అనువాదలహరి

Principle of Life … Vinnakota Ravisankar, Telugu, Indian Poet

It matters little even if you have no friends

but, you can’t make life without an enemy. 

A man without a rival born

is as vegetable as a Brain-dead. 

.

With all that,  it’s just a game.

And as in every game,

more than your team

the role of your rival counts much.


Man might wriggle out of umpteen bonds

but not the snares of success and reverses.

Man is yet to invent an intoxicant

more headier than success.


Man is a strange wild beast:

It vanquished the forest

But, surrendered to its heart.


Whatever the new equations be

Rivalry is a constant factor,

The only variable is… Rival.    

.

Vinnakota Ravisankar

Indian Poet

.

Photo Courtesy: Vinnakota Ravi Sankar
Photo Courtesy: Vinnakota Ravisankar

Vinnakota Ravisankar is living in Columbia, South Carolina, USA for the last 14 years. He has to his credit three collections of poetry in Telugu published so far — kuMDeelO marri ceTTu (The Bunyan in a Flowerpot) (1993), vEsavi vaana (Summer Rain) (2002) & remDO paatra (The Second Role)(2010).

.

 జీవన సూత్రం…

.

మిత్రులు లేకపోయినా  ఫరవాలేదు

కాని, శత్రువు లేకుండా బ్రతకటం కష్టం

అజాతశత్రువంటే ఇక్కడ

జీవన్మృతుడని అర్థం.


ఇంతాజేసి, ఇదంతా ఒక ఆట

ప్రతి ఆటలోనూ సహచరులకంటే

ప్రత్యర్థి పాత్రే ముఖ్యం.


ఎన్ని బంధాలు తెంచుకున్నా,

చివరికి జయాపజయాల

వలలో చిక్కుతాడు మనిషి

గెలుపును మించిన మాదకద్రవ్యాన్ని

మనమింకా కనుగొనవలసే ఉంది.


అడవిని జయించికూడా

దాని హృదయానికే తలవంచిన

వింతజంతువు మనిషి


కొత్త సమీకరణాలెన్ని సృష్టించినా

శత్రుత్వం స్థిర సంఖ్య.

శత్రువే మారుతూ ఉంటాడు.

.

(రెండో పాత్ర సంకలనం నుండి)

విన్నకోట రవిశంకర్

%d bloggers like this: