కవిత్వమూ – శిల్పమూ… గేథే, జర్మను కవి

Johann Wolfgang von Goethe at age 69
Johann Wolfgang von Goethe at age 69 (Photo credit: Wikipedia)

.

బంకమట్టిని తను ఊహించుకున్న
ఆకృతిలోకి గ్రీకుశిల్పిని మలుచుకోనీ,  
తన చేతిలో రూపుదిద్దుకున్న
శిల్పాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బవనీ…

నాకు మాత్రం యూఫ్రటీస్ నదిని
తాకి, ఆ ప్రవహిస్తున్న నీటిలో
చేతులు అటూ ఇటూ కదిపితే చాలు
ఒళ్ళు తన్మయత్వంతో పులకరిస్తుంది.

తపిస్తున్న నా ఆత్మని శమింపజేసి
నా అనుభూతిని ప్రకటిస్తాను
నిష్కల్మషమైన కవి దోసిలిలో
ఒదిగిన ఆ నీరు… ఘనీభవిస్తుంది.

.

గేథే

28 August 1749 – 22 March 1832

జర్మను కవి, బహుముఖప్రజ్ఞాశాలియైన రచయితా, కళాకారుడు, రాజనీతిజ్ఞుడు

ఈ కవితలో మంచి చమత్కారము ఉంది.  ఒక పక్క మట్టితో చేసిన బొమ్మా, రెండోప్రక్క జీవనది  నీటిమీద పాట. మట్టితో చేసిన బొమ్మ విరిగిపోతుంది. ఆశాశ్వతం. అది ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటుంది. జీవనది నిరంతరం ప్రవహిస్తుంది. మనకి తెలుసు, స్వచ్ఛమైన నీరు మాత్రమే గడ్డకడుతుంది. అందుకనే, “స్వచ్ఛమైన కవి చేతులు” అన్నమాట వాడేడు కవి ఇక్కడ. అప్పుడు గడ్డకట్టిన నీరు,తగినసమయం వచ్చినపుడు తిరిగి నీరుగా మారి ప్రవహిస్తుంది. కవిత్వం ఇప్పుడు చూసి ఆనందించేవారికే కాదు; భవిష్యత్తులోని పాఠకులకి కూడా. “మహాకవి వాక్యము రిత్తవోవునే” అని ఆర్యోక్తి.

 . 

Poetry and Form

 .

Let the Greek mould his clay

To the forms he’s planned,

And take increasing pleasure

In the product of his hands:

But to us it’s blissful when

We clutch at the Euphrates,

And in the flowing element,

Swish to and fro, with ease.

Quenching, so, my burning soul,

I’ll utter what I feel:

Gathered in the poet’s pure hand

The waters will congeal .

.

Goethe

28 August 1749 – 22 March 1832

German Poet, Versatile Artist and Politician

 Poem Courtesy: http://www.poetryintranslation.com/PITBR/German/Goethepoems.htm#Toc74652092

“కవిత్వమూ – శిల్పమూ… గేథే, జర్మను కవి” కి 4 స్పందనలు

 1. మూర్తి సార్! మీరు కనక వ్యాఖ్యానించి ఉండకపోతే ఈ గోరంత కవితలో ఇంత కొండంత భావం ఇమిడి వుందని తెలిసే అవకాశమే లేదు.ఒక మంచి కవితను పరిచయం చేసినందుకు ధన్యవాదాలండీ!

  మెచ్చుకోండి

  1. రావుగారూ,

   మీ వాత్సల్యపూర్వకమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు.

   అభివాదములతో

   మెచ్చుకోండి

 2. కొన్ని కవితలను అర్ధం చేసుకోవాలంటే మీలాంటి వ్యాఖ్యాతలు కావాల్సిందే. అద్భుతంగా ఉంది భావన. ధన్యవాదాలు మూర్తిగారు.

  మెచ్చుకోండి

 3. అమ్మా జ్యోతిర్మయీ,

  ఇప్పటి మన భారత దేశం లాగే, కొంతమంది మూర్ఖుల అధికారదాహానికీ, పగలకీ బలయిపోయి చితికిపోయిన దేశం జర్మనీ. కాని, 19వ శతాబ్దం ముగిసేవరకూ అపూర్వమైన తాత్త్విక చింతనా, ఇంగ్లండు వంటి కొన్ని దేశాలకి సాహిత్యసంపదనీ, మార్గదర్శనాన్నీ ఇచ్చిన దేశం అది. “ఇచటపుట్టిన చిగురుకొమ్మైన చేవ” అని అన్నట్టు అక్కడ పుట్టిన ప్రతివాళ్ళకీ ఆ వాసన అబ్బేది. గేథే వంటి బహుముఖప్రజ్ఞాశాలుల విషయంలో చెప్పనవసరం లేదు. కొత్తగా 1904 లో ప్రారంభించిన “Speculative Philosophy” అన్న పత్రికలోని ప్లేటో నుండి కాంట్ వరకూ సృష్టి గురించీ, దేవుని ఉనికి గురించీ వాళ్ళ సిధ్ధాంతాలు చర్చించిన వ్యాసంలో ప్రముఖంగా పేర్కొనబడ్డ కవి గేథే. తత్త్వచింతన అనగానే ఏదో వయసుమీరినవాళ్ళ వ్యాపకం అని ఇప్పటికీ చాలా మంది అపోహ. తమ జీవితాలకి మార్గాన్ని నిర్ణయించుకుందికి యువకులు శ్రధ్ధగా ఆలోచించి నిర్ణయించుకోవలసిన ప్రక్రియ అని మనవాళ్ళకి బోధపడడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. ఒక కాలానికి చెందిన కవులూ, కళాకారులూ తమతమ రంగాల్లో ప్రతిఫలించే ఆలోచనా సంవిధానమే ఆనాటి తాత్త్విక చింతనగా మనం పేర్కోవచ్చు. దాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలలోతులని కూడా అంచనా వేసుకోవచ్చు.

  ఆశీస్సులతో

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: