రోజు: డిసెంబర్ 29, 2012
-
శోకనాయిక … జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి
. కడలిమీద తుఫాను కమ్ముకుంటోంది పగలు చీకటిమయం, కెరటాలూ నలుపే దూరాన సీగల్స్,విషాదంగా అరుస్తూఎగురుతున్నాయి, కెరటాలు తుఫానుని తోసుకొస్తున్నాయి. . ఎడారినుండి వీస్తున్న పెనుగాలులకి నగరం తన మీనారుల తలలెత్తుతోంది బురుజులలోనూ, మీనారుల క్రిందా బందీలైన మహిళలు రోదిస్తున్నారు. . థెసలీలోని ఒకానొక పర్వతాగ్రాన, ఉపేక్షతో మరుగుపడ్డ కోవెల నాల్గుపక్కలా విరిగి స్థంభాలు క్రమంలో నిలిచి ఉన్నై, క్రింద తెల్లగా పండు వెన్నెల. . అయినా, సృష్టిలో నీ ముఖంలో ప్రతిబింబించేంత విషాదమూ, ఒంటరితనం ఎక్కడా కనిపించవు.…