సరైన జీవనమార్గం ఏది?… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి
ఏది సరైన జీవన విధానం?
ఏదోలా చేసెయ్యడం సులువుగా కనిపించినప్పుడు
కష్టమైనా నీశక్తిమేరకు సవ్యమైనదే చెయ్యడం;
దైనందిన జీవితంలోని ఈతి బాధలని
పదే పదే నెమరువేసుకుని కాలంవృధా చేసేకంటే,
తాలిమితో, చిరునవ్వుతో స్వీకరించడం;
ప్రశ్నార్థకాలు ముసురుకుంటున్నా
మాటలలో ఆశావాదాన్ని వీడకపోవడం;
తరచు నీ అదృష్టాన్ని తలుచుకుంటూ,
కృతజ్ఞతకలిగి, నీ కష్టాల్ని మౌనంగా అంగీకరించడం;
నాకీ కష్టాలెందుకని ప్రశ్నించకపోవడం;
జీవితం అంతా ఒక అత్యుత్తమమైన ప్రణాళికగా మన్నించి
ప్రతి సందర్భాన్నీ అందులో ఒక భాగంగా ఆహ్వానించడం;
కష్టపడి పనిచెయ్యడం, చేసే పనిని ప్రేమించడం
దేవునిపై* నమ్మకముంచి, పదిమందికి ఉపయోగపడేందుకూ,
స్పష్టమైన ముందుచూపు ప్రసాదించమనీ ప్రార్థించడం;
ఇదే సరియైన జీవనమార్గం, భగవంతునికి ప్రీతిపాత్రమైనది
నువ్వు యూదువో, అన్యమతస్థుడివో, నాస్తికుడవో ఎవరివైనా సరే…
.
ఎలా వ్హీలర్ విల్ కాక్స్
(November 5, 1850 – October 30, 1919)
అమెరికను కవయిత్రి
.
*(Note: ఇక్కడ కవయిత్రి భావన క్రీస్తు. అందుకే ఆఖరిపాదంలో ఈ మతప్రస్తావన రాదు.)

.
What Is Right Living?
.
What is right living?
Just to do your best
when worst seems easier;
To bear the ills of daily life
with patient cheerfulness;
Nor waste dear time recounting them;
To talk Of hopeful things
when doubt is in the air;
To count your blessings often, giving thanks,
and to accept your sorrows silently;
Nor question why you suffer;
To accept the whole of life
as one perfected plan,
And welcome each event as part of it;
To work, and love your work;
to trust, to pray
for larger usefulness and clearer sight;
This is right living, pleasing in God’s eyes,
Though you be heathen, heretic or Jew.
.
(From : Poems of Progress)
Ella Wheeler Wilcox
(November 5, 1850 – October 30, 1919)
American Poet and Author.
“Laugh, and the world laughs with you; Weep, and you weep alone. For the sad old earth must borrow its mirth But has trouble enough of its own” is her most famous quote.Text Courtesy:
http://archive.org/stream/poemsofprogress03228gut/pmprg10.txt