రోజు: ఫిబ్రవరి 17, 2013
-
నన్ను ప్రేమించడం నీకు విసుగనిపించినపుడు…మార్గరెట్ వైడెమర్, అమెరికను కవయిత్రి .
భవిష్యత్తులో ఏదో ఒకరోజు నన్ను ప్రేమించడం నీకు విసుగనిపించినపుడు దయచేసి, నీ మనసు దాచుకుని మభ్యపెట్టకు లేనిపోని పొగడ్తలతో నన్ను ముంచెత్తకు. . ఎందుకంటే, నువ్వు చెప్పని ప్రతిమాటా నా మనసు గ్రహిస్తుందని గుర్తుంచుకో నా దగ్గరనుండి నిశ్శబ్దంగా వెళ్ళిపో మారుమాటలేకుండా, చివరి వీడ్కోలివ్వకుండా. . భగవంతుడు నీకు సుఖశాంతులు ప్రసాదించుగాక. ఓహ్! నిత్యం భగవత్సంకీర్తనలు వింటూ నువ్వేం చేసే వన్నది లక్ష్యపెట్టకపోవడం నా పాల బడుగాక! . మార్గరెట్ వైడెమర్, (September 30, 1884 –…