అనువాదలహరి

దుఃఖంతో చెలిమి .. ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, అమెరికను

నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకుని

“కష్టం గట్టెక్కిపోతుందిలే.

భవిష్యత్తులో మంచిరోజులకోసం చూడు.

ఈ రోజు సంగతి మరిచిపో!” అని ఆమెకు చెప్పకు.

నీకింకా చెప్పాలని ఉంటే,

కష్టాలు వృధాగా రావనీ,

అవి కలిగించే బాధకన్నా మిన్నగా

నేర్చుకోగల గుణపాఠాలుంటాయని చెప్పు.

.

“నువ్వు త్వరలోనే ఇనన్నీ మరిచిపోతావులే”… అంటూ,

అరిగిపోయినఓదార్పువచనాలతో ఆమెని మోసగించకు;

అది చేదు నిజం అన్న మాట నిజమే,

కానీ, విచారించవలసిన విషయం;

“ఇతర వ్యాపకాలపై మనసు తిప్పుకో” మనీ

“ఉల్లాసం కలిగించే విషయాలు వెతుక్కో” మనీ

సలహాలివ్వకుండా, బాధల పంజరంలో చిక్కుకున్న

ఆమె మళ్ళీ తియ్యగా పాడగలిగేటట్టు అనునయించు.

.

ఆమె ధైర్యంగా ముందుకెళ్ళేందుకు ప్రోత్సహించు.

బల్లెమూ, డాలూ పుచ్చుకుని శత్రువునెదుర్కొన్నట్టుగాక

ఇద్దరు ఆప్తమిత్రులు కలుసుకున్నట్టు,

అపరిచితుల్ని స్నేహపూర్వకంగా పలకరించనీ.

బడలి దుమ్ము పేరుకున్న ఆమె రెక్కలను

పట్టుసడలకుండా పట్టుకోమను,

దుఖం తనవెంట ఎప్పుడూ తోడుతెచ్చే

ఆశీస్సుల గుసగుసలు జాగ్రత్తగా ఆలకించమని చెప్పు.
.

ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్

(30 October 1825 – 2 February 1864)

అమెరికను

Adelaide Anne Procter

Adelaide Anne Procter

Image Courtesy: Wikipedia.

.

Friend Sorrow.

.

Do not cheat thy Heart and tell her,

“Grief will pass away,

Hope for fairer times in future,

And forget to-day.”—

Tell her, if you will, that sorrow

Need not come in vain;

Tell her that the lesson taught her

Far outweighs the pain.

.

Cheat her not with the old comfort,

“Soon she will forget”—

Bitter truth, alas—but matter

Rather for regret;

Bid her not “Seek other pleasures,

Turn to other things:”—

Rather nurse her caged sorrow

‘Till the captive sings.

Rather bid her go forth bravely.

And the stranger greet;

Not as foe, with spear and buckler,

But as dear friends meet;

Bid her with a strong clasp hold her,

By her dusky wings—

Listening for the murmured blessing

Sorrow always brings.

.

Adelaide Anne Procter

(30 October 1825 – 2 February 1864)

American Poet

(From  Legends and Lyrics, Series 1)

%d bloggers like this: