అనువాదలహరి

నా ఆత్మ పిరికిదేం కాదు… ఎమిలీ బ్రాంటే, ఇంగ్లీషు కవయిత్రి

తుఫానులలో చిక్కుకున్న ఈ గోళం మీద

భయపడడానికి, నా ఆత్మ పిరికిదేం కాదు:

స్వప్రకాశములైన దేవుని మహిమలు నే చూస్తున్నా

నమ్మకమూ అంతస్థిరంగానే ఉంది, అభయ కవచంలా.

నా హృదయంతరాల్లోని  ఓ దైవమా! 

సర్వవ్యాపీ! సర్వ శక్తిమయా!

నీలోలీనమై నేను అమరత్వాన్ని పొందినపుడు 

నాలోని జీవుడికి ఊరట దొరుకుతుంది!

మనుషుల హృదయాల్ని కదిలించగల మతాలు

వెయ్యైనా నిష్ప్రయోజనం: బొత్తిగా పనికిరావు;

విశాల సాగరాలపై ఊరికే తేలియాడే నురగలా

వాడివత్తలైన కలుపుమొక్కల్లాగా వ్యర్థం;

నిశ్చలమైన అవినాశపు శిలపై

హాయిగా లంగరేసుకుని

అనంతత్వాన్ని అందుకునే వారిలో

సందేహాల్ని మొలకెత్తించడానికి తప్ప.   

గాఢాలింగనం చేసుకున్న ప్రేమతో నీ విశ్వాత్మ

అనంత కాలానికి చలనాన్ని ప్రసాదిస్తుంది

అంతటావ్యాపించి, సృష్టి, స్థితి, లయలగురించి

దీర్ఘంగా తలపోసి, మార్పుల్ని తీసుకొస్తుంది.

ఈ భూమీ, మానవుడూ అంతరించినా,

సూర్యుడూ, విశ్వమూ నశించినా

నీవొక్కడవే మిగిలి ఉండి, నీలోనే  

ప్రతి అస్తిత్వానికీ ఉనికి ఉంటుంది.

అక్కడ మృత్యువుకి చోటూ లేదు

నీశక్తి నిర్వీర్యంచేసే పరమాణువూ ఉండదు;

ప్రాణివీ నువ్వే, ప్రాణశ్వాశవీ నువ్వే

నువ్వు ఏ రూపంలో ఉంటావో దానికి నాశము లేదు.

.

ఎమిలీ బ్రాంటే

30 July 1818 – 19 December 1848

ఇంగ్లీషు కవయిత్రి, నవలా రచయిత్రి

30సంవత్సరాలే జీవించి, పాశ్చాత్య భావధారలో పెరిగినపిల్లలో భారతీయతత్త్వచింతనకి అతిదగ్గరగా నడిచే భావన ఈ కవితలో కనిపించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఈమె పేరు చెప్పగానే Wuthering Heights అన్న నవల గుర్తొస్తుంది. ఒకే కుటుంబం నుండి సాహిత్యంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం అరుదుగా జరుగుతుంది. అటువంటి ముగ్గురు అప్పచెల్లెళ్ళు… ఛార్లెట్, ఎమిలీ, ఏన్ … లలో ఈమె రెండవది. ఛార్లెట్ బ్రాంటే Jane Eyre; ఎమిలీ బ్రాంటే Wuthering Heights. ఏం బ్రాంటే The Tenant of Wildfell Hall మూడూ ఆంగ్లసాహిత్యం లో గొప్ప నవలలుగా పేరు తెచ్చుకున్నాయి.

ఈ కవిత అమెరికను సాహిత్యంలో ఇప్పుడు గొప్ప కవయిత్రిగా గుర్తించబడుతున్న ఎమిలీ డికెన్స్ కి ఇష్టమైన కవితట. ఆమె కోరిక మేరకు, ఆమె మరణానంతర ప్రార్థనలో చదువబడింది.  ఒక కవయిత్రి, వేరొక కవయిత్రికి ఇచ్చే గౌరవం చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది.

.

Emily Brontë
Emily Brontë (Photo credit: NiceBastard)

.

No coward soul is mine,
No trembler in the world’s storm-troubled sphere:
I see Heaven’s glories shine,
And faith shines equal, arming me from fear.

O God within my breast,
Almighty, ever-present Deity!
Life–that in me has rest,
As I–undying Life–have Power in Thee!

Vain are the thousand creeds
That move men’s hearts: unutterably vain;
Worthless as withered weeds,
Or idlest froth amid the boundless main,

To waken doubt in one
Holding so fast by thine infinity;
So surely anchored on
The steadfast rock of immortality.

With wide-embracing love
Thy spirit animates eternal years,
Pervades and broods above,
Changes, sustains, dissolves, creates, and rears.

Though earth and man were gone,
And suns and universes ceased to be,
And Thou wert left alone,
Every existence would exist in Thee.

There is not room for Death,
Nor atom that his might could render void:
Thou–Thou art Being and Breath,
And what Thou art may never be destroyed.
.
Emily Bronte

30 July 1818 – 19 December 1848

This poem is the favorite of Emily Dickens and was read at her Funeral service. What a tribute to both poets!)

%d bloggers like this: