హైకూలు… (1 వ భాగం), ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

బ్లాగు మిత్రులకి, పాఠకులకీ సంక్రాంతి శుభాకాంక్షలు.

.

నిన్ను నేనెలా బాధపెట్టేను

నావంక అలా పాలిపోయి చూస్తున్నావు?

ఈ కన్నీళ్ళు నావి.

.

ఉదయమూ… సాయంత్రమూ

ఒకప్పుడు ఈ రెండింటికీ

మనమధ్య తేడా ఉండేది కాదు.

.

ఈ అద్భుతమైన ప్రాతః వేళ

నీకోసం కొన్ని కొత్తమాటలు రాస్తున్నాను.

అయినా, నువ్వు నిద్రపోతునే ఉన్నావు.

.

సూర్యోదయమైంది, తెలుసా?

జాలిలేని రంగురంగుల పూబాలల్లారా

నామీద మీకు ఇంకా కనికరం లేదా?

.

మిమ్మల్ని అన్ని దిక్కులా అనుసరించలేక

నా కళ్ళు అలిసిపోతున్నాయి…

ఓ రోజులారా! మీరు కుంచించుకుపోండి!

.

పువ్వు రాలిపోతే,

తోడున్న ఆకుని ఎవరూ పట్టించుకోరు

అందుకే ప్రతిరోజూ నాకు భయం.

.

ఒక్కోసారి నవ్వినప్పుడుకూడా

కళ్లవెనక విషాదం దాగుంటుంది

అందుకే, నన్నుచూసి జాలిపడు.

.

చిరునవ్వు… అదేం గొప్ప విషయం కాదు,

పక్కవాళ్లకి నువ్వు ఆనందంగా ఉన్నట్టు కనిపించవచ్చు,

నేను మాత్రం బాధతో గమనిస్తుంటాను

.

ఈ తెల్లని రోజాపువ్వును తీసుకో.

పువ్వుల తొడిమలేం గుచ్చుకోవులే;

నీ వేళ్ళు పదిలంగానే ఉంటాయి.

.

నది మీది గాలి

పున్నమిచంద్రుడిమీదకి మబ్బుల్ని ఎగదోసినట్టు

నేనుకూడా నీకు అంతే. 

.  

ఏమీ లోవెల్

February 9, 1874 – May 12, 1925

అమెరికను కవయిత్రి.

.

TIME Magazine cover from March 2, 1925 featuri...
TIME Magazine cover from March 2, 1925 featuring Amy Lowell (Photo credit: Wikipedia)

.

Hokku’s on Modern Theme
.

How have I hurt you?

You look at me with pale eyes,

But these are my tears.

.

Morning and evening—

Yet for us once long ago

Was no division.

.

In the ghostly dawn

I write new words for your ears—

Even now you sleep.

.

This then is morning.

Have you no comfort for me

Cold-colored flowers?

.

My eyes are weary

Following you everywhere.

Short, oh short, the days!

.

When the flower falls

The leaf is no more cherished.

Every day I fear.

.

Even when you smile

Sorrow is behind your eyes.

Pity me, therefore.

.

Laugh—it is nothing.

To others you may seem gay,

I watch with grieved eyes.

.

Take it, this white rose.

Stems of roses do not bleed;

Your fingers are safe.

.

As a river-wind

Hurling clouds at a bright moon,

So am I to you.

.

Amy Lowell

February 9, 1874 – May 12, 1925

(Text Courtesy: http://www.gutenberg.org/files/25880/25880-h/25880-h.htm#TWENTY-FOUR_HOKKU_ON_A_MODERN_THEME)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: