ప్రణయ తత్త్వము … షెల్లీ, ఆంగ్ల కవి

1

చిన్నచిన్ననీటిబుగ్గలు నదులలో కలుస్తే

నదులన్నీ సముద్రంలో కలుస్తాయి;

రసనిష్యందమైన భావనలతోనింగిలో కలుస్తాయి

సువాసనలు వెదజల్లే పిల్లగాలులు ; 

ప్రకృతిలో ఏదీ ఒంటరిదికాదు.

దైవసంకల్పం వలన ఆత్మలు

అన్యోన్యానురక్తితో ఏకమౌతున్నప్పుడు,

నేను నిన్నెందుకు కూడతగదు? 

2

అనంతాకాశాన్నిగిరిశిఖరాలు ముద్దాడుతున్నై

కెరటాలు ఒకదాన్నొకటి కాగలించుకుని పరుగిడుతునై;

ఒక చెట్టు పూలే, అయినా,ఒకదాన్నొకటి

నిరశించి పెడముఖం పెట్టడం లేదే;

వేల బాహువులతో సూర్యుడు భూమిని ఆలింగనం చేస్తున్నాడు

చంద్రకిరణాలుకూడా సముద్రాన్ని చుంబిస్తున్నై

ఇంతటి ప్రకృతి రాగరసార్ణవానికీ ప్రయోజనమేముంది

 ప్రేమతో నువ్వు నను ముద్దాడనపుడు?

.

షెల్లీ

4 August 1792 – 8 July 1822 

ఆంగ్ల కవి

.

PB Shelly
PB Shelly

http://en.wikipedia.org/wiki/Percy_Bysshe_Shelley

.

Love’s Philosophy

.

1

The fountains mingle with the river
And the rivers with the Ocean,
The winds of Heaven mix for ever
With a sweet emotion;
Nothing in the world is single;
All things by a law divine
In one spirit meet and mingle.
Why not I with thine?

 2.

See the mountains kiss high Heaven
And the waves clasp one another;
No sister-flower would be forgiven
If it disdained its brother;
And the sunlight clasps the earth
And the moonbeams kiss the sea:
What is all this sweet work worth
If thou kiss not me?

(NOTES:
Line 3 :     mix for ever 1819, Stacey manuscript;  meet together, Harvard manuscript.

Line 7: In one spirit meet and Stacey manuscript;  In one another’s being 1819, Harvard manuscript.

Line 11: No sister 1824, Harvard and Stacey manuscripts; No leaf or 1819.

Line 12: disdained its 1824, Harvard and Stacey manuscripts;  disdained to kiss its 1819.

Line 15: is all this sweet work Stacey manuscript;  were these examples Harvard manuscript;  are all these kissings 1819, 1824.

Text Courtesy:

http://www.online-literature.com/shelley_percy/complete-works-of-shelley/85/

.

(వేరొక వస్తువుగురించి Internetలో వెతుకుతుంటే, నాకు కాకతాళీయంగా  కవితాసమితికి చెందిన వడ్డాది సీతారామాంజనేయులుగారి ఈ షెల్లీకవిత అనువాదం నా కంట పడింది.  కవితా సమితి అంటే, శ్రీశ్రీ, మారేపల్లి రామచంద్రశాస్త్రి మొదలైన హేమాహేమీలు సభ్యులుగా ఉన్న  విశాఖపట్టణానికి చెందిన ఒకప్పటి సాహిత్య సంస్థ. ఈ అనువాదం సుమారు 80 సంవత్సరాల క్రిందటి మాట. 20వ శతాబ్దంలో తెలుగువారిని షెల్లీ కీట్స్ మొదలైన వాళ్ళు ఎంత ప్రభావితం చేశారో చెప్పడానికి ఇది ఉపకరిస్తుంది. అంతే కాదు, పద్యకవులైనా, ఆంగ్లకవిత్వాన్ని ఎంత చక్కగా అధ్యయనం చేసి అనువదించేరో కూడా స్పష్టం చేస్తుంది. ఇది పద్యంలో ఉండడంవల్ల కొందరికి అర్థంచేసుకోవడం కొంచెంకష్టం అనిపించవచ్చు గానీ, అనువాదం గొప్పగా ఉంది. కొంతమందికైనా ఇది నచ్చుతుందనీ, వారి కుటింబీకులెవరైనా ఉంటే, ఎప్పుడయినా వారికంట ఇది పడితే దీన్ని చూసి సంతసిస్తారనీ, ఇక్కడ ఉదహరిస్తున్నా. వడ్డాది సీతారామాంజనేయులుగారికి నా నమోవాకాలు.)

ప్రణయ తత్త్వము….

సెలయేఱుల్ నది జేరు, వాహినులొగిన్ జేపట్టు వారాశి గ
మ్రలసద్దివ్యసమీరణంబొలయు సౌరభ్యైక మాధుర్యతా
కలిమిన్, విశ్వనియంతృతన్ జగతి నేకాకిత్వమే లేదు, పొం
దలరున్, గావున నిన్ను జేరుటకు నేలా నాకు శంకింపగన్?

సీ|| పరికింపుమా వియద్భాగంబు జుంబించు ప్రాంచదుత్తుంగ పర్వత చయంబు,
అవె తరంగంబులన్యోన్యసంశ్లేషాను మోద పయోరాశి బొదలుచుండు
జంటపూవులు పరస్పర మనుజాతుల క్రియనుండు దమి నేవగింపు లేక
తులకించు వేయిచేతుల నంశుమంతుడీ యవని బరీరంభమావరించు
గీ|| చంద్రికావళిముద్దాడు సలిలరాశి
నిన్ని ముద్దుల మురువు లవన్ని యెన్న
నేమి కొఱయగు? నిప్పుడింపెసగ మెసగ
హర్షమున నీవు నను ముద్దాడవేని?

.

అష్టావధాని వడ్డాది సీతామాంజనేయులు, కవితాసమితి

సమదర్శిని 1929 -30 ఉగాది సంచిక

(http://archive.org/stream/samadarsin19293000unknsher#page/n27/mode/1up)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: