పాత వీధి … వర్జీనియా వుడ్వార్డ్ క్లౌడ్, అమెరికను కవయిత్రి
చప్పుడుచెయ్యకుండా, ఒంటరిగా, మన ప్రమేయం లేకుండా
గతం ఇక్కడ సంచరిస్తుంటుంది; వచ్చేవాళ్ళూ మౌనం పాటిస్తారు;
ప్రభాత,సాయం వేళలలో భారంగా అటూ ఇటూ నడిచే పాదాలక్రింద
పచ్చిక నలగకుండా, ప్రతి సమాధిప్రక్కనా తలెత్తిచూస్తూనే ఉంటుంది.
గతం … ఇకనుండీ అగోచరంగా ఇక్కడ సంచరిస్తూనే ఉంటుంది
ఎక్కడో దూరాన తను విడిచిన గుండె చప్పుళ్ళను వినడానికి
ఓరగా తెరిచి ఉన్నతలుపుసందులలోంచి ఆతృతతోచూసే ఆత్మకితప్ప;
తన్మయత్వంతో పరవశింపజేసే అవ్యక్త స్వరాలవి.
మరిచిపోయిన ఆలాపన పక్కనే ప్రతిధ్వనించినట్టు
సగం ఉలికిపాటుతో వింటూ గుర్తుచేసుకుంటుంటుంది;
ఒక్కోసారి లిలాక్ పూపొదనుండి ఈ మూగబోయిన వీధిలోకి
నిశ్శబ్దసాయంవేళ ఒక కమ్మని తెమ్మెర వీచినపుడు…
నాలుగుపక్కలా పరికించి సుదీర్ఘమైన నిట్టూర్పు విడుస్తుంది:
“ఓహ్! ప్రేమకీ, పరాచికాలకీ సమయం మించిపోయింది.”
.
వర్జీనియా వుడ్వార్డ్ క్లౌడ్
(1861-1938)
అమెరికను కవయిత్రి
.
An Old Street
.
The past walks here, noiseless, unasked, alone;
Knockers are silent, and beside each stone
Grass peers, unharmed by lagging steps and slow
That with the dark and dawn pass to and fro.
The Past walks here, unseen forevermore,
Save by some heart who, in her half-closed door,
Looks forth and hears the great pulse beat afar,—
The hum and thrill and all the sounds that are,
And listening remembers, half in fear,
As a forgotten tune re-echoes near,
Or from some lilac bush a breath blows sweet
Through the unanswering dusk, the voiceless street,—
Looks forth and sighs,—with candle held above,—
“It is too late for laughter,—or for love.”
.
Virginia Woodward Cloud
(1861-1938)
American
For a good bio of the poetess please visit:
Library of Southern Literature: Biography. edited by Edwin Anderson Alderman, Joel Chandler Harris, Charles William Kent, pages 979-997.
Poem Courtesy:
An American Anthology, 1787–1900 Edmund Clarence Stedman, ed. (1833–1908)
(Line 10 ” re-echoes” was wrongly typed as reëhoes. concordance courtesy Google eBook: A Reed by the River : Virginia Woodward Cloud, (Richard G Badger , The Gorham Press, 1902) Page 44.)
చూపు … సారా టీజ్డేల్, అమెరికను
స్ట్రీఫాన్ నన్ను వసంత ఋతువులో ముద్దుపెట్టుకున్నాడు
రాబిన్ శరత్కాలంలో
కాలిన్ నన్నెప్పుడూ చూస్తూండే వాడు గాని
ఎన్నడూ ముద్దుపెట్టుకో లేదు.
.
స్ట్రీఫాన్ ముద్దు పరిహాసాల్లో కొట్టుకుపోయింది
రాబిన్ ముద్దు ఆటపాటల్లో కలిసిపోయింది
కాలిన్ కళ్ళలో తొణికిసలాడిన ముద్దు
రాత్రీ పగలూ నన్నువెంటాడుతూనే ఉంది.
.
సారా టీజ్డేల్.
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
.
సుకుమారమైనవీ, అపురూపమైన ప్రేమ భావనలని మనోహరంగా ప్రకటించడంలో సారా టీజ్డేల్ ది అందెవేసిన చెయ్యి. అంతే కాదు, ఆమె లౌకికభావనలకి ఒక మెట్టు పైన తాత్త్విక చింతనకూడ కలగలుపుతుంది. ఆమె ఎంచుకున్న పదాలలో ఆడంబరం లేకపోయినా, ఆమె పద్యాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.
ఇంత చిన్న కవితలో ప్రేమని ప్రకటించే తీరులో పురుషులమధ్య ఉండే వ్యత్యాసాలతో పాటు, ప్రేమభావనని స్త్రీ గ్రహించేతీరులోకూడా ఉండే తేడాలని ఎంత అందంగా చిత్రించిందో చూడవచ్చు. స్త్రీలో ఒక ప్రత్యేకత ఉంది. లౌకికమైన ప్రకటనకు మించి, అవ్యక్త ప్రేమనికూడా ఆమె మనసు పసిగట్టగలుగుతుంది.
.

.
The Look
.
Strephon kissed me in the spring,
Robin in the fall,
But Colin only looked at me
And never kissed at all.
.
Strephon’s kiss was lost in jest,
Robin’s lost in play,
But the kiss in Colin’s eyes
Haunts me night and day.
.
Sara Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American Poet
Confessions… Srinivas Vasudev, Telugu, Indian Poet
1
I came walking over the night
but could not collect a fistful of darkness!
The dreams beneath the eyes swimming in tears
could not make a legend.
2
Sitting in each grapheme
I converse with the rest.
For, each word is a confession-box.
I put down my own episodes here.
3
Like the empty bottles rolling down
these memories trudge along encasing emptiness …
some never get interred,
while some others get hazy
like letters on a dampened paper …
4
Some enigmatic relations restrain emotions
like the weight on a paper.
Passion had long evaporated!
When shall the distinction between
wetting and moistening be clear?
5
The howling in the air
that the interred had no friends
shall not reach the other ear.
No boulder of the Pyramids
can either fill the hollowness of life
or block my view.
But then, what is it that I attempt to see,
after all!
6
Borrowed intellect shall not fit
like the misfitting borrowed garments
it looks so odd… so unnatural.
7
That all-pervading vacuum
does not spare even this confession box…
Doesn’t Life script its own screen play?
.
Srinivas Vasudev
Mr. Srinivas Vasudev holds a Master’s Degree in English Literature from Andhra University, Waltair, Andhra Pradesh, India. He is also a graduate in journalism from the same University. He is a Senior Lecturer in the Ministry Of Education of Brunei, Darussalam since 2003. He had earlier worked for Ministry of Education in Oman and as Senior Lecturer in English for about 2 years for the University of London in Singapore before moving to Brunei. Some of his works are on the anvil.
He is running a blog http://vinaayakaveena.blogspot.com/
since Sept 11, 2010.
.
Confessions
రాత్రిపై నుంచి నడిచొచ్చానా
గుప్పెడంత చీకటినీ తెచ్చుకోలేకపోయాను!
కళ్ళకింద కలలన్నీ కన్నీళ్ళలో
కదులుతూ
కథలుగా మారలేకపోయాయి
2.
ఓ అక్షరంలో కూర్చుని మరొకదాంతో
చెప్పుకుంటూ ఉంటాను
ప్రతీపదం ఓ కన్ఫెషన్ బాక్స్ మరి…
నా కథల్ని నేనే రాసుకుంటానిక్కడ
3.
దొర్లుకొస్తున్న ఖాళీ సీసాల్లా కొన్ని జ్ఞాపకాలు
ఖాళీలకి ఫ్రేముకట్టి మరీ మోస్తాయి..
సమాధికాబడని జ్ఞాపకాలు కొన్ని!
తడిసిన కాగితంలోని అలుక్కుపోయిన అక్షరాల్లా
ఈ జ్ఞాపకాలు….
4.
అర్ధంకాని బంధాలేవో
పేపర్ వెయిట్లా జీవితావేశాన్ని
అదిమిపెడుతుంటాయి
తేమకీ, తడికీ తేడాతెల్సెదెప్పుడు
ఆర్ద్రతెప్పుడో ఆవిరై ఆరిపోయిందిలె
5.
సమాధిలో శవానికి మిత్రుల్లేరన్న
‘గాలి‘ ఊళల్లోని మాటలు కొన్ని చెవిదాటిపోవు
అవును
పిరమిడ్లలోని రాళ్ళేవీ
జీవితతంలోని డొల్లతనాన్నీ నింపలేవు
నా దృష్టినీ అడ్డుపెట్టలేవు
అయినా ఏం చూస్తున్నానని?
6.
అరువుతెచ్చుకున్న మేధోతనమేదీ నిలబడదు
చిన్న ఒంటికి పెద్ద అంగీలా
అసహజంగా, అసమానంగా….
7.
విస్తరించుకుంటున్న శూన్యత
ఆఖరికి ఈ పాపనివేదన గదిలోనూ…
జీవితం దాని కథల స్క్రీన్ ప్లే అది రాసుకుంటుందికదా
.
వాసుదేవ్
మంచి సావాసము… కార్ల్ విల్సన్ బేకర్, అమెరికను కవయిత్రి
.
అప్పచెల్లెళ్ళలా వరుసలో నిల్చున్నఏడు రావిచెట్ల పక్కనా
ఈ రోజు నడుస్తూ నేను చాలా ఎత్తు ఎదిగాను…
చీకటి పడుతూనే మొగలిపొదల్లో వణుకుతూ వేలాడుతున్న
నక్షత్రంతో సంభాషించిన నా మనసు తేటపడిందనుకుంటున్నాను.
.
ఈ సాంధ్యవేళ దేవదారుకొమ్మల్లోంచి ఆ ఎర్రపిట్ట రాగరంజితమైన పిలుపుకి
నా మదిలోని తనజంట మేల్కొందిహాయిగా తియ్యగా బదులివ్వడానికి
నీలి మేఘాల పరదాలలోంచి హఠాత్తుగా ఒక దేవత తల ఊచుతోంది…
ఓహ్!నీ పవిత్రాంశలు భువికి అవనతించడానికి నే నేపాటిదానని ప్రభూ?.
.
కార్ల్ విల్సన్ బేకర్
(Oct 13, 1878 – Nov 8, 1960)
అమెరికను కవయిత్రి.
.
Karle Wilson Baker
Photo Credit: Wikipedia
.
Good Company
.
Today I have grown taller from walking with the trees,
The seven sister-poplars who go softly in a line;
And I think my heart is whiter for its parley with a star
That trembled out at nightfall and hung above the pine.
The call-note of a redbird from the cedars in the dusk
Woke his happy mate within me to an answer free and fine;
And a sudden angel beckoned from a column of blue smoke—
Lord, who am I that they should stoop— these holy folk of thine?
.
Karle Wilson Baker
(Oct 13, 1878 – Nov 8, 1960)
American Poet and Author
I am sure you will be pleased in no less measure to read this about the poetess:
http://scholar.lib.vt.edu/ejournals/old-WILLA/fall98/jackson.html
(Poem Courtesy:
The Second Book of Modern Verse a Selection of the Work of Contemporaneous … Ed. By Jessie Rittenhouse, Page 90)Sometimes… Trishna, Telugu, Indian
Sometimes…
… losing a battle inspires you more than winning it;
… a censure excites you more than an undue praise;
… the darkness feels more soothing than the sunshine.
.
Sometimes…
… you feel like opening your heart out to utter strangers ;
… it looks a smile answers enough than a reply;
… an urge overwhelms to believe things blindly.
.
Sometimes…
… it feels amnesia is a fitting end to a haunting past;
… tears deem true partners in despair;
… heart yearns for loneliness than any company.
.
Sometimes
…you love listening to pleasing lies than tarty truth;
…you long to look for comfort in agony itself;
… silence seems supreme to saying something…
.
Trishna
.

Photo & Courtesy: Trishna
.
Popular blogger since May 2009 with the pseudonym Trishna, she is a Post Graduate in Hindi and English. She is a home maker living in Hyderabad. She is a versatile blogger with varied interests… literature, music, cinema etc., She is running 5 blogs:
http://trishnaventa.blogspot.com; http://ruchi-thetemptation.blogspot.in/;
http://lookingwiththeheart.blogspot.in/;http://samgeetapriyaa.blogspot.in/
http://maacinemapegi.blogspot.in/.
ఒకోసారి…
ఒకోసారి…
…గెలుపు కన్నా ఓటమే స్ఫూర్తినిస్తుంది
…ప్రశంస కన్నా విమర్శే ఉత్తేజాన్నిస్తుంది
…వెలుగు కన్నా చీకటే బాగుందనిపిస్తుంది
ఒకోసారి…
…పరిచయంలేని అపరిచితుల వద్దే మనసు విప్పాలనిపిస్తుంది
…సమాధానం కన్నా చిరునవ్వే చాలనిపిస్తుంది
…కళ్ళు మూసుకుని గుడ్దిగా నమ్మాలనిపిస్తుంది
ఒకోసారి…
…కొన్ని గతాలకు మరపే ముగింపనిపిస్తుంది
…నిట్టూర్పులో కన్నీరే తోడనిపిస్తుంది
…మనుషుల సాంగత్యం కన్నా ఒంటరితనాన్నే మనసు కోరుతుంది
ఒకోసారి…
…నిజం కన్నా అబధ్ధమే వినాలనిపిస్తుంది
…వేదనలో హాయికై వెతకాలనిపిస్తుంది
…మాటల కన్నా మౌనమే మేలనిపిస్తుంది…!!
.
తృష్ణ…
కొన్ని కవితలు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
స్థానమహిమ
పండిన బాదం(1) ఆకులమీద
మంచుబిందువు కెంపులా మెరుస్తోంది.
అదే కొలనిలోని తెల్లకలువమీద
కన్నీటిచుక్కలా వెలవెలబోతోంది.
.
అప్పుడే ఒక ఏడు గడిచింది.
మన పెరట్లోని పూదోటనానుకున్న పొలంలో
పాలుపోసుకుంటున్న వరిచేలలో కప్పల బెకెబెక వినిపిస్తోంది
కొడవలిలా(2) పదునైన చంద్రబింబం
నా మనసు రెండుగా చీలుస్తోంది.
.
ఆకురాలుకాలం
పగలల్లా ఎర్రని పండుటాకులు
ద్రాక్షతీగనుండి నీటిలో రాలడం చూస్తూనే ఉన్నా.
ఇప్పుడు వెన్నెట్లోకూడ అవి రాలుతునే ఉన్నాయి.
కాకపోతే, ఇప్పుడు ప్రతి ఆకుఅంచుకీ వెన్నెలపూత ఉంది.
.
జాగరణ
రాత్రల్లా
కీచురాళ్ళు ఉండీ ఉడిగీ అరుస్తూనే ఉన్నాయి
ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాల్లా
.
(From: Lacquer Prints)
(Notes:
1. Maple అంటే బాదం కాదు. కానీ, మూలంలోని ఆకుల రంగుకోసం అరువు తెచ్చుకున్నది.
2. చంద్రహాసం వంటి కత్తులు కొడవలి ఆకారంలో ఉంటాయి. కాకపోతే, వాటి లోపలి అంచుకాక, పై అంచు పదునుగా ఉంటుంది. రూపసామ్యంకోసం కొడవలి అని వాడుకున్నా.)
.
ఏమీ లోవెల్
(February 9, 1874 – May 12, 1925)
అమెరికను కవయిత్రి
.

.
Circumstance
Upon the maple leaves
The dew shines red,
But on the lotus blossom
It has the pale transparence of tears.
.
A Year Passes
Beyond the porcelain fence of the pleasure garden,
I hear the frogs in the blue-green rice-fields;
But the sword-shaped moon
Has cut my heart in two.
.
Autumn
All day I have watched the purple vine leaves
Fall into the water.
And now in the moonlight they still fall,
But each leaf is fringed with silver.
.
Nuit Blanche (All Night)
The chirping of crickets in the night
Is intermittent,
Like the twinkling of stars.
.
(From Lacquer Prints)
Amy Lowell
Do you Know?… Mohantulasi Ramineni, Telugu, Indian
.
Do you know that a tear had been shed for you?
Do you know that a grapheme had spilt over?
No matter whatever you know,
things just go their wonted way.
The Indian Medlars in the back yard
Continue to rain in heaps;
When I look at the nascent purity and intensity of
their red and white
I feel the truth of your existence under the blue skies.
God! How many words
the migrant bird might be concealing under its wing!
Perhaps to appropriate a new shade of freedom
from every place it migrates to.
Otherwise, how could the wings span so wide?
How dearly I wish
it lends them to my thoughts for a while!!
The parting day
Fails to devour the twinkling lamps.
Even this blackholish path
Is unable to swallow the sporadic vehicular beams.
After watching your sweet smile in the full moon
All sensuous hearts
twinkle … soused in pleasure.
.
Mohantulasi Ramineni
Indian
.
Mohanatulasi is a System Analyst with SAP and now lives in Chicago. Apart from reading/ writing poetry, she loves photography and painting. She is an active blogger and is running her blog (http://vennela-vaana.blogspot.com) since January 2008.
.
Do You Know?
.
నీకోసం
ఒక అశ్రువు జారిందని తెలుసా
నీకోసం
ఒక అక్షరం ఒలికిందని తెలుసా
ఎన్ని తెలిసినా
అన్నీ మామూలుగానే జరిగిపోతున్నాయి
పెరట్లో పారిజాతాలు
అలానే బోర్లాపడుతూనే వున్నాయి
ఆ తెలుపూ-ఎరుపుల్లో
స్వచ్చతనీ, తీవ్రతనీ చూస్తుంటే
నీలాకాశం కింద నీ రహస్యం
సత్యమనిపిస్తుంది
ఎగిరే పక్షి రెక్కల్లో
ఎన్నేసి పదాలు దాచుకుంటూ వెళ్తుంది
వలస వెళ్ళేచోటల్లా
స్వేచ్చ తాలూకు కొత్త అర్ధాన్ని
జమేసుకుంటుంది కాబోలు
లేకుంటే, ఆరెక్కలకి
అంతటి విశాలత్వం ఎక్కడిది!?
కాస్త నా ఆలోచనకు అరువిస్తే బాగుణ్ణు!
వాలుతున్న పొద్దు
మినుక్కుమనే దీపాల్ని మింగలేకపోతుంది
ఆ చీకటి దారి కూడా
ఉండుండి వెళ్తున్న వాహనాల వెలుగుల్ని
దాచలేకపోతుంది
ఇక స్పందిచే హృదయం అన్ని మూలల్లోనూ
తడి నక్షత్రాలే
పున్నమి చంద్రుడిలో నీ దరహాసం చూసాక!
.
Tulasimohan Ramineni
నా చిత్తరువు … ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
అలా నిలబడు…ఉహూ… కిటికీకి దగ్గరగా…
వాలుబల్లకి పక్కగా… ఆ చిత్తరువు మీద
వెలుగు ఇప్పుడు బాగా పడుతున్నదా? అదిగో,
రాసేటప్పుడు నేనూ దాన్ని అలాగే చూస్తుంటాను.
ఆ ముఖం ఎవరిదో నాకు తెలియదు,
కానీ, అందులో నేర్చుకోవాలన్న తపన కనిపిస్తోంది
సగం విచారంగానూ, సగం హుందాగానూ
చురుకైన చక్కని చూపులతో, ఒత్తైన పొడవాటిజుత్తుతో.
ఆ చిత్రకారుడు ఎవరైతే నాకేమిటి?
అది ఎంత అనామకపు పేరు అయినా ఒకటే;
రేపు ఎవరో అది “వలాస్క్వేజ్”* దని అన్నా ఒక్కటే;
దాని విలువేమీ అమాంతం పెరిగిపోదు.
ఇప్పుడు ఉన్నపళంగా ఎవరైనా దానికి బదులు
మరో అపురూప కళాఖండం ఇస్తామన్నా ఇచ్చేదిలేదు.
అది నాలోనే జీవిస్తూ, నా మనసులోని
ఎనెన్నో రహస్యాలను తనుకూడా విన్నది.
ఎన్నోసార్లు, ఈ చీకటి గూభ్యంలోకి
రాత్రి బాగా అలసిపోయి వచ్చినపుడు
అదే ఎంతో సాదరంగా ఆహ్వానిస్తూ
ఈ పేదకుటీరంలో వెలుగులు నింపేది.
ఎన్నోసార్లు, అనారోగ్యం పాలై, నిద్రపట్టనపుడు
దీపపుప్రమిదెలోని వత్తి వెలుగులు దానిమీద పడి,
నా కలల్లో అవి అలా అలా ఇంకిపోయేదాకా,
వణుకుతున్నట్టు మెరవడం గమనించాను.
గడ్డురోజుల్లో చిక్కుకుని, స్నేహానికి విలువలేదనీ,
అసలు బ్రతుకే నిరర్థకమనీ అనిపించినపుడు,
అదిగో, ఆ వదనంలోని స్నేహపూర్వక మందహాసపు
రుచులే ధైర్యమిచ్చి నన్ను నిలబెట్టినవి.
ఎప్పుడైనా నేను అసహ్యించుకున్నచోటనే
అత్యవసరం పడి తలవంచవలసి వచ్చినపుడు
ఆ తీక్ష్ణమైన కళ్లవెనుక, విచారంతో పాటు,
నా చర్యని గర్హిస్తూ, హెచ్చరించడం గమనించాను.
నా బుర్రలో ఏదైనా ఒక ఊహ మెరిసి, నా చేతులు
అలసేదాకా పనిచేసి ఆ పని సాధించినపుడు,
ఆ లేశమాత్రపుటాలోచన రెక్కలుతొడుగుకుని
కార్యరూపం ధరించేదాకా వీక్షించింది అదే.
నా విజయాలకు సంతసించిందీ అదే,
నిరాశలో కృంగిపోయినపుడు లేవనెత్తిందీ అదే.
నే నెరిగిన ప్రేమాస్పదమైన ఆ జంట కనులు
రాత్రిపగలూ నన్నుకనిపెట్టుకుని కాపాడేయి
నా బొమ్మే నాకొక స్నేహితుడైపోయిందని
ఆశ్చర్యపోతున్నావు కదూ? నిజమే, ఎందుకంటే,
అది నా జీవితపు ప్రథమాంకాన్ని చూసింది
నా చరమాంకాన్ని కూడా చూసి జే కొడుతుంది!
.
ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్
(30th October 1825 – 2nd February 1864)
ఇంగ్లీషు కవయిత్రి.
(Note: * వలాస్క్వేజ్ : Velasquez (baptised June 6, 1599 – August 6, 1660) , a Spanish painter who was the leading artist in the court of King Philip IV)
.
బ్రిటిషు కవయిత్రి, మానవప్రేమి (Philanthropist). 38 ఏళ్ళ వయసులోనే క్షయవ్యాధివల్ల తనువుచాలించిన ప్రాక్టర్, విక్టోరియా మహారాణికి అత్యంత ప్రీతిపాత్రమైన కవయిత్రి. 14 సంవత్సరముల వయసులోనే కలం పట్టిన ప్రాక్టర్ Charles Dickens తో తమ కుటుంబానికి ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకోదలచుకోక, అతని పత్రికలకే మారుపేరుతో కవితలు పంపింది. ఆమె అత్యంత ప్రతిభావంతురాలని Charles Dickens కీర్తించాడు. కవిగా లార్డ్ టెన్నిసన్ తర్వాత స్థానంలో నిలబడగలిగినదంటే, ఆమె ప్రతిభని ఊఒహించుకో వచ్చు. సోషలిస్టు భావాలు కల ఈమె జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండి, నిరుద్యోగయువతులకోసం, నిరాశ్రయులకోసం కృషిచేసింది. ఈమె కవితలలో మంచి తూగు ఉండి సంగీత బధ్ధం చెయ్యడానికి అనువుగా ఉంటాయి.
.

.
My Picture
.
Stand this way—more near the window—
By my desk—you see the light
Falling on my picture better—
Thus I see it while I write!
Who the head may be I know not,
But it has a student air;
With a look half sad, half stately,
Grave sweet eyes and flowing hair.
Little care I who the painter,
How obscure a name he bore;
Nor, when some have named Velasquez,
Did I value it the more.
As it is, I would not give it
For the rarest piece of art;
It has dwelt with me, and listened
To the secrets of my heart.
Many a time, when to my garret,
Weary, I returned at night,
It has seemed to look a welcome
That has made my poor room bright.
Many a time, when ill and sleepless,
I have watched the quivering gleam
Of my lamp upon that picture,
Till it faded in my dream.
When dark days have come, and friendship
Worthless seemed, and life in vain,
That bright friendly smile has sent me
Boldly to my task again.
Sometimes when hard need has pressed me
To bow down where I despise,
I have read stern words of counsel
In those sad reproachful eyes.
Nothing that my brain imagined,
Or my weary hand has wrought,
But it watched the dim Idea
Spring forth into armed Thought.
It has smiled on my successes,
Raised me when my hopes were low,
And by turns has looked upon me
With all the loving eyes I know.
Do you wonder that my picture
Has become so like a friend?—
It has seen my life’s beginnings,
It shall stay and cheer the end!
.
Adelaide Anne Procter
(30th October 1825 – 2nd February 1864)
English Poetess
Yesterday’s Dream… Nishigandha, Telugu, Indian Poetess
“How come you smell so sweet?”
Your compliment at nightfall
while your hand girdles my waist;
Lips blossom
unable to conceal the excitement .
A similar night… even more fragrant
Monumental indifference without a turn of head
works up a smooth silent wound…
Tears spill over
from an already heavy heart
Bliss to the limits of the sky once
a grief of oceanic proportions now
on both occasions …you are the comrade
Do the embarrassed moments
Slipping silently away have any idea
Which of them is more unbearable?
.
Nishigandha
Kiran Yalamanchi, more popular by her pen name Nishigandha, was born and brought up in Vijayawada, Andhra Pradesh. She is an engineer by profession and is currently living in USA. In her own words: “Poetry is my invisible friend stands right next to me and holds my hand in every emotional stage! I don’t publish a lot but I do write more often.. all most everyday.”
She is a blogger since July 2007 running her blog మానసవీణ ( http://nishigandha-poetry.blogspot.com/ ).
.

Image Courtesy: Nishigandha
.
నిన్నటి స్వప్నం
‘ఇంత సుగంధం నీకెలా అబ్బింది?’
మునిమాపు వేళ మెచ్చుకోలు
నడుము చుట్టూ నీ చెయ్యి
మనసు దాయలేక
విచ్చుకున్న పెదాలు..
అలాంటి రాత్రే.. ఇంకాస్త సుగంధం..
తల కూడా తిప్పని నిర్లిప్తత
మెత్తగా చేస్తున్న గాయం
గుండె పట్టక
నిండుతున్న కళ్ళు..
ఆకాశమంత ఆనందం..
సముద్రమంత విషాదం..
సాంగత్యం మాత్రం నీదే!
దేని బరువెక్కువో
తలదించుకుని తప్పుకుంటున్న
ఈ ఘడియలకేమైనా తెలుసా!?
.
నిషిగంధ
ప్రియతమా! నిన్ను నే మరిచిపోవచ్చు! … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
.
ప్రియతమా! నిన్ను నే మరిచిపోవచ్చు! త్వరలోనే.
కనుక ఉన్న ఈ నాల్గు ఘడియలూ, లేదా నాలుగు రోజులూ,
లేదా మిగిలిన నాలుగు నెలలూ సద్వినియోగం చేసుకో…
నాకు మరుపురావడమో, నేను మరణించడమో,
మనకు ఎడబాటో, మన కథముగియడమో జరిగే లోగా;
అపుడు క్రమక్రమంగా ఇందాకచెప్పినట్టు నిన్ను మరిచిపోతాను.
కాని ఇప్పుడు, నువ్వు నీ అందమైన అబద్ధంతో బ్రతిమాలితే మాత్రం
నేను నా అలవాటైన ఒట్టువేసి మరీ అభ్యంతరం చెబుతాను.
ప్రేమ నిజంగా నాలుగు కాలాలు కొనసాగాలనీ
చేసిన బాసలు మరీ ఇప్పటంత బలహీనం కాకూడదనీ ఆశిస్తాను.
కానీ, అవి అంతే! ప్రకృతి తీరే అంత!! ఇంతవరకు ఆ తీరుకి
ఆటంకం రాకుండా ఉండడానికి ప్రకృతే తంటాలు పడ్డది…
జీవశాస్త్రపరిభాషలో చెప్పాలంటే, మనం కోరుకుంటున్నది
నిరుపయోగమైనదో కాదో మనం తెలుసుకోగలిగినా, లేకున్నా.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
(February 22, 1892 – October 19, 1950)
అమెరికను కవయిత్రి
.
ఈ కవితలో ఒక స్పష్టమైన సందేశం ఉంది. మగవాళ్ళు తియ్యని అబద్ధాలు చెబతారని ఆడవాళ్లకి తెలుసు. కాని, వాళ్ళు ఎన్ని అబద్ధాలనయినా ఆనందంగా సహిస్తారు గాని, విశ్వాసఘాతుకం సహించలేరు. అంతే కాదు, మగవారు ఎన్ని ప్రమాణాలు చేసినా, వాళ్ల మనసులూ బలహీనమైనవే, వాళ్ళు వేసే ఒట్లూ (లేదా ప్రమాణాలూ) అంత బలహీనమైనవే అనికూడా తెలుసు. అందుకే, ఇందులో స్త్రీ తన పురుషుడితో చెబుతోంది: “నీ మనసు ఎపుడు పెడత్రోవ పడుతుందో నీకు తెలీదు. అప్పుడు నాకు కోపం రావడమో, నేను మరణించడమో, తెగతెంపులుచేసుకోవడమో ఏదైనా జరగవచ్చు”. దానికి కారణం కూడా ఆమే చెబుతోంది. మనిషి తనకు ఏదో కావాలనుకుని నిత్యమూ వెతుక్కుంటాడు. తనకి అందిన వస్తువులో ముందు ఉందనుకుని భ్రమపడతాడు. అది లేదనుకున్న నాడు తిరిగి అది వెతుక్కునే ప్రయత్నం చెయ్యవచ్చు. అప్పుడే తప్పుదారి పట్టేది. అందుకే ప్రేమ నిత్యం కాదని ఆమె చెప్పింది. అది ప్రకృతి సహజమనికూడా చెబుతోంది ఈమె. కనుక ఆ రోజు రాకముందే జీవితాన్ని సార్థకం చేసుకోమంటోంది. ఇందులో కవయిత్రి మానవ నైజాన్ని సునిశితంగా పరిశీలించడంతో పాటు, ఒక రకమైన నిర్లిప్తత, క్షణికమైనదైనా, జీవితంలో, ఆ క్షణాన్ని సంపూర్ణంగా అనుభవించాలని చెబుతోంది.
.
