వినిమయము… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
.
బతుకులో మనసుదోచేవెన్నో ఉన్నాయి అమ్మకానికి
అన్నీ అద్భుతమైనవీ, మహా సౌందర్యవంతమైనవీను:
కొండకొనలమీద తెల్లనురుగునద్దుకునే నీలికెరటాలూ
ఉరకలేస్తూ పైకెగసి శ్రుతులుమీటే అగ్నికీలలూ,
ఆశ్చర్యాన్ని కప్పులలో గుమ్మరిస్తూ
వదనాలు పైకెత్తి చూచే పసి పాపలూ …
.
బతుకులో మనసుదోచేవెన్నో ఉన్నాయి అమ్మకానికి
పసిడివంకలాంటి సంగీతమూ
వర్షంతో వ్యాపించే పైన్ చెట్ల సుగంధమూ
నిన్ను ప్రేమించే కళ్ళూ, పొదివిపట్టుకునే చేతులూ,
రాత్రి ఆకాశాన్ని వెలిగించే చుక్కల్లా,
నీ ఆత్మానందాన్ని ఇనుమడింపజేసే పవిత్రభావనలూ…
.
ఆ మనోహరమైనవాటికోసం నీకున్నదంతా ధారపొయ్యి
స్వంతం చేసుకో, ఎన్నడూ ఖర్చుగురించి వెనకాడకు
ఎందుకంటే, ఒక్క నిర్మలమైన ప్రశాంత ఘడియచాలు
అందులో ఎన్నో ఏళ్ల వేదనలు కొట్టుకుపోతాయి, నమ్ము;
ఒక్క ఆనందపారవశ్యపు నిట్టూర్పుకి
నీ వ్యక్తిత్వాన్నీ, భవిష్యత్తునీ సమర్పించుకో.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి.
.

.
Barter
.
Life has loveliness to sell,
All beautiful and splendid things,
Blue waves whitened on a cliff,
Soaring fire that sways and sings,
And children's faces looking up
Holding wonder in a cup.
.
Life has loveliness to sell,
Music like a curve of gold,
Scent of pine trees in the rain,
Eyes that love you, arms that hold,
And for your spirit's still delight,
Holy thoughts that star the night.
.
Spend all you have for loveliness,
Buy it and never count the cost;
For one white singing hour of peace
Count many a year of strife well lost,
And for a breath of ecstasy
Give all you have been, or could be.
.
Sara Teasdale,
American Poetess
(Poem Courtesy: http://www.poets.org/viewmedia.php/prmMID/20724)