ప్రేమించే వాళ్ళు … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
అమితంగా ప్రేమించే వ్యక్తులెప్పుడూ
తమప్రేమని వాచ్యం చెయ్యరు.
ఫ్రాన్సెస్కా, గ్వినివేర్,
డీయర్డ్రె, ఈస్యూల్ట్ , హీలియోజ్
కమ్మతెమ్మెరలు వీచే స్వర్గంలో
వాళ్ళు మౌనంగా ఉంటారు. అధవా, మాట్లాడినా
ఏవో పిచ్చాపాటీ కబుర్లాడుకుంటారు.
.
నాకు బాగా తెలిసిన ఒకామె ఉండేది
వయసువచ్చినప్పటినుండీ ఒకర్ని ప్రేమించింది
బలీయమైన విధిని సగర్వంగా
ఒంటరిగా ఎదుర్కుంటుండేది గాని
ఎన్నడూ ఈ విషయం వ్యక్తం చెయ్యలేదు
కానీ, సందర్భవశాత్తూ అతనిపేరు వినిపిస్తే
ఆమె ముఖంలో ఒక వింతకాంతి తళుక్కున మెరిసేది.
.
సారా టీజ్డేల్
అమెరికను కవయిత్రి.
(Notes:
ఫ్రాన్సెస్కా: Francesca da Rimini or Francesca da Polenta (1255–1285)
గ్వినివేర్: Guinevere was the legendary Queen consort of King Arthur.
డీయర్డ్రె : Deirdre is the foremost tragic heroine in Irish mythology
ఈస్యూల్ట్ : The most prominent is Iseult of Ireland, wife of Mark of Cornwall and adulterous lover of Sir Tristan
హీలియోజ్: Héloïse d’Argenteuil 1090? – 16 May 1164) was a French nun, writer, scholar, and abbess, best known for her love affair and correspondence with Peter Abélard)
.
