ఒక స్మృతి… ఏన్ బ్రాంటె, ఇంగ్లీషు కవయిత్రి . నువ్వు వెళ్ళిపోయేవన్నది నిజం. మరెన్నడూ నీ తళుకునవ్వులు నా మనసు మురిపించవన్నదీ నిజం. నేను మాత్రం ఆ ప్రాచీన చర్చిద్వారం దాటి వెళ్ళొచ్చు నిన్ను మూసిన నేలమీదే అడుగులు వెయ్యొచ్చు. . ఆ చల్లని చలువరాతి పలకపై నిలుచుని… నాకు తెలిసిన మిక్కిలి హుషారైన వ్యక్తీ ఇకముందెన్నడూ చూడలేని దయార్ద్రహృదయమూ, క్రింద గడ్డకట్టుకుని ఉన్నాయే అని తలుచుకోవచ్చు. . నిన్నిక ఎన్నడూ కళ్ళతో చూడలేకపోయినా నిన్ను గతంలో చూడగలిగేనన్నది ఎంతో సంతృప్తి; నీ అనిత్యమైన జీవితం ముగిసిపోయినా నువ్వొకప్పుడు జీవించే వన్నది తీపి జ్ఞాపకం. . దైవత్వంతో సరితూగగల ఆత్మ అంతటి దివ్యమైన శరీరంలో ఒదిగి నీవంటి అందమైన హృదయంతో జతగూడి ఒకప్పుడీ భూమికి ఆనందాన్ని కలిగించింది. . ఏన్ బ్రాంటె బ్రిటిషు కవయిత్రి, నవలాకారిణి (17 January 1820 – 28 May 1849) . Anne Brontë, by Charlotte Brontë, 1834 (Photo credit: Wikipedia) . A REMINISCENCE. . Yes, thou art gone! and never more Thy sunny smile shall gladden me; But I may pass the old church door, And pace the floor that covers thee, May stand upon the cold, damp stone, And think that, frozen, lies below The lightest heart that I have known, The kindest I shall ever know. Yet, though I cannot see thee more, ‘Tis still a comfort to have seen; And though thy transient life is o’er, ‘Tis sweet to think that thou hast been; To think a soul so near divine, Within a form so angel fair, United to a heart like thine, Has gladdened once our humble sphere. . Anne Bronte 17 January 1820 – 28 May 1849 English Poet and Novelist Poem Courtesy: http://archive.org/stream/poemsbycurrerell01019gut/brntp10.txt Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జనవరి 25, 2013
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు19th CenturyANNE BRONTEEnglishWoman దేశ సంచారి … జో ఏకిన్స్, అమెరికను కవయిత్రివిషమ పరిస్థితి… ఓరిక్ గ్లెండే జాన్స్, అమెరికను కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.