“కవీ… కోకిలా (కల్పితగాథ)… ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవయిత్రి” కి 4 స్పందనలు
vanajavanamali
కవి లేని చోట కోకిల కూడా పాడలేదని ఎంత బాగా చెప్పారు. కవిత్వం కోకిల పాటై దేశ దేశాలు ఊరుగుతుంది అనేది నిజం. కల్పితం అయినా కథ చాలా బాగుంది.
పరిచయం చేసిన మీకు ధన్యవాదములు.
వనజగారూ,
ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, రాబర్ట్ బ్రౌనింగ్ కంటే ముందు పేరు సంపాదించింది. అతనికి దీటైన కవిత్వం రాసింది. నా మట్టుకు నాకు మానసిక అవస్థలనీ, కొన్ని తాత్త్విక సత్యాలనీ, స్త్రీలు ఆవిష్కరించగలిగినంత సుందరంగా పురుషులు ఆవిష్కరించలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే, వాళ్ళకి అనుభూతిలో తాదాత్మ్యం కంటే, ఆవేశమే ఎక్కువ అనిపిస్తుంది… ఏదో కొందరిని మినహాయిస్తే.
“I cannot sing my earthly things,
the heavenly poet wanting,
Whose highest harmony includes
the lowest under the sun.”-
ఒక అత్యద్భుతమైన కవితను పరిచయం చేశారు మూర్తి గారూ!వంద డొల్లు మాటలు చెప్పలేని అంశాన్నిఒక కవిత చెబుతుందంటారు.వంద కవితల వల్ల కాని తత్త్వం ఒక సంగీతస్వరంలో ఇమిడి ఉంటుందంటారు.కోయిల స్వరమంటే కోటిమంది కవులబావుటానే కదా! లౌకికానికీ, అలౌకికానికీ, కవికీ, కోకిలకీ, మధ్యగల వివిధ సంబంధాలనీ, వైరుధ్యాలనీ ఇంత చిన్నకవితలో పొదిగిన ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ ప్రతిభ అబ్బుర పరుస్తోంది. మీ అనువాదం సరే..ఎప్పటిలా..అదే సరళమైన ఆర్ద్రతతో! కృతజ్ఞతలు మూర్తి గారూ..మళ్ళా మరొక మంచి కవితను వినిపించినందుకు.
.
“విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం, నహి వంధ్యా విజానాతి, గుర్వీం ప్రసవవేదనాం” అని ఊరకే అనలేదు. మీలాంటి రసహృదయం కలిగిన పాఠకుడు మాత్రమే కవిశ్రమకి తగిన ప్రతిఫలాన్ని అందించగలడు. విక్టోరియన్ యుగంలో కవులు, నవలా కారులూ అద్భుతమైన విషయాలు తీసుకుని, నైతిక ప్రవర్తనకి, తాత్త్విక చింతనకీ పెద్దపీట వేస్తూ, చక్కని రచనలు చేసేరు. ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ నిస్సందేహంగా అపురూపమైన కవయిత్రి.
స్పందించండి