నిరాశాస్తుతి … ఛార్లెట్ స్మిత్, ఆంగ్ల కవయిత్రి

దిక్కులేని హృదయాలకీ, దైన్యపు చూపులకీ రాజువై

నీ ప్రభావంతో నామమాత్ర వివేకమూ నశింపజేసి  

మనుషులను మతిభ్రష్టులుగా మార్చగల 

భీకరాకారిణీ! భూత స్వరూపిణీ! 

భయద ముఖీ, నిరాశా! నేను సంసిద్ధం,

రా! నన్ను ఆవహించి బలితీసుకో!

నీ నిరంకుశత్వాన్ని, నాపై అనుగ్రహంగా భావిస్తాను!  

.

ఉల్లాసపు తూలికలతో ఆనందపుచిత్రాలుగీసి

వెంటనే అవి కనపడకుండా మాయంచేసే

ఓ నయ వంచకీ, ఇచ్చకపుబుచ్చీ ఆశా! 

ఇక నీ ముఖం నాకెన్నడూ చూపించకు !

నీ కల్పనలకు విరుధ్ధంగా, నా కళ్ళముందు

వాటి ఆభాసలు భయంకరంగా నర్తిస్తున్నాయి..

.

ఛార్లెట్ స్మిత్

4 May 1749 – 28 October 1806

ఆంగ్ల కవయిత్రి

(Note: ఇచ్చకపుబుచ్చీ: మా ప్రాంతాల్లో(ఉత్తరాంధ్ర) ఊరికే పొగిడి ఉబ్బేసే వాళ్లని  ఇలా పిలుస్తారు)

వర్థమాన కవులు ముఖ్యంగా గమనించవలసింది: ఒక నెగెటివ్ లక్షణాన్ని (negative trait) వర్ణించి కవిత వ్రాస్తున్నప్పుడు, కవిత చివరలో పాఠకుడు అర్థం చేసుకోడేమో అన్న ఆదుర్దాతో, కొందరు కవులు తమ సందేశాన్ని వాచ్యం చేసి రసాభాస చేస్తారు. చివరలో పోజిటివ్ లక్షణాన్ని(positive trait) కూడా ఔచిత్యభంగం లేకుండా తెగనాడి, కవయిత్రి ఎంత జాగ్రత్తగా శిల్పాన్ని నిర్వహించిందో గమనించగలరు.  

English: Charlotte Turner Smith
English: Charlotte Turner Smith (Photo credit: Wikipedia)

.

Ode to Despair

.

Thou spectre of terrific mien,
Lord of the hopeless heart and hollow eye,
In whose fierce train each form is seen
That drives sick Reason to insanity!
“Grim visag’d, comfortless Despair:”
Approach; in me a willing victim find,
Who seeks thine iron sway and calls thee kind!

Ah! hide for ever from my sight
The faithless flatterer Hope whose pencil, gay,
Portrays some vision of delight,
Then bids the fairy tablet fade away;
While in dire contrast, to mine eyes,
Thy phantoms, yet more hideous, rise.

(From the Novel Emmeline)

.

Charlotte Turner Smith

4 May 1749 – 28 October 1806

English Poetess

Poem Courtesy: http://cdrh.unl.edu/ctsmithsite/smi.00003/smi.00003.66.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: