అనువాదలహరి

అద్దం… సిల్వియా ప్లాత్, అమెరికను కవయిత్రి.

.

నేను వేలెత్తి లోపం చూపలేని తళతళలాడే ఉపరితలాన్ని

నాకు ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు లేవు.

నేను దేన్ని చూస్తే  దాన్ని తక్షణం స్వీకరిస్తాను, యథాతథంగా.

ద్వేషాభిమానాల  పొరలు నన్ను కమ్ముకోవు.

నాకు క్రూరత్వం లేదు, కేవలం నిజాయితీగా ఉంటాను

పాపాయి కనుపాపలా, నాలుగు మూలలతో.

ఎక్కువసమయం ఎదుటిగోడమీదే ధ్యానమగ్నమై ఉంటాను.

అది గులాబిరంగులో ఉంటుంది… అక్కడక్కడ మచ్చలుంటాయి

దాన్ని ఎంతగాపరిశీలించేనంటే అది నా గుండెలో ఒకభాగమైపోయింది.

పదే పదే మమ్మల్ని ముఖాలూ, చీకట్లూ వేరుచేస్తుంటాయి

.

ఇప్పుడు నేనొక సరస్సుని.

ఒక స్త్రీ నా మీదకి వొంగుతుంది.

తనెలా ఉన్నానా అని, నా అంతరాంతరాలని దీక్షగా వెతుకుతూ.

తర్వాత ఆ అబద్ధాలకోరులు, చంద్రుడ్నీ, కొవ్వొత్తుల్నీ ఆశ్రయిస్తుంది

ఆమె నాకు వెన్ను చూపుతుంది. అంత నమ్మకంగానూ ప్రతిఫలిస్తాను.

ఆమె నన్ను కన్నీటితో, వణుకుతున్న చేతులతో సత్కరిస్తుంది.

ఆమెకు నేను చాలా ముఖ్యం. ఆమె వస్తూ పోతూ ఉంటుంది.

ప్రతిఉదయమూ చీకటిని పారద్రోలేది ఆమె ముఖమే.

నాలో ఆమె ఒక పడుచుపిల్లని మునకలేయించితే ;

ఇప్పుడు ఒక్కొక్కరోజు గడుస్తున్నకొద్దీ,

నానుండి ఆమె వైపుకి ఒక ముదుసలి లేచివస్తోంది.

ఒక భయంకరమైన చేపలా.

.

సిల్వియా ప్లాత్

(October 27, 1932 – February 11, 1963)

అమెరికను కవయిత్రి

.

ఈ కవితలో ప్రత్యేకత  అద్దం ముందు ఉన్న స్త్రీ ఎవరన్నది వాచ్యం చెయ్యకపోవడం.  కాని అది తెలుసుకుందికి వీలుగా అన్ని రకాల సంకేతాలూ ఇవ్వడం…. మొదటి భాగంలో అద్దాన్ని అద్దంగా మాత్రమే చిత్రిస్తే, రెండో భాగంలో దానికీ హృదయముందని చెప్పడం. రసవత్తరమైన భాగాలూ, పదాలూ ఇందులో ఏరుకోవలసినవి చాలా ఉన్నాయి.  మొదటి భాగంలో: “నాకు ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు లేవు; ద్వేషాభిమానాల పొరలు కమ్ముకోవు; పాపాయి కనుపాప;  రెండో భాగంలో: ఇపుడు నేనొక సరస్సుని; అబద్ధాలకోరులు చంద్రుడ్నీ, కొవ్వొత్తుల్నీ ఆశ్రయించడం; ఆమెకు నేను చాలా ముఖ్యం; ఆమె పడుచుపిల్ల మునకలేయిస్తే  దుసలి రోజురోజుకీ పైకి లేవడం”

.

Sylvia Plath
Sylvia Plath (Photo credit: Wikipedia)

.

Mirror

.

I am silver and exact.

I have no preconceptions.

Whatever I see I swallow immediately

Just as it is, unmisted by love or dislike.

I am not cruel, only truthful —

The eye of a little god, four-cornered.

Most of the time I meditate on the opposite wall.

It is pink, with speckles. I have looked at it so long

I think it is part of my heart. But it flickers.

Faces and darkness separate us over and over.

…..

( Most of Sylvia Plath’s work is copyrighted.  Please read Full text of the Poem at: http://www.eliteskills.com/c/12623)

(From: The Collected Poems 1961)

Sylvia Plath

(October 27, 1932 – February 11, 1963)

American Poet, Novelist and Short Story writer.

A Film of Fog … Vamshidhar, Indian Poet

 “Oh, you are an MA?

Even those MSc’s and M. Com’s are lurching in the dark.

Want to become a teacher? Who cares for your Telugu?

The medium of instruction is only English here.

What? You want to be a government teacher?

Even the CM is ignorant when the DSC shall meet.

Till then how can you survive?

Chewing your poems? … Ha! Ha !!Ha!!!”

That was the head master of a techno school,

trudging the badge of MA M.Phil. after his name,

speaking to a poor job-seeking mendicant like me

struggling for a square meal …

.

It was a mistake…an awful mistake to cheat parents

to lay the foundation with lies, to a fragile morrow

one never knows when it would crumble.

With no pal to guide me

that a BA Telugu can’t fill my pocket

Worse still, to tell, an MA Telugu

can’t even buy a shirt with pockets,

I settled for an attendance in a speed bar

unable to beg in the land of Telugu,

after doing PG in Telugu

out of my craze for the language…

Then

 *

“Hey buddy, how long will it take?

Two Mansion House and one liver curry…”

“oy! What is the delay for, bastard?

What are you f….ing there?

Come on quick…y…o…u…”

I was just thinking whether he called

the name of my mother or sister…

He was an old customer.

But his swearing anew…

 ***

 “Hey Suri! Hello! Look here. It’s me, Mahati.

Didn’t you recognise me?

Pal, we were classmates in BA.

What are you doing here?”…Mahati

who did not care to hide her navel

in that Georgette sari.

After listening to my story…

“If you are forced here with no other option,

it is my vocation here.

Gender harassment is common everywhere.

Four years ago, I visited even Raj Bhavan.

Only one-day week…

that too, only if I like it…

at least a three-star hotel…

You see that Rhino over there in that Innova…

with him for today…

If you speak of tradition and society,

that society has long been my enemy

when it failed to find me a job for my education…

If some people can’t spend their nights without me,

it only means I am still welcome in society

My house is very near …

visit me on Sunday if you can make time…

That too if you don’t think I am a whore…

“… am a facultative Prostitute,

not an obligatory one you know”

Briefing the social transformation in just three minutes

and making my nascent respect for her

grow multifold instantly,

Mahati got into the Innova.

“Looking more beautiful than last time…

like lady nature personified…

Should I wait till Sunday to meet her…?

Getting a feel of love… for the first time…

Is this ‘that’ really?”

*

By the time I reached her home on Sunday,

There was a skirmish with a Marwari in his fifties…

“Why, aren’t you aware that should repay the loan

the day you took money from me?

If you don’t pay me by day after tomorrow

I shall collect it even by playing a pimp;

That anyway, is your way, bitch!”

He was shouting at her,

painting the walls of her house with his Zarda spittle.

“Speak civil!  Else, we complain against you to police.

Do you think she is helpless?”

I found a hitherto unknown boldness in me

coming to her rescue…

“Oy, hero! Who are you? Her customer, or her husband?

She has to pay me three lakhs. Can you pay me?

Every bastard speaks in her support.

You whore! Remember …

day after tomorrow… three lakhs… bye”

Rubbing the last trace of the spittle on the door…

the Marwari had left.

As the growing silence was distancing us

building a bridge of unfamiliarity between,

“Suri! Please get in.  I am used to these things.

To pay my sister’s college fees that day

I could not find a better source than this fellow…

Do you know what happens the day after tomorrow?

All that the oldie could do is

to stomp on the rusted tambourine…

That’s all!”

I was amazed for a while

at her display of self-confidence

and speaking with such disarmingly natural laughter;

couldn’t help admiring it with a clap,

when she held my hands.

I was gauging the house

with my dirty masculine instincts…

“I am sorry; I should have asked you earlier.

Are you married?

Ha! Ha! I know you are not.

Else, you shouldn’t have been here

no sooner I had invited.

OK, will you marry me now? I am just kidding.

I am in no need of marriage; I need a man. That’s all!

By the way, those days weren’t you writing

poems and editorials  for periodicals?

What is this bloody bar attendance

without settling for that?

Are you interested in writing for cinemas?

Don’t worry, people have all started their careers

first as ghost writers

before they could read their names in the credits.

Tell me if you are interested…

there are many producers who die for me.”

Taking no notice of change of colors in my face,

She coursed the dry towel through her wet hair

making it damp;

picked the plastic sticker from the face of the mirror

and befriended  it to her forehead.

“Neither do I have the connections

to lobby for the poetry page in the magazines,

Nor have the mental strength

to run after the filmy people to hypothecate me.

All that I have is

the desire to do something in the present

to fill my belly for today.”

Has the world become lonely abandoning me?

Or, I became an alien to myself, forgetting about me?

Maybe, life is an enduring journey

In search of an ever eluding, invisible goal.

To my long-haunting question

Whether it was ice, or Varoodhini* that had melted

the ointment under the feet of Pravara*,

Mahati comfortingly took my hands into hers,

As though she were asserting it was only Varoodhini.

Carnal compulsions incite me

to turn this familiarity into experience…

Can anyone imagine a Platonic friendship

between a man and woman devoid of desires?

At least, can they prevent

such ideas cropping up in their mind?

Perhaps, impossible.

And can I be an exception to that?

“Ay, Suri? What are you woolgathering?

Entertaining some crazy ideas

as there is nobody around? Ha. Ha.

That is the way to wash basin.

Come on. I am so hungry.”

Drawing circles on her belly with her right hand,

Mahati reminded me of my forgotten childhood…

 “How is the food?

Definitely better than your hotel stuff.

I know you would turn up and prepared it myself.

Have that eggplant curry… Pal,

Do you know what an emaciated look you have?”

 “ Ma… Mahati! Will you marry me…

I ask you in all earnest

This moment we spend together…

Your laughter that reminds me

that I am still alive…

I want it forever…

I am so exhausted in life

that I can’t care to think about our past.”

“Suri! I am having aids.

Only the day before, I came to know of it.

Other than by sleeping with me,

you won’t get it by dining together.

That is why I invited you.

Perhaps I should have informed you before.

I am sorry. I was afraid

that you might change your opinion about me.

Now tell me if you still want to marry me?”

There was no expression  in her face.

Whether it was fear,

or the despair of the carnal appetite

that the desire can’t be fulfilled for the today,

the morsel in the mouth had become unpalatable

and the silence devoured

the words within the gullet…

“Suri! Please speak something.

Thinking about what?

To know where your stand,

or, which side you should take

to the unfathomable abyss

that divides the values and reforms

you sermonize in your poems

and your unconquerable realities of life

you run away from?

Should silence be your answer,

please see me no more.

I don’t know how I returned to my room

or how I was able to drag my feet…

that night I made a bonfire of all my work

written under the false impression

that I knew everything….

After that,

there never occasioned a compelling reason

that prompted me write again.

And that was the last time I saw Mahati…

I went up to her house any number of times,

but returned as I failed to muster enough courage…

But, that was a conversation I cherish so much….

***

“You idiot!

You served the order of this table on the next.

Has your commonsense been f…ked?”

Some new customer,

rewarding me for my absentmindedness…

I still believe

that Mahati must be watching me

from somewhere…

As the stream of consciousness whirl in my mind…

bidding to rend the films of fog

under the shade of loneliness or some isolation

to wail…  without empathy

or laugh … a casual laugh

in my wonted way,

and as simple as ever,

I abandon this world

and go all alone.

.

Vamshidhar.

Dr. Vamshidhar Reddy
Dr. Vamshidhar Reddy

(Notes: * Varoodhini : Is the   Gandharva damsel and heroine of the story “Swarochisha Manu Sambhavamu (The story about the birth of Swarochisha Manu)”a noted work by Peddana, of the Court of Sri Krishna Devaraya, of Vijayanagar .

*Pravara: Is a devout Brahmin who has a fascination to see the Himalayas and with the help of a yogi’s ointment to his feet, and the instruction to return back before it melts, visits Himalayas for few hours.  He fails to notice it melting away having lost himself in the wonders of the Himalayas.  He stumbles upon Varoodhini while searching for some divine help to get back home before sunset. Varoodhini, who falls in love with him the moment she sees him, delays his departure. Finally with the blessings of Lord Agni he gets back home.  The twist of the story is that a Gandharva,  who  loves Varoodhini but whose love she refuses, comes to know of her affections for Pravara and consummates his love by impersonating Pravara. )

The Telugu Original:  మంచు తెర

మనసుకో విన్నపం … రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి

నేనో చిన్నపాటి పాపం కూడా చెయ్యకూడదా?

ఎందుకు నువ్వు వెంటనే చిత్రగుప్తుడిలా చిఠా రాస్తావు?

ఒక చిన్న తియ్యని పాపం చేస్తాను

నువ్వు చూసీచూడనట్టు ఊరుకోవా?

నే చెయ్యబోయే సున్నితమైన అపరాథం

ఎవరికీ అనుమానం రాకుండా కప్పిపుచ్చుతాను

ఎంత చీకటి తెర వేస్తానంటే, నే చేసే పాపం

నరమానవుడి కంటికి కనిపించదు.

వివేకవంతుల కళ్ళు బహుమతులతో మూసుకుంటాయి,

లంచంతో ఇతర సాక్షుల్ని తూర్పారబట్టవచ్చు,

ఓ నోరులేని నిశిరాత్రి, విశృంఖలంగా తిరగడానికి

నీ పెన్నూ, ఇంకూ పక్కనబెట్టి

ఏమీ రాయకుండా చూడడానికి

బంగారంతో నీ నోరు మూయించలేనా?

.

సాధ్యపడదూ?… సరే. అయితే చేసేదేముంది?

అయితే, ఇకపై తప్పుదారిలో సంచరించనని

భవిష్యత్తుపై ఆనవేసి చెబుతున్నాను. అప్పుడు

నీకుగాని, యమధర్మరాజుకిగాని భయపడక్కరలేదు.

.

రాబర్ట్ హెర్రిక్

(24 August 1591 – buried 15 October 1674)

ఇంగ్లీషు కవి

.

ఈ కవితలో మంచి చమత్కారాలున్నాయి. ముఖ్యమైన విషయం ఇది 17వ శాతాబ్దపు కవి వ్రాసినది. అప్పట్లోనే  “వివేకవంతుల కళ్ళు బహుమతులతో మూసుకుంటాయి; సాక్షుల్ని లంచంతో తూర్పారబట్టవచ్చు ” అనడంలో అవినీతికి చాలా వయసుందనీ, అది వయసుతోపాటు బలపడటమే తప్ప బలహీనం కావటం లేదనీ తెలుస్తోంది. అంతేకాదు, బంగారానికి కూడ లొంగని మనసు ఉన్నవాడు అటు యముడికి కూడా భయపడక్కరలేదు అని సందేశాన్నిచాలా సున్నితంగా చెప్పేడు. ఇక్కడ బంగారం ప్రసక్తి చాలా ముఖ్యమైనది. అన్నిప్రలోభాలలోకంటే, బంగారం ప్రలోభం పెద్దది. “మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమోనమః” అన్నది ఊరికే రాలేదు. కన్నతల్లికీ, బిడ్దలకీ శత్రుత్వం తేగల శక్తి బంగారానికి ఉన్నది. ఈ సందర్భంలో కొందరు హిరణ్యం అంటే బంగారం కానక్కరలేదు, ఏ నాణెమైనా కావొచ్చు అనుకోవచ్చు. 1605 వరకూ బ్రిటనులో  అంతెందుకు, మనదేశం బ్రిటిషువాళ్ళు పరిపాలించేరోజుల్లో కూడా,బంగారు నాణేలు చలామణీలో ఉండేవి. అది సావెరీను(Sovereign). అందులో 113 వీసాల బంగారం ఉండేదని వికిపీడియా ఉవాచ.

.

English: Robert Herrick (baptized 24 August 15...
English: Robert Herrick (baptized 24 August 1591 – buried 15 October 1674[1]) was a 17th century English poet. (Photo credit: Wikipedia)

.

To His Conscience

.

Can I not sin, but thou wilt be

My private protonotary?

Can I not woo thee, to pass by

A short and sweet iniquity?

I’ll cast a mist and cloud upon

My delicate transgression,

So utter dark, as that no eye

Shall see the hugg’d impiety.

Gifts blind the wise, and bribes do please

And wind all other witnesses;

And wilt not thou with gold be tied,

To lay thy pen and ink aside,

That in the mirk and tongueless night,

Wanton I may, and thou not write?

–It will not be:And therefore, now,

For times to come, I’ll make this vow;

From aberrations to live free:

So I’ll not fear the judge, or thee.

.

Robert Herrick

24 August 1591 – buried 15 October 1674

 English poet.

(Poem Courtesy: http://www.eliteskills.com/c/1884)

వెస్ట్ మిన్ స్టర్ చర్చి సమాధులు… ఫ్రాన్సిస్ బ్యూమాంట్, ఆంగ్ల కవి

ఓ మరణమా! ఇటుచూడు. భయమేస్తుంది!

శరీరాలెంత దారుణంగా మారిపోయాయో!

ఒక సారి ఊహించుకో! ఈ రాళ్ళ గుట్టలక్రింద

రాజ్యాలేలిన ఎన్ని అస్థికలు నిద్రిస్తున్నాయో;

ఇక్కడ పరున్నవారి కొకప్పుడు

సామ్రాజ్యాలూ, సార్వభౌమత్వాలూ ఉండేవి.

పాపం! వాళ్లకిపుడు చేతులుకదపగలిగే శక్తి కూడా లేదు.

మట్టితో మూసిన వాళ్ళ ప్రసంగ వేదికలనుండి

ఇలా ప్రకటిస్తున్నారు: “గొప్పదనానికి హామీ లేదు”

.

ఇక్కడ ఒక ఎకరం జాగాలో,

పాపంచేసి మరణించిన తొలి మానవుడినుండీ

నేటివరకూ భూమిపై మరణించిన గొప్పగొప్ప రాజులలో

ఘనతవహించిన అధికసంఖ్యాకులిక్కడనే ఉన్నారు.

ఇక్కడి ఎముకలు ఘోషిస్తున్నాయి:

“వాళ్ళు దేముళ్లైతే అవొచ్చు, కానీ, మనుషుల్లానే మరణించారు.”

ఇక్కడ రాజుల శిధిల సమాధులనుండి జారి,

ఇసుకతో పాటు, చెప్పలేని కొన్ని హేయమైన వస్తువులున్నై.

ఒకసారి విధి మృత్యువుపాల్జేస్తే, ఆ పటాటోపాలూ

ఆ వైభవాలూ అన్నీ మట్టిలో కలవాల్సిందే!

 .

ఫ్రాన్సిస్ బ్యూమాంట్

1584 – 6 March 1616

 ఇంగ్లీషు కవీ, నాటక కర్తా. (1584 – మార్చి 6, 1616)

ఫ్రాన్సిస్ బ్యూమాంట్, “బ్యూమాంట్ అండ్ ఫ్లెచర్” అని జాకోబియన్, (King James I (1603 – 1625) పరిపాలన) కాలంలో బాగా ప్రసిద్ధికెక్కిన నాటకకర్తల జంటలో మొదటి వ్యక్తి. మొదట్లో, తండ్రి అడుగుజాడలలో, న్యాయవాదవృత్తిపై మక్కువ చూపినా, త్వరలోనే దాన్ని విడిచి, బెన్ జాన్సన్ కి శిష్యుడుగా చేరేడు. జాన్ ఫ్లెచర్ తో కలసి తొలిరోజుల్లో వ్రాసిన నాటకాలు ఎంతగా విజయం సాధించి, వాళ్లిద్దరికీ పేరుప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయంటే, మొత్తం వాళ్ళు విడివిడిగా చేసిన సాహిత్య సృష్టి కూడా సమిష్ఠి సృష్టిగా అపోహపడేవారు చాలా కాలం వరకూ. తర్వాత తర్వాత జరిగిన పరిశోధనలు, కనీసం 9 నాటకాలు వీళ్ళిద్దరి జంటసృష్టిగా గుర్తించింది.

(విశేషమేమిటంటే, బ్యూమాంట్ సమాధికూడా వెస్ట్ మిన్ స్టర్ ఆబీలోనే ఉంది.)

.

Francis Beaumont - Project Gutenberg eText 13220
Francis Beaumont – Project Gutenberg eText 13220 (Photo credit: Wikipedia)

.

On The Tombs of Westminster Abbey
.
Mortality, behold and fear!
What a change of flesh is here!
Think how many royal bones
Sleep within this heap of stones:
Here they lie had realms and lands,
Who now want strength to stir their hands:
Where from their pulpits seal’d with dust
They preach, ‘In greatness is no trust.’
Here’s an acre sown indeed
With the richest, royall’st seed
That the earth did e’er suck in
Since the first man died for sin:
Here the bones of birth have cried—
‘Though gods they were, as men they died.’
Here are sands, ignoble things,
Dropt from the ruin’d sides of kings;
Here’s a world of pomp and state,
Buried in dust, once dead by fate.
.
Francis Beaumont

1584 – 6 March 1616

English Dramatist.

Beaumont, an English Dramatist of Elizabethan Period has his name more often associated with  John Fletcher, with whom he collaborated in many works. Perhaps Beaumont – Fletcher, it is the first successful, highly intellectual, joint collaborators in literature.

Poem Courtesy: http://www.bibliomania.com/0/2/frameset.html

చిత్రమైన సంఘటన … విష్ణుప్రసాద్ , మలయాళీ కవి

.

దృశ్యం 1

లేదా

మిలిండా కురియన్ అనే సేల్స్ గర్ల్

వస్త్ర దుకాణంలో ఎలా

ఒంటరిగా మిగిలింది?

 

లాఠీలుపట్టుకున్న పోలీసులనే చెత్తబుట్టలోకి

ఎవరు ఊరు ఊరంతటినీ ఒంపీసింది?

లేదా అకస్మాత్తుగా దుకాణాలు మూసెయ్యమని ఆజ్ఞాపించింది?

ఇక్కడ ఊరంతా ఎలా నిర్మానుష్యం ఐందన్నది ప్రాథమికం

మేధావులు ఎప్పటినుండో అంటూనే ఉన్నారు

ఇక్కడ ప్రతీదీ కుట్రే అని.

 

ఏది ఎమైనా,

ఎలా జరిగినా

మిలిండా కురియన్ మాత్రం

Merriment Textiles లో

అకస్మాత్తుగా ఒంటరిగా మిగిలిపోయింది.

షో రూం యజమాని షఫీక్,

షాపు తాళాలు ఆ అమ్మాయి చేతికి ఇచ్చి

షట్టరు దించి

బైకుమీద వెళ్ళిపోయాడు.

 

ఆమె కొత్తగా వచ్చిన దుస్తులను

అక్కడున్న మూడు మగబొమ్మలు

లియో, డియో, రియో లకు తొడుగుతోంది.

 

అకస్మాత్తుగా

అందులోని లియో అన్న బొమ్మకి ప్రాణం వచ్చి

ఆమె భుజాలమీద చేతులు వేశాడు.

ఆమె ఆశ్చర్యపోయి అందులోంచి తేరుకునేలోగా

ఆమెని ఎత్తుకుని స్టోర్ లోకి వెళ్ళేడు

మిగతా రెండుబొమ్మలకీ ప్రాణం వచ్చి

అతన్ని అనుసరించేరు.

ఆమె సహాయంకోసం కేకలువేస్తుంటే

ఆమెగొంతులో గుడ్దలు కుక్కి…

ఆమెని దుకాణంలోని బట్టలమీద పడేసి…

ఒకరి తర్వాత ఒకరు…

అవి నిజమైన బొమ్మలే, అయితేనేం,

అవి అచ్చమైన మగ మృగాల్లాగే ప్రవర్తించేయి.

 

దృశ్యం 2

 

ఒక గంట గడుస్తుంది.

నగరానికి మళ్ళీ ఊపిరివస్తుంది.

యజమాని షఫీక్ షాపుకి తిరిగి వస్తాడు

(దుకాణాలు మూసే నిరసనై ఉండదు.

అయితే గంటసేపే ఎందుకుంటుంది?

బహుశా  సంఘవ్యతిరేకశక్తులపై

పోలీసులు విరుచుకుపడడమై ఉండొచ్చు)   

మళ్ళీ షట్టర్లు పైకి లేస్తాయి.

Merriment Textiles వస్త్రదుకాణంలో 

ఇప్పుడు, కొత్తచీర చుట్టబడి 

మిలిండ అనే ఆడబొమ్మ

ప్రదర్శన పెట్టెలో నిలుచుంటుంది.  

ఇప్పుడది యదార్థమైన బొమ్మే

ఫైబరుతొనో దేంతోనో చేసుంటారు దాన్ని.

షోరూం జనాలతో కిటకిటలాడి పోతుంది.  

 

లియో, డియో, రియో ముగ్గురూ

ఖాతాదారులకి సేవలందించే సేల్స్ బాయ్స్.

వాళ్ళు ప్రదర్శన బొమ్మలు కానే కారు.

అన్నిరకాల నమూనాలలోని వస్త్రాలనీ  

చక్కగా అందంగా నవ్వుతూ

చూపిస్తూనే ఉంటారు.

వాళ్ళు యదార్థమైన మనుషులు.

  

ప్రమాణపత్రం

 

ప్రత్యక్షసాక్షిగా

ఇదే నా ప్రమాణం.

  

మొదటి సందర్భంలో

మిలిండా కురియన్ ని

సేల్స్ గర్ల్ గా చూసేను.

ఆమె యదార్థమైన స్త్రీయే. కానీ,

ఆమెని మానభంగం చేసింది మాత్రం

రియో, డియో, లియో అనే ప్రదర్శన బొమ్మలు.

అవి కేవలం బొమ్మలైనప్పటికీ

చిత్రాతి చిత్రంగా,ఎక్కడనించి వచ్చిందోగాని,

వాటిలో చేతన మాత్రం వచ్చింది. ఇప్పటికీ

ఆ శరీరాల్లో అమానవీయ ప్రకృతి మిగిలే ఉంది.

 

రెండో సందర్భంలో

మిలిండా అచ్చమైన ప్రదర్శన బొమ్మ

ఆమె నిజమైన స్త్రీ అనడానికి

ఆస్కారాలు ఏమీ కనిపించడం లేదు.

ఉదాహరణకి, షాపు యజమాని షఫీక్

నామమాత్రంగా కూడా స్పందించలేదు. 

ఖాతాదారులు కూడ

చెప్పరాని నేరమేదో జరిగినట్టు

అనుమానిస్తున్న సూచనలుకూడా ఏవీ లేవు.

లియో, డియో, రియో ముగ్గురూ

అన్ని రకాలుగానూ మగపురుగులే.

వాళ్ళు ప్రదర్శన బొమ్మలుగాని,

వాళ్ల శరీరాలు అసహజమైనవిగాని కావు.

 

రచయితగా నేను చేసిందేమిటంటే

రెండు సందర్భాలలో తలెత్తిన

రెండు రకాల అవగాహనలనీ

సమ్మిళితం చెయ్యడానికి ప్రయత్నించేను.

ఇందులో మీకు ఏమైనా అనుమానాలు తలెత్తితే

ఇప్పటికి నేను చెప్పగలిగింది ఇంతే:

ఇందులోని యదార్థం ఆ రెకెత్తే అనుమానాలే అని.

.

విష్ణుప్రసాద్ 

మలయాళీ కవి.

ఒక అమానవీయ సంఘటన జరిగినపుడు కవులు ఎలా స్పందించాలో, దాన్ని ఎంత జాగ్రత్తగా, పదాల్లో  చిత్రీకరించాలన్నదానికి, నా దృష్టిలో, ఈ కవిత ఉదాహరణగా నిలబడుతుంది. ఇందులో శిల్పం నిస్సందేహంగా కొత్తపుంతలు తొక్కింది. ఈ కవిత గొప్పదనం చివరి పంక్తుల్లోనే ఉంది.  ఒక్కోసారి సంఘటనలు యాదృచ్ఛికాలు కావు. కాని యాదృచ్ఛికాలుగా చేసే కల్పన ఉంటుంది. ఆ కల్పనలోని చాకచక్యమే సందేహాలకు తావు కల్పిస్తుంది. ఆ తావులోంచే న్యాయం నీరుగారిపోతుంది.

ఆవేశాలూ, శాపనార్థాలూ, ప్రాక్సీ అభిమానాలూ, లేదా సంవేదనలూ, కవిత్వం కాదు.  మనలోని హిపోక్రిసీని, సంఘంలో ఎంత పకడ్బందీగా, వ్యవస్థీకృతంగా అన్యాయాలు జరుగుతున్నాయో, వాటికి ఎవరెవరు ఎలా కొమ్ముకాస్తున్నారో, వాళ్ళ పాత్రలేమిటో, వివరిస్తూ, అన్యాయాన్ని ఎత్తిచూపించడంలో జంకకపోవడమే కవిచెయ్యవలసిన పని. అందుకు శ్రీ విష్ణుప్రసాద్ గారిని అభినందించకుండా ఉండలేను.

.

vishnuprasad

.

Narration of an obscure and mysterious incident

Spectacle One

Or,

How did Melinda Kurian,

the sales girl,

find herself alone in the showroom?

Who emptied out the city into

the trash can of a baton wielding police assault

or a suddenly descending `shutters down’ call?

It was crucial that the city be vacant.

Learned people have said this for long

That everything is a conspiracy.

Whatsoever,

howsoever,

Melinda Kurian was alone

in Merriment Textiles.

The showroom owner Shafeeq

gave the keys to the girl,

rolled down the shutter

and sped off on his bike.

She was putting clothes

from a new type of fabric

on three male mannequins

named Leo, Deo and Rio.

All of a sudden,

the male mannequin named Leo

laid his hands on her shoulder.

Soon as she looked up shell shocked,

he lifted her and carried her to the store.

The other two mannequins followed them.

When she cried for help,

the mannequin gagged her mouth.

She was laid on top of the clothes in the store.

Then, the mannequins took turns….

They were real mannequins.

Yet, they carried out their duty

as males.

Spectacle Two

An hour passed. The city came alive.

The showroom owner Shafeeq returned.

(Can’t be `shutters-down strike’ for just an hour.

Must have been a crackdown by the police.)

The shutter was rolled up.

Now, draped in a new sari,

Melinda, the mannequin,

stands in the display booth

of Merriment Textiles.

She is a real mannequin

made of fiber or some such stuff.

The showroom is packed.

Leo, Deo and Rio

are the three sales boys

attending to the customers.

They are not mannequins at all.

They keep displaying clothes

in many design patterns

with beatific smiles.

They are three real men.

Affidavit

This, my affidavit

as an eyewitness.

In the first situation,

it was as a sales girl

that I saw Melinda Kurian.

She was a real woman.

But, she is raped by

three mannequins named Rio, Deo and Leo.

Though mere mannequins,

they did gain mobility, most amazingly,

out of the blue.

But, they still retained their plastic bodies.

In the second situation,

Melinda is a true mannequin.

There is no evidence in the second situation

to demonstrate that Melinda had been a woman.

For example, the shop owner Shafeeq

is not even mildly surprised.

The customers too don’t show any sign that

anything untoward had taken place.

Leo, Deo and Rio, all the three, are men in every way.

They are not mannequins or plastic-bodied.

What I did as a writer was to

cobble together these two perceptions

that cropped up in two situations.

If this created any puzzlement,

I can only say for now

that this uncertainty is the reality. 

.

Malayalam Original: Vishnu Prasad

English Translation by: Ra. Sh.

విషమ పరిస్థితి… ఓరిక్ గ్లెండే జాన్స్, అమెరికను కవి

కళ్ళు మిరిమిట్లు గొలిపేలా

చంద్రుడు ఆకాశంలో మెరిస్తే నేమిటి

ఆ చిట్టడవి చివర చెట్లగుబురులతో

చుక్కలు దోబూచులాడితే నేమిటి?

.

తుప్పలునరికి,చదునుచేసీ కలుపుతీసీ

మనిషి విత్తు నాటవలసిందే, 

దానికి రక్షణగా దడికట్టినపుడు

హెచ్చరికగా తెల్లగీత గీయవలసిందే.

.

అందమైన వయిలెట్ పువ్వులగురించీ

మనుషులు చేసే పనులు చెప్పడానికీ

వానలా  పెద్దచప్పుడు చేసుకుంటూ

దేముడు వస్తేనేమిటి?

.

నా మెదడుకి పదునుపెడుతూ

నా పాట్లు నే పడవలసిందే

నాకు తెలిసిన అన్న మాటల్లోంచి

ఒక సత్యాన్ని ఆవిష్కరించవలసిందే.

.

ఓరిక్  గ్లెండే జాన్స్

జూన్ 2, 1887 – జులై 8, 1946.

అమెరికను కవి, నాటక కర్తా

.

ఓరిక్ జాన్స్, టీ ఎస్. ఏలియట్, స్కాట్ ఫిజెరాల్డ్, ఎర్న్ స్ట్ హెమింగ్వే మొదలయిన హేమా హేమీల సాహిత్యవేత్తల కూటమిలో ఒకడు. అతను 5 కవిత్వ సంకలనాలు వెలువరించేడు. 1912 లో  The Lyric Year  అన్న పత్రిక నిర్వహించిన కవితల పోటీలో  ఎడ్నా సెంట్. విన్సెంట్ మిలే పై గెలుపొందాడు. కాని తర్వాత విషయాలు తెలుసిన తర్వాత తనకి అనుకూలంగా వచ్చిన నిర్ణయం న్యాయబద్ధమైనది కాదు అని చెప్పిన ఔదార్యుడు.

ఇక్కడ కవి వ్యవసాయంలోంచి ఉపమానం ఇస్తున్నట్టు కనిపించినా, అది నిజమైన వ్యవసాయానికి సంబంధించినది కాదు. ఇక్కడ  దేముని ఉనికితో సంబంధంలేకుండా,(ఉన్నా లేకపోయినా), మనిషికి ఉన్న పెద్ద సమస్య అల్లా “సత్యాన్ని” ఆవిష్కరించడం. దానిని నిర్వచించుకోడానికి సరియైన పదాలని, ఎంచుకోవడం. సరియైన పదం దొరకనపుడు కొత్తపదాలని సృష్టించుకోవడం. వాటి పరిమితులు నిర్ణయించుకోవడం. ఇక్కడ తుప్పలూ డొంకలూ నరకడం, మొట్టమొదటి తరం వారు జ్ఞానమనే రహదారి ఏర్పరచడానికి పడే పాట్లు.  మాటలనీ, ఆలోచనలనీ ఒక గాడిలో పెట్టి, తమకి తెలిసిన విజ్ఞానమనే విత్తు నాటాలి. దానికి ఉన్న  అర్థాల పరిమితులను దడిలా గీసి చెప్పాలి. కొంతకాలంపోయిన తర్వాత పాతమాటలకి కొత్త అర్థాలు వస్తాయి. గాని, పాత వాటిని అర్థం చేసుకుందికి, పాత అర్థంలోనే వాటిని గ్రహించాలి తప్ప కొత్త అర్థాలతో అన్వయించకూడదు. అదే దడి కట్టడం. దేముడు ఎన్ని సందేశాలు చెప్పినా, మనిషి, తనకున్న పదసంపద పరిథిలోనే సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి. ఇంకెవ్వరూ వచ్చి సత్యాన్ని ఆవిష్కరించరు.

.

Dilemma

.

What though the moon should come

With a blinding glow,

And the stars have a game

On the wood’s edge,

A man would have to still

Cut and weed and sow,

And lay a white line

When he plants a hedge.

What though God

With a great sound of rain

Came to talk of violets

And things people do,

I would have to labor

And dig with my brain

Still to get a truth

Out of all words new

.

Orrick  Glenday Johns

June 2, 1887 – July 8,  1946

American Poet  and playwright

Orrick Johns  was part of the literary group that included T. S. Eliot, F. Scott Fitzgerald, and Ernest Hemingway. He was active in the Communist Party.  His victory over Edna St. Vincent Millay ‘s Renascence in the poetry contest conducted by The Lyric Year  was a legend.  He felt his victory a misjudgment.

Poem Courtesy: http://www.bartleby.com/271/31.html

ఒక స్మృతి… ఏన్ బ్రాంటె, ఇంగ్లీషు కవయిత్రి

.

నువ్వు వెళ్ళిపోయేవన్నది నిజం. మరెన్నడూ

నీ తళుకునవ్వులు నా మనసు మురిపించవన్నదీ నిజం.

నేను మాత్రం ఆ ప్రాచీన చర్చిద్వారం దాటి వెళ్ళొచ్చు

నిన్ను మూసిన నేలమీదే అడుగులు వెయ్యొచ్చు.

.

ఆ చల్లని చలువరాతి పలకపై నిలుచుని…

నాకు తెలిసిన మిక్కిలి హుషారైన వ్యక్తీ

ఇకముందెన్నడూ చూడలేని దయార్ద్రహృదయమూ,

క్రింద గడ్డకట్టుకుని ఉన్నాయే అని తలుచుకోవచ్చు.

.

నిన్నిక ఎన్నడూ కళ్ళతో చూడలేకపోయినా

నిన్ను గతంలో చూడగలిగేనన్నది ఎంతో సంతృప్తి;

నీ అనిత్యమైన జీవితం ముగిసిపోయినా

నువ్వొకప్పుడు జీవించే వన్నది తీపి జ్ఞాపకం.

.

దైవత్వంతో సరితూగగల ఆత్మ

అంతటి దివ్యమైన శరీరంలో ఒదిగి

నీవంటి అందమైన హృదయంతో జతగూడి

ఒకప్పుడీ భూమికి ఆనందాన్ని కలిగించింది.

.

ఏన్ బ్రాంటె

బ్రిటిషు కవయిత్రి, నవలాకారిణి

(17 January 1820 – 28 May 1849)

.

Anne Brontë, by Charlotte Brontë, 1834
Anne Brontë, by Charlotte Brontë, 1834 (Photo credit: Wikipedia)

.

A REMINISCENCE.

.

Yes, thou art gone! and never more
Thy sunny smile shall gladden me;
But I may pass the old church door,
And pace the floor that covers thee,

May stand upon the cold, damp stone,
And think that, frozen, lies below
The lightest heart that I have known,
The kindest I shall ever know.

Yet, though I cannot see thee more,
‘Tis still a comfort to have seen;
And though thy transient life is o’er,
‘Tis sweet to think that thou hast been;

To think a soul so near divine,
Within a form so angel fair,
United to a heart like thine,
Has gladdened once our humble sphere.

.

Anne Bronte

17 January 1820 – 28 May 1849

English Poet and Novelist

Poem Courtesy: http://archive.org/stream/poemsbycurrerell01019gut/brntp10.txt

దేశ సంచారి … జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి

ఓడలు రేవులో లంగరేసి ఉన్నాయి.

సీగల్స్ వాటి స్థంబాలచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి.

నా ఆత్మ వాటిలాగే అశాంతిగా ఎద్రుచూస్తోంది

ఎప్పుడెప్పుడు నక్షత్రసీమల్ని చేరుకుంటానా అని.

.

నాకు దేశాలు తిరగాలంటే ఎంత సరదానో!

సముద్రమన్నా, నీలాకాశమన్నా చెప్పలేనంత ఇష్టం.

కానీ, ఒక చిన్న సమాధిలో ఇలా కదలకుండా పడుక్కోడం

ఎంత దయనీయమైన పరిస్థితి?

.

జో ఏకిన్స్

(30 October 1886 – 29 October 1958)

అమెరికను కవయిత్రి.

ఏ కవితకైనా మొదటి పాదాలూ, చివరి పాదాలూ చాలా ప్రాణం. సమర్థుడైన కవులు వీటిని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. ఎందుకంటే, మొదటి పాదాలు కవితని చివరిదాకా చదవడానికి కుతూహలపరిస్తే, చివరి పాదాలు, కవిత పూర్తయిన కొంతసేపటి వరకూ పాఠకుడిని వెన్నాడుతాయి.  ఈ కవితలో,  ఆశకీ, నిరాశకీ మధ్య ఉన్న సంఘర్షణ చివరి వరకూ, ఊహించలేనంత చక్కగా నడిపింది కవయిత్రి. చివరి పదాలు చదివేక జీవితం యొక్క అర్థం బోధపడుతుంది. జీవించడంలోని అదృష్టం కూడా బోధపడుతుంది. ఇందులో బలమైన ప్రతీక, రేవులో లంగరు వేసి ఉన్న ఓడలు. వాటిని సమాధిలోని శవంతో పోలుస్తోంది కవయిత్రి. ఓడలు ఉండవలసింది రేవులో కాదు… సముద్రం మీద; మనిషి ఉండవలసింది సమాధుల్లో కాదు… విశాల విశ్వంలో. ఎంత చక్కని భావవ్యక్తీకరణ. ఎంత రమణీయమైన సందేశం. మనం ప్రాణంతో ఉంటున్నందుకు నిజంగా చాలా సంతోషించాలి.

.

Zoë Akins
Zoë Akins (Photo credit: Wikipedia)

.

The Wanderer

.

The ships are lying in the bay,

The gulls are swinging round their spars;

My soul as eagerly as they

Desires the margin of the stars.

.

So much do I love wandering,

So much I love the sea and sky,

That it will be a piteous thing

In one small grave to lie.

.

Zoë Akins

(30 October 1886 – 29 October 1958)

American Poet, Playwright

Zoë Akins, was an artist who became successful as a Broadway playwright. For Akins, this was a hard earned title, which she achieved after years of false starts and near misses. She wrote over 40 plays, 18 of which appeared on the Broadway stage between 1919 and 1944. Also in her oeuvre are two novels, numerous short stories and essays, several film and television scripts, and two volumes of poetry…

Read the rest of the intro at:

http://rompedas.blogspot.com/2010/06/broadway-playwright.html

Poem Courtesy: http://www.bartleby.com/265/7.html

మధ్యంతరం … స్కడర్ మిడిల్టన్, అమెరికను కవి

నాకు అంత పెద్ద వయసు లేకపోయినా,

నువ్వు చిన్నదానివని తెలుసుకోగలను.

నన్ను చిగురాకు అని పిలుస్తారు

నువ్వు ఇప్పుడే విరిసిన మొగ్గవి.

.

అదిగో కొమ్మ మీద ఆ రాక్షసి ఉందే,

గొంగళి, అది నాపై ఒక పొర అల్లేలోగా

నేను నీతో పాటే కొంతకాలం ఎదుగుతాను

భ్రమర నాదం విని, మబ్బుల్ని తిలకిస్తాను.

.

స్కడర్ మిడిల్టన్

(Sept 9. 1888 –  1959)

అమెరికను కవి.

“Life is an interlude between two vast nothings” అని ఒక ఆలోచనా సరళి.

ఈ చిన్న కవిత లోనే కవి మంచి ప్రతీకలు వాడి జీవితం ఎంత క్షణికమో  చెబుతూ, అది ముగిసేలోగానే, మనం దాన్ని ఆస్వాదించాలి అని అంటాడు.  ఇందులో గొంగళిని మృత్యువుకి ప్రతీకగా వాడేడు. భ్రమర నాదం అనుభూతి చెందగలిగింది. మబ్బులు, ఊహలకీ, ఆశలూ, ఆశయాలకీ ప్రతీక. కాబట్టి ఇటు ఇంద్రియానుభవం, అటు ఆత్మానుభవం రెండూ సాధించడానికి ప్రయత్నించాలి అని సందేశం ఇస్తున్నాడు కవి. 

.

Interlude

.

I am not old but old enough

To know that you are very young.

It might be said I am the leaf,

And you the blossom newly sprung.

.

So I shall grow a while with you,

And hear the bee and watch the cloud,

Before dragon on the branch,

The caterpillar, weaves a shroud.

.

Scudder Middleton

(Sept 9. 1888 –  1959)

American Poet

(Unfortunately not much information about this poet is available except that he was born in New York city, educated at Columbia University and was associated with the publishing house Macmillan Company for long. He published two volumes of poetry… Streets and Faces (1917) and The New Day (1919)

(Poem Courtesy:  The Second  Book of Modern Verse ed. Jessie  B. Rittenhouse. P 69)

చిరంజీవి క్లియోపాత్రా… కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి

చిరంజీవి క్లియోపాత్రా, ఒకప్పుడు ఈజిప్టులో ఆరాధ్య దేవత

ఈ దక్షిణాది* యువరాణి కన్నులు, సతత రాగరంజితాలు,

పాపం, నేడు, వయసుడిగి, వరుగై, కళావిహీనమై

ముద్దులొలికిన ఆమె నోరు నల్లని తారుముద్దతో మూయబడింది.

.

సమాధి-కొల్లరులు ఆమె చేతుల స్వర్ణాంగుళులు పెకలించేరు

ఆమె గుండెలమీది పవిత్రచిహ్నాలను సైతం లక్ష్యపెట్టకుండా;

ఆమె చుట్టూ ప్రశాంతంగా తిరుగుతున్న గబ్బిలాలను అదిలించేరు

పాపం మహరాణి! ఆమె ఆత్మ ఎప్పుడో ప్రశాంతంగా ఉండేది,

.

చిర’కాల’  కాలగమనాన్ని పరిహసించడానికి, నేర్పుగా చుట్టి,

లేపనాలు పూసి, దక్షతతో ఇలా అశ్లీలంగా భద్రపరచకుండి ఉంటే!

దీన్ని ముందుగా ఊహించి ఉంటే ఆమె ప్రియుడు ఏమి అని ఉండే వాడో?

ఆనందంతో మునకలేసే వాడా? కన్నీటిఝరులలో తడిసి ఉండే వాడా?

.

లేబచ్చని పచ్చిక మొలిచే స్వచ్ఛమైన ఓ ప్రియ మృత్తికా!

నేనూ, నా ప్రేమాతిశయమూర్తీ గతించిన పిదప,

మాకు  నిద్రాభంగం కాకుండా మాపై దట్టంగా కమ్ముకో!

అంబరాన్ని అంటేలా పచ్చికనీ, పువ్వులనీ మాపై విరియనీ!

.

(Note:

*దక్షిణాది:  అప్పటి రోమను సామ్రాజ్యానికి దక్షిణంగా ఉంది ఈజిప్టు. రోమను సామ్రాజ్యం లో భాగం మాత్రం కాదు. క్లియోపాత్రా VII  చనిపోయిన తర్వాతే అందులో భాగం అయింది. )

కాన్రాడ్ ఐకెన్

(August 5, 1889 – August 17, 1973)

అమెరికను కవి

.

రాజీవ్ గాంధీ చనిపోయినపుడు, Indian Express పత్రిక అనుకుంటాను, ఒక అద్భుతమైన శీర్షిక పెట్టింది. “Fate denies him the dignity of Death” అని. ఆ మాటల వెనక ఎంత బాధ, ఎంత జాలి ఉన్నాయో  శీర్షిక చదవగానే అర్థమవుతుంది. ఈ కవిత చదవగానే నాకు అదే గుర్తొచింది.  జీవితకాలం ఒక వెలుగు వెలిగి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈజిప్షియనుల చిట్టచివరి ఫారో క్లియోపాత్రా VII. చివరికి ఆమె సమాధి దోపిడీకి గురై, ఆమె పార్థివ శరీరం ముష్కరులచే అపవిత్రమవడం ఒక రకంగా శాపమే.

అటువంటి యోగం తమకు కలక్కుండా చూడమని కవి ప్రార్థిస్తున్నాడు, పంచభూతాలలో ఒకటైన నేల తల్లిని.

.

Conrad Aiken
Conrad Aiken (Photo credit: Wikipedia)

 .

Dead Cleopatra

.

Cleopatra lies in a crystal casket,

Wrapped and spiced by the cunningest of hands.

Around her neck they have put a golden necklace

Her tatbebs*, it is said, are worn with sands.

.

Dead Cleopatra was once revered in Egypt

Warm-eyed she was, this princess of the south.

Now she is very old and dry and faded,

With black bitumen they have sealed up her mouth.

.

Grave-robbers pulled the gold rings from her fingers,

Despite the holy symbols across her breast;

They scared the bats that quietly whirled above her.

Poor lady! she would have been long since at rest

.

If she had not been wrapped and spiced so shrewdly,

Preserved, obscene, to mock black flights of years.

What would her lover have said, had he foreseen it?

Had he been moved to ecstasy, or tears?

.

O sweet clean earth from whom the green blade cometh!

When we are dead, my best-beloved and I,

Close well above us that we may rest forever,

Sending up grass and blossoms to the sky

.

Conrad Aiken

(August 5, 1889 – August 17, 1973)

American Poet

(Notes:

*Tatbeb: An ancient Egyptian Sandal ( a modification of  Egypt tebtebti (two ) Sandals, soles of the feet.  (Courtesy: Merriam – Webster Dictionary)

Poem Courtesy: http://www.bartleby.com/265/2.html

%d bloggers like this: