రోజు: జనవరి 15, 2013
-
చేతులు చుట్టుకుని, దుఃఖపు ఉడుపుల్లో, … అనా అఖ్మతోవా, రష్యను కవయిత్రి
చేతులు చుట్టుకుని, దుఃఖపు ఉడుపుల్లో “ఇవాళ అంత పాలిపోయినట్టు కనిపిస్తున్నావేమి?” ఎందుకంటే, ఇవాళ అతనికో చేదు వార్త చెప్పి అతని శోకపాత్ర పొంగిపొర్లేలా చేశాను. . ఎలా మరిచిపోగలను? అతని అడుగులు తడబడ్డాయి. అతని ముఖం బాధతో వంకరలుపోయింది… అత్రంగా మేడమీదనుండి క్రిందికి ఎకా ఎకిని వీధి గేటు దాకా పరిగెత్తేను. . “ఊరికే, నీతో హాస్యం ఆడేను,” అన్నాను నేను వగరుస్తూ. “నువ్వు వెళ్ళిపోతే ఇక నేను బతకలేను,” అన్నాను. అతను చిత్రంగా నవ్వుతూ, ప్రశాంతంగా…