రోజు: ఫిబ్రవరి 27, 2013
-
చూపు … సారా టీజ్డేల్, అమెరికను
స్ట్రీఫాన్ నన్ను వసంత ఋతువులో ముద్దుపెట్టుకున్నాడు రాబిన్ శరత్కాలంలో కాలిన్ నన్నెప్పుడూ చూస్తూండే వాడు గాని ఎన్నడూ ముద్దుపెట్టుకో లేదు. . స్ట్రీఫాన్ ముద్దు పరిహాసాల్లో కొట్టుకుపోయింది రాబిన్ ముద్దు ఆటపాటల్లో కలిసిపోయింది కాలిన్ కళ్ళలో తొణికిసలాడిన ముద్దు రాత్రీ పగలూ నన్నువెంటాడుతూనే ఉంది. . సారా టీజ్డేల్. (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి . సుకుమారమైనవీ, అపురూపమైన ప్రేమ భావనలని మనోహరంగా ప్రకటించడంలో సారా టీజ్డేల్ ది అందెవేసిన […]