అనువాదలహరి

కొన్ని కవితలు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

స్థానమహిమ

పండిన బాదం(1) ఆకులమీద

మంచుబిందువు కెంపులా మెరుస్తోంది.

అదే కొలనిలోని తెల్లకలువమీద

కన్నీటిచుక్కలా వెలవెలబోతోంది.

.

అప్పుడే ఒక ఏడు గడిచింది.

మన పెరట్లోని పూదోటనానుకున్న పొలంలో

పాలుపోసుకుంటున్న వరిచేలలో కప్పల బెకెబెక వినిపిస్తోంది

కొడవలిలా(2) పదునైన చంద్రబింబం

నా మనసు రెండుగా చీలుస్తోంది.

.

ఆకురాలుకాలం

పగలల్లా ఎర్రని పండుటాకులు

ద్రాక్షతీగనుండి నీటిలో రాలడం చూస్తూనే ఉన్నా.

ఇప్పుడు వెన్నెట్లోకూడ అవి రాలుతునే ఉన్నాయి.

కాకపోతే, ఇప్పుడు ప్రతి ఆకుఅంచుకీ  వెన్నెలపూత  ఉంది.

 .

 జాగరణ

రాత్రల్లా

కీచురాళ్ళు ఉండీ ఉడిగీ అరుస్తూనే ఉన్నాయి

ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాల్లా

.

(From: Lacquer Prints)

(Notes: 

1. Maple అంటే బాదం కాదు.  కానీ, మూలంలోని ఆకుల రంగుకోసం అరువు తెచ్చుకున్నది.

2.  చంద్రహాసం వంటి కత్తులు కొడవలి ఆకారంలో ఉంటాయి. కాకపోతే, వాటి లోపలి అంచుకాక, పై అంచు పదునుగా ఉంటుంది. రూపసామ్యంకోసం కొడవలి అని వాడుకున్నా.)

.

ఏమీ లోవెల్

(February 9, 1874 – May 12, 1925)

అమెరికను కవయిత్రి

.

TIME Magazine cover from March 2, 1925 featuri...
TIME Magazine cover from March 2, 1925 featuring Amy Lowell (Photo credit: Wikipedia)

.

Circumstance

Upon the maple leaves

The dew shines red,

But on the lotus blossom

It has the pale transparence of tears.

.

A Year Passes

Beyond the porcelain fence of the pleasure garden,

I hear the frogs in the blue-green rice-fields;

But the sword-shaped moon

Has cut my heart in two.

.

Autumn

All day I have watched the purple vine leaves

Fall into the water.

And now in the moonlight they still fall,

But each leaf is fringed with silver.

.

Nuit Blanche (All Night)

The chirping of crickets in the night

Is intermittent,

Like the twinkling of stars.

.

(From Lacquer Prints)

Amy Lowell

%d bloggers like this: