అనువాదలహరి

With the Yoke You Left Half-way… Vanaja Tatineni, Telugu Poetess

That the necessities were welling up each year

like water in a spring,

and the loans were growing wild with interest

like reed unattended,

you took to liquor once

to drown the grief;

But today you took this “peasanti-cide

and dropped down dead like a pest.

.

Ever since you merged into the elements

leaving me to twist in the wind;

left me as the lone prop

for the parents who begot you

and for the children we begot

ignoring that I was behind you for everything

from the day our lives were tied together,

I have been spiriting myself each day

to buck up and hang on…

.

The hands that never turned up for help

when you were alive,

have flocked around me ;

and are hovering still,

with looks of hunger like Hawks and Raven

around weak and emaciated;

the sufferings you thought

would cease with your decease

have only thrown us from the pan into the fire.

.

Like the chatter of cicadas at midnight,

harassment of creditors

heart-rending hunger cries of children

and the ‘un-cloakable’ youthful graces

refrain unceasingly;

Fear, want and emptiness

linger in the dried up eyes

like the traces of water in a farm well.

.

To unveil the dawn of sensibility in our people

I must fence the looks converging on me,

put fire into my looks

and stop them in their tracks;

Lugging the yoke you left half-way

I must culture the field of life

to survive

and I continue to survive…

Until I reach the other bank

swimming with the lone hand

I live

and continue to live.

 .

Vanaja Tatineni

.

Image Courtesy: Vanaja Tatineni
Image Courtesy: Vanaja Tatineni

.

Vanaja Tatineni is a home maker living in Vijayawada.   She is a good reader and more interested in poetry . She likes to record her every experience in poems. She is a blogger in Telugu running her blog http://vanajavanamali.blogspot.com since 21st November 2010.

.

నువ్వు వదిలేసిన కాడితో.

.

ఏ ఏటికి ఆఏడు చెలమలోని నీళ్ళులాగ
అవసరాలు ఊరుతూనే ఉండాయని
చేసిన అప్పులు వడ్డీతో కలసి
సాలుసాలుకి రెళ్ళు దుబ్బుల్లా
పెరుగుతూనే ఉండాయని
బాధల్లన్ని మరిచిపోవాలని
అప్పుడు ఆ మందు తాగినావు ..
ఏకంగా ఇప్పుడు ఈ మందు తాగేసి
పురుగులా మాడిపోయావు..

కొంగు ముడి పడ్డ నాటినుండి …
నేను సాయంగా ఉండానన్న సంగతి మరిసేసి
నిన్ను కన్నోళ్ళకి మనం కన్నోళ్ళకి
నన్నే ఒంటి నిట్టాడిని చేసి పోయినాక
నన్ను గాలికి ఒగ్గేసి..
నువ్వు గాలిలో కల్సిపోయాక
నేను రోజూ ధైర్యం అనే మందు తాగుతూనే ఉండాను ..

నువ్వు ఉన్నప్పుడు సాయం చేస్తానని రాని చేతులు
నా ముందుకొచ్చాయి లెక్కలేనన్ని..
బిక్క చచ్చి బక్క చిక్కి ఉన్న శరీరాల చుట్టూ ..
ఆకలి చూపులు కాకుల్లా.. గ్రద్ధల్లా..
గిరికీలు కొడుతూనే ఉండాయి.
నువ్వు చస్తే మారతాయని అనుకున్నబాధలు
పెనంలోనుండి పొయ్యిలోకి మారినాయి.

నడిరేతిరి కీచురాళ్ళ రొదలా..
అప్పులాళ్ళ బాధలు, పేగులు తిప్పేసే బిడ్డల
తీరని ఆకలి కేకలు..
దాయలేని యవ్వనపు ప్రాయపు పొంగులు..
మోటబాయి లోని నీళ్ళు లాగానే
నీరింకిన కళ్ళల్లో భయం, దైన్యం
శూన్యం తారట్లాడుతున్నాయి.

మనోల్ల చూపుల్లో చుక్కలు పొడవాలంటే ..
మా చుట్టూ తిరిగే చూపులకి ముళ్ళ కంచెలు కొట్టి
మా చూపులకి అగ్గి రగిలించుకుని..
ఆమడ దూరంలో వాళ్ళని ఆపేసి
నువ్వు వదిలేసిన కాడితో ..
బతుకు సేద్యం చేస్తూనే ఉండాల.
బతుకుతూనే ఉండాల.. బతుకుతూనే ఉండాల
ఒంటి చేత్తో ఆవలి ఒడ్డుకి చేరేదాక.. బతుకుతూనే ఉండాల. బతుకుతూనే ఉండాల..
.

  వనజ తాతినేని

%d bloggers like this: