స్ట్రీఫాన్ నన్ను వసంత ఋతువులో ముద్దుపెట్టుకున్నాడు
రాబిన్ శరత్కాలంలో
కాలిన్ నన్నెప్పుడూ చూస్తూండే వాడు గాని
ఎన్నడూ ముద్దుపెట్టుకో లేదు.
.
స్ట్రీఫాన్ ముద్దు పరిహాసాల్లో కొట్టుకుపోయింది
రాబిన్ ముద్దు ఆటపాటల్లో కలిసిపోయింది
కాలిన్ కళ్ళలో తొణికిసలాడిన ముద్దు
రాత్రీ పగలూ నన్నువెంటాడుతూనే ఉంది.
.
సారా టీజ్డేల్.
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
.
సుకుమారమైనవీ, అపురూపమైన ప్రేమ భావనలని మనోహరంగా ప్రకటించడంలో సారా టీజ్డేల్ ది అందెవేసిన చెయ్యి. అంతే కాదు, ఆమె లౌకికభావనలకి ఒక మెట్టు పైన తాత్త్విక చింతనకూడ కలగలుపుతుంది. ఆమె ఎంచుకున్న పదాలలో ఆడంబరం లేకపోయినా, ఆమె పద్యాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.
ఇంత చిన్న కవితలో ప్రేమని ప్రకటించే తీరులో పురుషులమధ్య ఉండే వ్యత్యాసాలతో పాటు, ప్రేమభావనని స్త్రీ గ్రహించేతీరులోకూడా ఉండే తేడాలని ఎంత అందంగా చిత్రించిందో చూడవచ్చు. స్త్రీలో ఒక ప్రత్యేకత ఉంది. లౌకికమైన ప్రకటనకు మించి, అవ్యక్త ప్రేమనికూడా ఆమె మనసు పసిగట్టగలుగుతుంది.
.
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)
స్పందించండి