ఇసుకకట్ట దాటుతున్నప్పుడు … టెన్నీసన్, ఆంగ్ల కవి.

అదిగో సూర్యుడస్తమిస్తున్నాడు, అదే రేచుక్క,

నన్ను రమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి!

ఇసుకకట్ట*దాటి నేను కడలిలోకి అడుగిడుతున్నపుడు 

వీడ్కోలుచెప్పే కెరటాల కళ్ళు చెమరించకుండుగాక!   

ఈ అపారపారావారపు అగాధమైన

లోతులలోనుండి వెలువడి, సాగి, అలసిసొలసిన ఈ కెరటం

తిరిగి తనువచ్చినచోటికే పోతూ 

నురగలతో సడిచెయ్యడానికీ ఓపికలేనిది.

అదిగో మునిచీకటి, అవే సాంధ్యఘంటారావాలు 

ఇకపై అంతా చిక్కని చీకటి!

నేను నావలోకెక్కుతున్నప్పుడు,

సాగనంపినవారిలో విషాదము లేకుండు గాక; 

దేశాకాలావధులుదాటి నా ప్రయాణం కొనసాగినా

నన్ను తీరానికి చేర్చే శక్తి కెరటాలకు కలుగుగాక,

నేను తీరాన్ని దాటగానే,

నా నావికుడిని ముఖాముఖీ కలుసుకుంటాను.

.

ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నీసన్

6 August 1809 – 6 October 1892

ఆంగ్ల కవి

(* ఇసుకకట్ట : ప్రతిఓడరేవు ముఖద్వారంలో ఉండే ఇసుకకట్ట (Bar) )

ఈ కవిత టెన్నీసన్ తను చనిపోడానికి 3 సంవత్సరాలు ముందు వ్రాసినా, అతని చివరి కవితగా అచ్చువేయమని తన కుమారుడిని ఆదేశించాడు. ఈ కవితలో తన మృత్యువుని, దేశకాలావధులులేని సముద్రప్రయాణంతో పోలుస్తున్నాడు. సముద్రంలోకి అడుగుపెట్టడానికి ప్రతి ఓడా ముఖద్వారంలోని ఇసుకకట్టను దాటాలి (That is Crossing the Bar).  ఇక ఆ తర్వాత మరోతీరం చేరేదాకా అది మృత్యుముఖంలో ఉన్నట్టే. చెలియలికట్టలాంటి ఆ ఇసుక కట్టని, మృత్యువుతో పోలుస్తున్నాడు కవి.

.

Deutsch: Alfred Lord Tennyson 1809-1892 englis...
Deutsch: Alfred Lord Tennyson 1809-1892 englischer Poet. (Photo credit: Wikipedia)

.

Crossing The Bar*

.

.

Sunset and evening star,

And one clear call for me!

And may there be no ‘moaning of the bar’**,

When I put out to sea,

But such a tide as moving seems asleep,

Too full for sound and foam,

When that which drew from out the boundless deep

Turns again home.

Twilight and evening bell,

And after that the dark!

And may there be no sadness of farewell,

When I embark;

For tho’ from out our bourne of  Time and Place

The flood may bear me far,

 I hope to see my Pilot face to face

When I have crost the bar..

.

(1889)

Alfred Lord Tennyson

6 August 1809 – 6 October 1892

English

(Notes:

*Crossing the Bar : There will be a  Bar of Sand at the entrance of a harbour which the Ship crosses to enter into the Sea. The waves will be rough here making lots of sound.
 ** Moaning of the Bar: The poet wishes that the waves be not rough (lamenting his leaving) at the Bar.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: