; But ah, you hide the good that lives in the throbbing city— Patient wives, and tenderness, forgiveness, faith and pity. Roof-tops, roof-tops, This is what I wonder: You are thick as poisonous plants, thick the people under; Yet roofless, and homeless, and shelterless they roam, The driftwood of the town who have no roof-top and no home! . Charles Hanson Towne ( 1877 – 1949) American Poet. Poem Courtesy: The Second Book of Modern Verse a Selection of the Work of Contemporaneous … Ed. By Jessie Rittenhouse, Page 55 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిమార్చి 9, 2013