అనువాదలహరి

దేశ సంచారి … జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి

ఓడలు రేవులో లంగరేసి ఉన్నాయి.

సీగల్స్ వాటి స్థంబాలచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి.

నా ఆత్మ వాటిలాగే అశాంతిగా ఎద్రుచూస్తోంది

ఎప్పుడెప్పుడు నక్షత్రసీమల్ని చేరుకుంటానా అని.

.

నాకు దేశాలు తిరగాలంటే ఎంత సరదానో!

సముద్రమన్నా, నీలాకాశమన్నా చెప్పలేనంత ఇష్టం.

కానీ, ఒక చిన్న సమాధిలో ఇలా కదలకుండా పడుక్కోడం

ఎంత దయనీయమైన పరిస్థితి?

.

జో ఏకిన్స్

(30 October 1886 – 29 October 1958)

అమెరికను కవయిత్రి.

ఏ కవితకైనా మొదటి పాదాలూ, చివరి పాదాలూ చాలా ప్రాణం. సమర్థుడైన కవులు వీటిని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. ఎందుకంటే, మొదటి పాదాలు కవితని చివరిదాకా చదవడానికి కుతూహలపరిస్తే, చివరి పాదాలు, కవిత పూర్తయిన కొంతసేపటి వరకూ పాఠకుడిని వెన్నాడుతాయి.  ఈ కవితలో,  ఆశకీ, నిరాశకీ మధ్య ఉన్న సంఘర్షణ చివరి వరకూ, ఊహించలేనంత చక్కగా నడిపింది కవయిత్రి. చివరి పదాలు చదివేక జీవితం యొక్క అర్థం బోధపడుతుంది. జీవించడంలోని అదృష్టం కూడా బోధపడుతుంది. ఇందులో బలమైన ప్రతీక, రేవులో లంగరు వేసి ఉన్న ఓడలు. వాటిని సమాధిలోని శవంతో పోలుస్తోంది కవయిత్రి. ఓడలు ఉండవలసింది రేవులో కాదు… సముద్రం మీద; మనిషి ఉండవలసింది సమాధుల్లో కాదు… విశాల విశ్వంలో. ఎంత చక్కని భావవ్యక్తీకరణ. ఎంత రమణీయమైన సందేశం. మనం ప్రాణంతో ఉంటున్నందుకు నిజంగా చాలా సంతోషించాలి.

.

Zoë Akins
Zoë Akins (Photo credit: Wikipedia)

.

The Wanderer

.

The ships are lying in the bay,

The gulls are swinging round their spars;

My soul as eagerly as they

Desires the margin of the stars.

.

So much do I love wandering,

So much I love the sea and sky,

That it will be a piteous thing

In one small grave to lie.

.

Zoë Akins

(30 October 1886 – 29 October 1958)

American Poet, Playwright

Zoë Akins, was an artist who became successful as a Broadway playwright. For Akins, this was a hard earned title, which she achieved after years of false starts and near misses. She wrote over 40 plays, 18 of which appeared on the Broadway stage between 1919 and 1944. Also in her oeuvre are two novels, numerous short stories and essays, several film and television scripts, and two volumes of poetry…

Read the rest of the intro at:

http://rompedas.blogspot.com/2010/06/broadway-playwright.html

Poem Courtesy: http://www.bartleby.com/265/7.html

2 thoughts on “దేశ సంచారి … జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి”

 1. దేశ సంచారి … జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి
  by NS Murty
  ఓడలు రేవులో లంగరేసి ఉన్నాయి.

  సీగల్స్ వాటి స్థంబాలచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి.

  నా ఆత్మ వాటిలాగే అశాంతిగా ఎద్రుచూస్తోంది

  ఎప్పుడెప్పుడు నక్షత్రసీమల్ని చేరుకుంటానా అని.

  .

  నాకు దేశాలు తిరగాలంటే ఎంత సరదానో!

  సముద్రమన్నా, నీలాకాశమన్నా చెప్పలేనంత ఇష్టం.

  కానీ, ఒక చిన్న సమాధిలో ఇలా కదలకుండా పడుక్కోడం

  ఎంత దయనీయమైన పరిస్థితి?

  .

  జో ఏకిన్స్

  (30 October 1886 – 29 October 1958)

  అమెరికను కవయిత్రి.

  ఏ కవితకైనా మొదటి పాదాలూ, చివరి పాదాలూ చాలా ప్రాణం. సమర్థుడైన కవులు వీటిని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. ఎందుకంటే, మొదటి పాదాలు కవితని చివరిదాకా చదవడానికి కుతూహలపరిస్తే, చివరి పాదాలు, కవిత పూర్తయిన కొంతసేపటి వరకూ పాఠకుడిని వెన్నాడుతాయి. ఈ కవితలో, ఆశకీ, నిరాశకీ మధ్య ఉన్న సంఘర్షణ చివరి వరకూ, ఊహించలేనంత చక్కగా నడిపింది కవయిత్రి. చివరి పదాలు చదివేక జీవితం యొక్క అర్థం బోధపడుతుంది. జీవించడంలోని అదృష్టం కూడా బోధపడుతుంది. ఇందులో బలమైన ప్రతీక, రేవులో లంగరు వేసి ఉన్న ఓడలు. వాటిని సమాధిలోని శవంతో పోలుస్తోంది కవయిత్రి. ఓడలు ఉండవలసింది రేవులో కాదు… సముద్రం మీద; మనిషి ఉండవలసింది సమాధుల్లో కాదు… విశాల విశ్వంలో. ఎంత చక్కని భావవ్యక్తీకరణ. ఎంత రమణీయమైన సందేశం. మనం ప్రాణంతో ఉంటున్నందుకు నిజంగా చాలా సంతోషించాలి.)
  ఇక నా గోలః
  కవి సంగమం పెద్దలు శ్రీ ఎన్.ఎస్.మూర్తి గారు తమ ‘అనువాదలహరి’
  బ్లాగ్ లో రోజుకోటి చొప్పున విశ్వసాహిత్యంలోని సుప్రసిద్ధమైన చక్కని కవిత్వాన్ని పరిచయం చేస్తుంటారు. మూలము..దానికి మూర్తి గారి అందమైన తెలుగు అనువాదము..అపైన నాబోటి ఔత్సాహికుల జ్ఞానసీమలను విస్తృతపరిచేందుకు కవి పరిచయం ..ఆపైన కవితమీద తమదైన సరళ వ్యాఖ్యానంగా సాగిపోతుంటుంది మూర్తిగారి బ్లాగు ధోరణి. ఇదంతా నిస్వార్థంగా…ప్రతిఫలాపేక్షరహితంగా ఆ మేధావి చేసే సాహిత్యసేవ. మరి మన యువకవులు ఎంతమంది సద్వినియోగ పరుచుకుంటున్నారో తెలీదు. వ్యాఖ్యలను బట్టి చూస్తే మాత్రం స్పందన పరిమితంగా మాత్రమే ఉందనిపించడం ఒకింత విచారకరం.ఏమైనా మూర్తి గారు చేసే సాహిత్యసేవ వెల కట్టలేనిది.రెండు చేతులతో నిండు నమస్కారాలు చేయడం తప్ప నాబోటి వారి అభిమానులు చేయ గలిగిందీ లేదు.
  ఈ రోజు వారి బ్లాగ్ లో ఒక అద్భుతమైన కవిత’దేశసంచారి’ పేరుతో ప్రచురించారు.అది చదివిన వెంటనే నా మనసూ ఏదో విచిత్రమైన ఊహాలొకాల్లోకి ఎగిరిపోయింది.మనసులో ఆ కవిత పాదాలనే అలా అలా మననం చేసుకుంటుంటే నాకూ ఈ పాదాలు తోచాయి.మూర్తిగారి వంటి పెద్దలు ముట్టుకున్న విషయాన్ని మళ్ళీ ముట్టుకోవాలనుకోవడం సాహసం అని తెలుసుకానీ..ఈ సాహసం..అన్నగారి చెప్పులజోడులో కాళ్ళు పెట్టి తప్పటడుగులు వేసే తమ్ముడి అమాయకత్వంగా క్షమించి సహిస్తారని ఆశ. ఆశీర్వదించాలని మనవి.

  రేవుసమాధి
  – జో ఏకిన్స్
  ______

  అయ్యో…రేవుకి బందీ
  ఐపోయిందే ఈ నావ!
  ***
  నా జీవాలన్నీ
  దీని చుట్టూతానే
  మంచుపక్షుల దిగుళ్ళులా!

  నక్షత్రాకాశాలందాలన్నీ
  వూరికే వృథా
  ఔతున్నాయని వ్యథ
  ***

  సముద్ర సంచారం
  సంబరంగా
  చేయాల్సిన వయస్సులో
  పాపం!
  రేవుసమాథంటే
  ఏ నావకైనా
  ఎంత చావో!

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: