అనువాదలహరి

వెస్ట్ మిన్ స్టర్ చర్చి సమాధులు… ఫ్రాన్సిస్ బ్యూమాంట్, ఆంగ్ల కవి

ఓ మరణమా! ఇటుచూడు. భయమేస్తుంది!

శరీరాలెంత దారుణంగా మారిపోయాయో!

ఒక సారి ఊహించుకో! ఈ రాళ్ళ గుట్టలక్రింద

రాజ్యాలేలిన ఎన్ని అస్థికలు నిద్రిస్తున్నాయో;

ఇక్కడ పరున్నవారి కొకప్పుడు

సామ్రాజ్యాలూ, సార్వభౌమత్వాలూ ఉండేవి.

పాపం! వాళ్లకిపుడు చేతులుకదపగలిగే శక్తి కూడా లేదు.

మట్టితో మూసిన వాళ్ళ ప్రసంగ వేదికలనుండి

ఇలా ప్రకటిస్తున్నారు: “గొప్పదనానికి హామీ లేదు”

.

ఇక్కడ ఒక ఎకరం జాగాలో,

పాపంచేసి మరణించిన తొలి మానవుడినుండీ

నేటివరకూ భూమిపై మరణించిన గొప్పగొప్ప రాజులలో

ఘనతవహించిన అధికసంఖ్యాకులిక్కడనే ఉన్నారు.

ఇక్కడి ఎముకలు ఘోషిస్తున్నాయి:

“వాళ్ళు దేముళ్లైతే అవొచ్చు, కానీ, మనుషుల్లానే మరణించారు.”

ఇక్కడ రాజుల శిధిల సమాధులనుండి జారి,

ఇసుకతో పాటు, చెప్పలేని కొన్ని హేయమైన వస్తువులున్నై.

ఒకసారి విధి మృత్యువుపాల్జేస్తే, ఆ పటాటోపాలూ

ఆ వైభవాలూ అన్నీ మట్టిలో కలవాల్సిందే!

 .

ఫ్రాన్సిస్ బ్యూమాంట్

1584 – 6 March 1616

 ఇంగ్లీషు కవీ, నాటక కర్తా. (1584 – మార్చి 6, 1616)

ఫ్రాన్సిస్ బ్యూమాంట్, “బ్యూమాంట్ అండ్ ఫ్లెచర్” అని జాకోబియన్, (King James I (1603 – 1625) పరిపాలన) కాలంలో బాగా ప్రసిద్ధికెక్కిన నాటకకర్తల జంటలో మొదటి వ్యక్తి. మొదట్లో, తండ్రి అడుగుజాడలలో, న్యాయవాదవృత్తిపై మక్కువ చూపినా, త్వరలోనే దాన్ని విడిచి, బెన్ జాన్సన్ కి శిష్యుడుగా చేరేడు. జాన్ ఫ్లెచర్ తో కలసి తొలిరోజుల్లో వ్రాసిన నాటకాలు ఎంతగా విజయం సాధించి, వాళ్లిద్దరికీ పేరుప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయంటే, మొత్తం వాళ్ళు విడివిడిగా చేసిన సాహిత్య సృష్టి కూడా సమిష్ఠి సృష్టిగా అపోహపడేవారు చాలా కాలం వరకూ. తర్వాత తర్వాత జరిగిన పరిశోధనలు, కనీసం 9 నాటకాలు వీళ్ళిద్దరి జంటసృష్టిగా గుర్తించింది.

(విశేషమేమిటంటే, బ్యూమాంట్ సమాధికూడా వెస్ట్ మిన్ స్టర్ ఆబీలోనే ఉంది.)

.

Francis Beaumont - Project Gutenberg eText 13220
Francis Beaumont – Project Gutenberg eText 13220 (Photo credit: Wikipedia)

.

On The Tombs of Westminster Abbey
.
Mortality, behold and fear!
What a change of flesh is here!
Think how many royal bones
Sleep within this heap of stones:
Here they lie had realms and lands,
Who now want strength to stir their hands:
Where from their pulpits seal’d with dust
They preach, ‘In greatness is no trust.’
Here’s an acre sown indeed
With the richest, royall’st seed
That the earth did e’er suck in
Since the first man died for sin:
Here the bones of birth have cried—
‘Though gods they were, as men they died.’
Here are sands, ignoble things,
Dropt from the ruin’d sides of kings;
Here’s a world of pomp and state,
Buried in dust, once dead by fate.
.
Francis Beaumont

1584 – 6 March 1616

English Dramatist.

Beaumont, an English Dramatist of Elizabethan Period has his name more often associated with  John Fletcher, with whom he collaborated in many works. Perhaps Beaumont – Fletcher, it is the first successful, highly intellectual, joint collaborators in literature.

Poem Courtesy: http://www.bibliomania.com/0/2/frameset.html

%d bloggers like this: