“నీ తీగెలు ఎందరో ఆడపిల్లల మనసు దోచుకుంటాయి”
అన్నాడు ఆరాధనగా కవి.
“అయితేనేం,
నీ కవిత ఏ తీగెలూ లేకుండానే
మనసులోకి ప్రవహిస్తుందిగా?”
అన్నాడు గిటారిస్టు.
“ఒక సుదీర్ఘప్రయాణంలో,
సంగీతానికున్న ఆకర్షణ కవితకేదీ?”
అని ఆక్షేపించాడు కవి
“కానీ, ఏం ప్రయోజనం?
పాటమనసులో మెదలకుండా
కూనిరాగమైనా రాదుకదా?”
మెచ్చుకున్నాడు గిటారిస్టు.
“ఆహ్! పాటలో ఏముంది?”
నిట్టూర్చాడు, కవి
“అవును, పాటలో ఏముంది?
కోయిలపాటని వినిచూడు.
పాటలో ఏముంది?
ఒక సంకీర్తనని వినిచూడు తెలుస్తుంది”
బదులిచ్చాడు గిటారిస్టు
“నువ్వు వాయిస్తున్నప్పుడు,
శ్రోతలకళ్లలో ఆనందాశ్రువులు చూడగలను,
వాళ్ల కరతాళధ్వనులలో
వాళ్ల సంతోషాన్ని అంచనా వెయ్యగలను,
వాళ్లు నిలబడి నర్తిస్తుంటే
ఎంతగా రసప్లావితులయ్యారో ఊహించగలను”
అన్నాడు కవి అభినందనపూర్వకంగా.
“నిజమే.
నీకు నీ పాఠకులు కనిపించకపోవచ్చు,
వాళ్ల కళ్లలో కన్నీళ్ళూ కనిపించకపోవచ్చు,
వాళ్ళ కరతాళధ్వనులు వినిపించకపోవచ్చు,
వాళ్ళహృదయాలు ఆనందంతో నర్తిస్తుంటే చూడలేకపోవచ్చు,
కానీ, కొన్ని తరాలు నీ కవిత గుండెలో భద్రంగా దాచుకుంటారు.
నా సంగీతం నా తీగెతోనే అంతరిస్తుంది.
కారణం, ఓ కవీ!
నేను కేవలం వాళ్ల మనసుని రంజింపజేస్తే,
నువ్వు వాళ్ల మనసుల్ని మార్చగలవు.”
అని కైమోడ్చాడు గిటారిస్టు.
.
ప్రదీప్. AL
Indian Poet
.
Mr. Pradeep AL is an Engineer (IT) working with GMR Group, Bangalore. He is an active member of PAB ( Poetry Across Borders) and a conscious social worker teaching Mathematics to destitute children in his spare time. Philosophy, Music, Nassim Nicholas Taleb and Problems of Randomness are his absorbing interests.
.
Poet and Guitarist
“Chords of yours break many Girls’ hearts”
Said the Poet to Guitarist
“Hmm! But your Poetry travels free
With no strings attached”
Replied the Guitarist
“Yet, on a long bus drive,
Your kit attracts Passersby”
Admired the Poet
“What’s the point, dear?
Without a song, none can even hum”
Smiled the Guitarist.
“What’s in a Song ?”
Smirked the Rhymer
“O yeah! What’s in a song
That Skylark’s sing?
What’s in a Song
That holy hymns ring?”
Flayed the musician.
“When you play,
I see in their eyes, how much they admire;
I hear in their claps, how much they appreciate;
I feel in their dance, how much they felt;
How much they absorbed,
You got them all tangled in your fine music!”
Concluded the Bard
“For sure,
you may miss your audience,
You may miss their tears,
You may miss their claps
And you may miss their dance,
But generations carry your poem in their heart
While my tunes are interred with my strings;
Whereas you transform, Dear friend!
I merely entertain”
bowed the Guitarist .
.
Pradeep AL
స్పందించండి