సత్… గేథే, జర్మను కవి
ప్రకృతిలోని అన్ని మార్పులనీ
ఏ మార్పూ లేని భగవంతుడు సృష్టించినట్టు,
ఈ విశాలమైన కళాప్రపంచంలోనూ అంతే.
అంతటా ఒకే అర్థం అంతర్లీనంగా గోచరిస్తుంది:
.
అదే సత్, ఆద్యంతరహితమైన మూలకారణం,
అది సౌందర్యం నుండి తన ఆహార్యాన్ని స్వీకరించి
కాలవాహినిలో ప్రవహిస్తూ, తరుణమై
మనోజ్ఞతకి ప్రతీకగా నిలుస్తుంది, నిజం!
.
గేథే
జర్మను కవి.

.
As all Nature’s thousand changes
But one changeless God proclaim;
So in Art’s wide kingdoms ranges
One sole meaning, still the same:
This is truth, eternal Reason,
Which from beauty takes its dress,
And serene through time and season,
stands for aye in loveliness.
.
(From Meister’s Travels… a Thomas Carlyle Translation; Goethe’s works, volume 5, page 216)
Goethe
German Poet.
(Text courtesy: http://archive.org/stream/journalofspecu0102harruoft#page/n9/mode/1up)
Related articles
- Wisdom Vs Natural Inclinations (graceandgritforlivinglife.wordpress.com)