షాంటుంగ్ నుండి తు ఫు కి … లి పో, చీనీ కవి
.
కాలం ఎలాగడుస్తోందని నువ్వడుగుతావు…
నే నో చెట్టు మొదలుకి వెచ్చగా చేరబడి
రాత్రీ పగలూ పైన్ చెట్లలో వీచే
శరద్వీచికలను వింటుంటాను .
.
షాంటుంగ్ మదిర నన్ను మైమరపించలేదు
ఇక్కడికవులంటే నాకు విసిగేస్తుంది.
వెన్ నదిలా అనంతంగా ప్రవహిస్తూ
నా ఆలోచనలన్నీ నీవైపు దారితీస్తాయి.
.
లి పో
(701 – 762)
చీనీ కవి
.
