పాత వీధి … వర్జీనియా వుడ్వార్డ్ క్లౌడ్, అమెరికను కవయిత్రి

చప్పుడుచెయ్యకుండా, ఒంటరిగా, మన ప్రమేయం లేకుండా

గతం ఇక్కడ సంచరిస్తుంటుంది; వచ్చేవాళ్ళూ మౌనం పాటిస్తారు;

ప్రభాత,సాయం వేళలలో భారంగా అటూ ఇటూ నడిచే పాదాలక్రింద

పచ్చిక నలగకుండా, ప్రతి సమాధిప్రక్కనా  తలెత్తిచూస్తూనే ఉంటుంది.

గతం … ఇకనుండీ అగోచరంగా  ఇక్కడ సంచరిస్తూనే ఉంటుంది

ఎక్కడో దూరాన తను విడిచిన గుండె చప్పుళ్ళను వినడానికి

ఓరగా తెరిచి ఉన్నతలుపుసందులలోంచి ఆతృతతోచూసే ఆత్మకితప్ప;

తన్మయత్వంతో పరవశింపజేసే అవ్యక్త స్వరాలవి.

మరిచిపోయిన ఆలాపన పక్కనే ప్రతిధ్వనించినట్టు

సగం ఉలికిపాటుతో వింటూ గుర్తుచేసుకుంటుంటుంది;

ఒక్కోసారి లిలాక్ పూపొదనుండి ఈ మూగబోయిన వీధిలోకి

నిశ్శబ్దసాయంవేళ ఒక కమ్మని తెమ్మెర వీచినపుడు…

నాలుగుపక్కలా పరికించి సుదీర్ఘమైన నిట్టూర్పు విడుస్తుంది:

“ఓహ్! ప్రేమకీ, పరాచికాలకీ సమయం మించిపోయింది.”

.

వర్జీనియా వుడ్వార్డ్  క్లౌడ్

(1861-1938)

అమెరికను కవయిత్రి 

.

An Old Street

.

The past walks here, noiseless, unasked, alone;

Knockers are silent, and beside each stone

Grass peers, unharmed by lagging steps and slow

That with the dark and dawn pass to and fro.

The Past walks here, unseen forevermore,

Save by some heart who, in her half-closed door,

Looks forth and hears the great pulse beat afar,—

The hum and thrill and all the sounds that are,

And listening remembers, half in fear,

As a forgotten tune re-echoes near,

Or from some lilac bush a breath blows sweet

Through the unanswering dusk, the voiceless street,—

Looks forth and sighs,—with candle held above,—

“It is too late for laughter,—or for love.”

.

Virginia Woodward Cloud

(1861-1938)

American

For a good bio of the poetess please visit:

Library of Southern Literature: Biography. edited by Edwin Anderson Alderman, Joel Chandler Harris, Charles William Kent, pages 979-997.

Poem Courtesy:

An American Anthology, 1787–1900 Edmund Clarence Stedman, ed. (1833–1908)

(Line 10 ” re-echoes” was wrongly typed as reëhoes. concordance courtesy Google eBook: A Reed by the River : Virginia Woodward Cloud,  (Richard G Badger , The Gorham Press, 1902) Page 44.)

“పాత వీధి … వర్జీనియా వుడ్వార్డ్ క్లౌడ్, అమెరికను కవయిత్రి” కి 3 స్పందనలు

 1. prakrutini aanandinchadam kooda oka theerani daahame!!

  మెచ్చుకోండి

 2. సూర్యప్రకాష్ గారూ,

  నా బ్లాగుకి స్వాగతం. బాగా చెప్పారు, కవిత్వమే కాదు, ఆస్వాదించగలిగితే, ప్రకృతికూడా తీరని దాహమే!

  అభివాదములతో

  మెచ్చుకోండి

  1. mee samspadanaku naa abhivandanam!!

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: