అనువాదలహరి

మధ్యంతరం … స్కడర్ మిడిల్టన్, అమెరికను కవి

నాకు అంత పెద్ద వయసు లేకపోయినా,

నువ్వు చిన్నదానివని తెలుసుకోగలను.

నన్ను చిగురాకు అని పిలుస్తారు

నువ్వు ఇప్పుడే విరిసిన మొగ్గవి.

.

అదిగో కొమ్మ మీద ఆ రాక్షసి ఉందే,

గొంగళి, అది నాపై ఒక పొర అల్లేలోగా

నేను నీతో పాటే కొంతకాలం ఎదుగుతాను

భ్రమర నాదం విని, మబ్బుల్ని తిలకిస్తాను.

.

స్కడర్ మిడిల్టన్

(Sept 9. 1888 –  1959)

అమెరికను కవి.

“Life is an interlude between two vast nothings” అని ఒక ఆలోచనా సరళి.

ఈ చిన్న కవిత లోనే కవి మంచి ప్రతీకలు వాడి జీవితం ఎంత క్షణికమో  చెబుతూ, అది ముగిసేలోగానే, మనం దాన్ని ఆస్వాదించాలి అని అంటాడు.  ఇందులో గొంగళిని మృత్యువుకి ప్రతీకగా వాడేడు. భ్రమర నాదం అనుభూతి చెందగలిగింది. మబ్బులు, ఊహలకీ, ఆశలూ, ఆశయాలకీ ప్రతీక. కాబట్టి ఇటు ఇంద్రియానుభవం, అటు ఆత్మానుభవం రెండూ సాధించడానికి ప్రయత్నించాలి అని సందేశం ఇస్తున్నాడు కవి. 

.

Interlude

.

I am not old but old enough

To know that you are very young.

It might be said I am the leaf,

And you the blossom newly sprung.

.

So I shall grow a while with you,

And hear the bee and watch the cloud,

Before dragon on the branch,

The caterpillar, weaves a shroud.

.

Scudder Middleton

(Sept 9. 1888 –  1959)

American Poet

(Unfortunately not much information about this poet is available except that he was born in New York city, educated at Columbia University and was associated with the publishing house Macmillan Company for long. He published two volumes of poetry… Streets and Faces (1917) and The New Day (1919)

(Poem Courtesy:  The Second  Book of Modern Verse ed. Jessie  B. Rittenhouse. P 69)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: