రోజు: ఫిబ్రవరి 9, 2013
-
కవీ – గిటారిస్టూ … Pradeep Ankem, Indian Poet
“నీ తీగెలు ఎందరో ఆడపిల్లల మనసు దోచుకుంటాయి” అన్నాడు ఆరాధనగా కవి. “అయితేనేం, నీ కవిత ఏ తీగెలూ లేకుండానే మనసులోకి ప్రవహిస్తుందిగా?” అన్నాడు గిటారిస్టు. “ఒక సుదీర్ఘప్రయాణంలో, సంగీతానికున్న ఆకర్షణ కవితకేదీ?” అని ఆక్షేపించాడు కవి “కానీ, ఏం ప్రయోజనం? పాటమనసులో మెదలకుండా కూనిరాగమైనా రాదుకదా?” మెచ్చుకున్నాడు గిటారిస్టు. “ఆహ్! పాటలో ఏముంది?” నిట్టూర్చాడు, కవి “అవును, పాటలో ఏముంది? కోయిలపాటని వినిచూడు. పాటలో ఏముంది? ఒక సంకీర్తనని వినిచూడు తెలుస్తుంది” బదులిచ్చాడు గిటారిస్టు “నువ్వు […]