మిణుగురుల సయ్యాట… కాన్రాడ్ అయికెన్, అమెరికను కవి
మెరిసే వలలాంటి ఉలిపొర వలువల్లో నను చూడు
చీకటిలోంచి వెలుగులోకి అలవోకగా ఇట్టే ఎగురుతూ
చప్పుడు చెయ్యకుండా తిరిగి చీకట్లోకి జారుకుంటాను!
మిణుగురును నేను, ఎవరికీ పట్టుదొరకను
.
నువ్వు మిణుగురువా? ఎవరి పట్టుకీ దొరకవా?
నేనుమాత్రం నిన్ను చీకటిలా వెన్నాడుతా
నిన్ను ఎప్పుడూ పట్టి గుప్పిట్లో మూసి, కడకి
నిశ్శబ్దంలో లయించే పిలుపులా నువ్వు నశించేదాకా.
.
కడకి నిశ్శబ్దంలో లయించే పిలుపులా నే నశించేదాకా…ఊం!
అయితే నువ్వేనా అంత ప్రశాంతంగా నా వెంటబడుతున్నది?
నా మంటలు నిన్నుచుట్టి దహించివేస్తాయి, అలాంటపుడు
నీ వేళ్ళు నన్నెలా పట్టుకోగలవు? నేను ఊరిస్తా గాని దొరకను
.
నిన్ను నా వేళ్లెలా పట్టుకోగలవా? నువ్వు ఊరిస్తావుగాని దొరకవా?
ఒకటి నిజం నువు మంటవే; అయితే, నిన్ను ప్రేమతో చుట్టుముడతాను
నేను చల్లదనాన్ని, జీవరాశి గతించినా, నేను చిరంజీవిని
నా హృదిలోని నిశ్శబ్ద-శూన్యంలో నిన్ను పొదువుకుంటాను.
.
నీ హృదిలోని నిశ్శబ్ద-శూన్యంలో నన్ను పొదువుకుంటావా?
ఓహ్!నిలకడలేని జీవితానికి ఎంత ఊరట; ఎంత కమ్మని ముగింపు!
భ్రమణభ్రమ జీవితంతో కొట్టుమిట్టాడిన నేను ఈక్షణమే ఆగుతునా,
నిదురమీది ప్రేమతో,ఇదిగో నేను నీలో ఐక్యమవుతున్నా.
.
కాన్రాడ్ అయికెన్,
(August 5, 1889 – August 17, 1973)
అమెరికను కవి
Conrad Aiken (Photo credit: Wikipedia)
.
Dancing Adairs…
.
Behold me, in my chiffon, gauze and tinsel,
Flitting out of the shadow into the spotlight,
And into the shadow again, without a whisper!—
Firefly’s my name, I am evanescent.
.
Firefly’s your name. You are evanescent.
But I follow you as remorselessly as darkness,
And shut you in and enclose you, at last, and always,
Till you are lost, as a voice is lost in silence.
.
Till I am lost, as a voice is lost in silence….
Are you the one who would close so cool about me?
My fire sheds into and through you and beyond you:
How can your fingers hold me? I am elusive.
.
How can my fingers hold you? You are elusive?
Yes, you are flame; but I surround and love you,
Always extend beyond you, cool, eternal,
To take you into my heart’s great void of silence.
.
You shut me into your heart’s great void of silence….
O sweet and soothing end for a life of whirling!
Now I am still, whose life was mazed with motion.
Now I sink into you, for love of sleep.
.
Conrad Aiken
(August 5, 1889 – August 17, 1973)
American Novelist , Poet, Short Story Writer
(Apologies: I am not able to get at the meaning of Adairs from any reference. I will be greatly obliged if anybody could enlighten me.)
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి