Mr. Mohan Rishi is a copy Editor with Ad Agency. He has about 50 poems published in all reputed Telugu magazines . Music and Literature are his passion. He can be reached at: Mohanrishi.73@gmail.com.
.
వార్ అండ్ పీస్!
వొదిలేసేవాళ్ళు చేసిన మేలు మనతో ఉన్నవాళ్ళూ చెయ్యరు; ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదన్నట్లుగా.
ఇచ్చి వెళ్తారు కొన్ని పాఠ్యగ్రంథాల్ని. కొత్త పరిభాషని. మెలకువల్నీ. మేలుకొలుపుల్నీ. మునిమాపుల్నీ, మునుపెరుగని ప్రపంచాల్నీ.
ధన్యవాదాలు. దృష్టిని విశాలమూ, నిశితమూ చేసినందుకు. జీవనయానంలో మరో మార్గదర్శనానికి కారణమైనందుకు. ఇంకోసారి పుట్టించినందుకూ.
ఇక నగ్నంగా నడక మొదలు. మరొక వొదిలేసేవాళ్ళు మనల్ని వొదలకుండా పట్టుకునేంతవరకూ. లేదా మనల్ని మనమే వొదిలేసి కదిలిపోయేవరకూ!