రోజు: డిసెంబర్ 31, 2012
-
నువ్వు హేమంతంలో వస్తే … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
నువ్వు గాని హేమంతంలో వస్తే నేను గ్రీష్మాన్ని తగిలేస్తాను గృహిణులు ఈగల్ని తోలేసినట్టు సగం చీదరతోనూ, సగం సంతోషంతోనూ . నిన్ను ఏడాదికొకసారైనా చూడగలిగితే నేను నెలలన్నిటినీ ఉండల్లా చుట్టి ఒక్కొకటీ ఒక్కో సొరుగులో దాచెస్తాను మళ్ళీ వాటి అవసరం వచ్చేదాకా . నీ రాక శతాబ్దాలు ఆలశ్యమైతే నేను వాటిని నా చేత్తో లెక్కపెడతాను ఒక్కొక్కవేలూ విరిచి చివరికి అన్నీ నా నేరానికి పరిహారంగా చెల్లించే వరకూ. . ఇక ఈ జీవితం ముగియనున్నప్పుడు, ఇద్దరికీ…